Please enable Javascript
Skip to main content

ఆడియో రికార్డింగ్

సురక్షిత రైడ్‌ లేదా డ్రైవింగ్ హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని మేము అర్థం చేసుకోగలము. అందుకే 'సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడం మరియు మా రైడ్‌లను మరింత సురక్షితంగా చేసే మార్గాలను కనుగొనడంపై మా దృష్టి ఉంది.

భద్రతే మా ప్రాధాన్యత

మీ రైడ్ సమయంలో మీకు అసౌకర్యం అనిపిస్తే, మీరు యాప్‌లోనే ఇప్పుడు ట్రిప్ ఆడియోను రికార్డ్ చేయవచ్చు.

ఆడియో రికార్డింగ్ ఎంపికను యాక్సెస్ చేయడానికి భద్రతా ఫీచర్ షీల్డ్‌ను క్లిక్ చేయండి. ట్రిప్‌ యాప్‌లో రికార్డ్ చేయబడుతుంది మరియు రైడ్ ముగిసిన తర్వాత మీరు దాన్ని Uber‌తో పంచుకోవడానికి ఎంచుకోవచ్చు.

మీ ప్రైవసీ పరిరక్షించబడుతుంది

వాహనంలోని వేరే వ్యక్తులకు తెలియజేయబడదు. అన్ని ఆడియోలు ఎన్‌క్రిప్ట్‌ చేయబడతాయి మరియు మీ పరికరంలోనే ఉంటాయి. డ్రైవర్‌లు లేదా రైడర్‌లు రికార్డింగ్ వినలేరు.

దర్యాప్తు చేయడంలో Uberకు సహకరించండి

భద్రతా నివేదికలను మేము తీవ్రంగా పరిగణిస్తాము. మీరు ఒకదాన్ని ఫైల్ చేసినట్లయితే, మా భద్రతా బృందం మీరు జోడించిన రికార్డింగ్‌ను సమీక్షిస్తుంది.

తరచూ అడిగే ప్రశ్నలు

  • ఆడియో రికార్డింగ్ యాప్‌ ద్వారా అందించే కొత్త సామర్ధ్యం, ట్రిప్‌లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన పరస్పర చర్యలను ప్రోత్సహించడానికి ఇది రూపొందించబడింది. రికార్డింగ్‌లను వినియోగదారు మాత్రమే యాక్టివేట్ చేయగలరు మరియు అవి పరికరంలో సురక్షితంగా స్టోర్ చేయబడతాయి. వాటిని ఎవరూ వినలేరు మరియు అవి Uber యాప్‌ ద్వారా పంపిన భద్రతా నివేