Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber ఎలా ఉపయోగించాలో తెలిపే గైడ్

మీరు పట్టణం అంతటా పని మీద ప్రయాణం చేస్తున్నా లేదా ఇంటి నుండి దూరంగా ఉన్న నగరాన్ని అన్వేషిస్తున్నా, అక్కడికి సులభంగా చేరుకోగలగాలి. Uber యాప్‌తో రైడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

search
లొకేషన్‌ను నమోదు చేయండి
Navigate right up
search
గమ్యస్థానాన్ని నమోదు చేయండి

Uber యాప్‌ను ఎలా ఉపయోగించాలి

ఖాతాను రూపొందించండి

All you need is an email address and phone number. You can request a ride from your browser or from the Uber app. To download the app, go to the App Store or Google Play.

మీ గమ్యస్థానాన్ని నమోదు చేయండి

యాప్‌ని తెరిచి, ఎక్కడికి వెళ్లాలి? బాక్స్‌లో మీరు ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేయండి. మీ పికప్ లొకేషన్‌ను నిర్ధారించడానికి నొక్కండి మరియు సమీపంలోని డ్రైవర్‌తో సరిపోలడానికి మళ్ళీ నిర్ధారించండి నొక్కండి.

మీ డ్రైవర్‌ను కలవండి

వారు చేరుకోవడం మీరు మ్యాప్‌లో తెలుసుకోవచ్చు. వారు కొన్ని నిమిషాల దూరంలో ఉన్నప్పుడు, మీ పికప్ లొకేషన్‌లో వారి కోసం వేచి ఉండండి.

మీ రైడ్‌ను పరిశీలించండి

మీరు Uberలో ట్రిప్ తీసుకునే ప్రతిసారీ, దయచేసి మీ యాప్‌లో అందించిన లైసెన్స్ ప్లేట్, కారు తయారీ మరియు మోడల్ మరియు డ్రైవర్ ఫోటోలను సరిపోల్చుకోవడం ద్వారా మీరు సరైన డ్రైవర్‌తో సరైన కారులోనే వెళ్తున్నారని నిర్ధారించుకోండి.

Uber ట్రిప్‌లను యాప్ ద్వారా మాత్రమే అభ్యర్థించడం వీలవుతుంది, కాబట్టి మీ యాప్‌లో కనిపించే వాటితో' వాహనం లేదా డ్రైవర్ గుర్తింపు సరిపోలకపోతే అటువంటి కారులో ఎప్పుడూ వెళ్లవద్దు.

తీరిగ్గా కూర్చుని విశ్రాంతి తీసుకోండి

మీరు చేరుకున్నప్పుడు, చెల్లింపు చేయడం సులభం. మీ ప్రాంతాన్ని బట్టి, మీకు ఎంపికలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లేదా Uber Cash బ్యాలెన్స్ వంటి క్యాష్ లేదా చెల్లింపు పద్ధతిని ఉపయోగించండి.

మీ ట్రిప్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ ట్రిప్ ఎలా జరిగిందో మాకు తెలియజేయండి. మీరు మీ డ్రైవర్‌కు అభినందనలు తెలుపవచ్చు లేదా యాప్‌లో టిప్‌ను జోడించవచ్చు.

ప్రారంభం నుండి ముగింపు వరకు సాఫీగా సాగే రైడ్‌లు

నిజ సమయంలో ముందస్తు ధర

మీరు ట్రిప్‌ను నిర్ధారించడానికి ముందు, ధరల అంచనాలను చూడండి, తద్వారా మీరు ధరలను ఊహించాల్సిన అవసరం లేకుండా ధరలను పోల్చి చూసి ప్రతిసారీ సరైన రైడ్‌ను కనుగొనవచ్చు.

మీ పికప్‌ను పర్ఫెక్ట్‌ చేయండి

మీరు రైడ్‌ను అభ్యర్థించినప్పుడు, మీ డ్రైవర్‌ను కలవడానికి అనువైన స్థలాన్ని యాప్ దానంతటదే సూచిస్తుంది. మీ లొకేషన్‌ని సర్దుబాటు చేయడానికి, కొత్త చిరునామాను టైప్ చేయండి లేదా మీ పిన్‌ను బూడిద రంగు సర్కిల్‌తో కూడిన మ్యాప్‌లోకి లాగండి.

వాహనమును నడిపే వ్యక్తి గురించి తెలుసుకోండి

రేటింగ్‌లు మరియు అభినందనలతో పాటు మీ డ్రైవర్ గురించి సరదా వాస్తవాలను చూడటానికి యాప్‌లోని డ్రైవర్ ప్రొఫైల్‌ను చూడండి.

రేటింగ్‌లు మరియు టిప్‌లు

ట్రిప్‌లకు రేటింగ్ ఇవ్వడం ద్వారా మీ అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడండి. అద్భుతమైన డ్రైవర్ మీకు గొప్ప సేవను అందిస్తే, మీరు టిప్‌ను కూడా జోడించవచ్చు.

ప్రతి రైడ్‌లో మానసిక ప్రశాంతత

డ్రైవర్ స్క్రీనింగ్ మరియు ఇన్స్యూరెన్స్ నుంచి మీ ట్రిప్‌ని ట్రాక్ చేయడానికి మరియు కనెక్ట్ కావడానికి మిమ్మల్ని అనుమతించే యాప్ ఫీచర్‌ల వరకు, మీ భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రయాణించే మార్గాలు

10,000 కంటే ఎక్కువ నగరాల్లో వివిధ రకాల రైడ్‌లకు యాక్సెస్‌‌తో మీరు అనుకున్న చోటికి వెళ్లడానికి Uber యాప్ మీకు శక్తిని ఇస్తుంది.

Uber లైట్‌ను పరిచయం చేస్తున్నాము

సరళమైన, క్రొత్త యాప్‌లో అదే నమ్మకమైన రైడ్‌లను పొందండి. స్టోరేజ్ స్థలం మరియు డేటాను ఆదా చేసేటప్పుడు ఏ Android ఫోన్‌లో అయినా Uber లైట్ పని చేస్తుంది. ఇంకా, ఇది ఉపయోగించడానికి సులభం మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రాంతాలలో పని చేసే విధంగా రూపొందించబడింది.

Uber లైట్‌ను పరిచయం చేస్తున్నాము

సరళమైన, క్రొత్త యాప్‌లో అదే నమ్మకమైన రైడ్‌లను పొందండి. స్టోరేజ్ స్థలం మరియు డేటాను ఆదా చేసేటప్పుడు ఏ Android ఫోన్‌లో అయినా Uber లైట్ పని చేస్తుంది. ఇంకా, ఇది ఉపయోగించడానికి సులభం మరియు తక్కువ కనెక్టివిటీ ఉండే ప్రాంతాలలో పని చేసే విధంగా రూపొందించబడింది.

Limeతో మరింత దూరం వెళ్ళండి

Uber యాప్ ఉపయోగించి కొన్ని నగరాల్లో Lime ఇ-బైక్ లు మరియు ఇ-స్కూటర్‌లను మీరు అద్దెకు తీసుకోవచ్చని మీకు తెలుసా? మీకు సమీపంలో ఉన్న వాహనాలను కనుగొనడానికి యాప్‌లోని సూచనలను అనుసరించండి.

రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు

  • మీరు గరిష్టంగా 30 రోజుల ముందుగానే రైడ్‌ను షెడ్యూల్ చేయవచ్చు. యాప్‌ను తెరిచి, ఎక్కడికి వెళ్లాలి? గమ్యస్థానం బాక్స్ పక్కన ఉన్న కార్-అండ్-క్లాక్ చిహ్నంపై నొక్కండి.

  • యాప్‌ని తెరిచి ఎక్కడికి వెళ్లాలి? గమ్యస్థానం బాక్స్‌పై నొక్కండి. ఇది రైడర్‌ను మార్చండి స్క్రోల్-డౌన్ ఎంపికను తెరుస్తుంది. దానిపై నొక్కి, మీ స్నేహితుడిని ఎంచుకోండి. వారు కారు మోడల్ మరియు లైసెన్స్ ప్లేట్, డ్రైవర్ పేరు, కాంటాక్ట్ సమాచారం మరియు ETAతో సహా ట్రిప్ వివరాలతో టెక్స్ట్ సందేశాన్ని అందుకుంటారు.

  • సమయం మరియు దూరం ఆధారంగా ధరలు లెక్కించబడతాయి. అవి సర్‌చార్జీలు, మీ ట్రిప్‌లో ఎదురయ్యే టోల్‌లు,వర్తిస్తే రద్దు ఫీజులు మరియు నిరీక్షణ సమయాల రుసుములు మరియు బుకింగ్ ఫీజులకు లోబడి ఉంటాయి.

    ముందస్తు ధరను లెక్కించడానికి వందలాది డేటా పాయింట్‌లు పరిగణనలోనికి తీసుకోబడతాయి. ఇది అంచనా వేసిన ట్రిప్ సమయం, ఆరంభం నుండి గమ్యస్థానానికి ఉండే దూరం, రోజులోని సమయం, మార్గం మరియు డిమాండ్ నమూనాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో టోల్‌లు, పన్నులు, ఇతర ఫీజులు మరియు అధిక పన్నులు కూడా ఉన్నాయి.

  • రేటింగ్‌లు రెండు విధాలుగా ఉంటాయి. స్నేహపూర్వక సంభాషణలు చేయడం, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తలుపులు దభాలున వేయకుండా ఉండటంతో పాటు వారి కారు మరియు ఆస్తిని గౌరవించడం, మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు వారిని దృష్టి మళ్లించకుండా ఉంచడం వంటివి డ్రైవర్‌ల నుండి మేము ఎక్కువగా వినే కొన్ని అభిప్రాయాలు. మరిన్ని సలహాల కోసం, మా కమ్యూనిటీ మార్గదర్శకాలను సందర్శించండి.

  • మీ రైడ్‌కు ముందు లేదా రైడ్ సమయంలో మీరు 2 వరకు అదనపు స్టాప్‌లను జోడించవచ్చు. మీ చిరునామాను నమోదు చేయడానికి ఎక్కడికి వెళ్లాలి? గమ్యస్థానం బాక్స్ పక్కన ఉన్న+ నొక్కండి. మీ గమ్యస్థానం చేరడానికి పట్టే సమయం మరియు దూరం ఆధారంగా మీ ధర సర్దుబాటు చేయబడవచ్చు.

*ఫీచర్ Uber లైట్ యాప్‌లో అందుబాటులో లేదు. ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించినది, అది మీ దేశం, ప్రాంతం లేదా నగరంలో వర్తించకపోవచ్చు. ఈ సమాచారం మార్పుకు లోబడి ఉండటంతో పాటు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా అప్‌డేట్ కావచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو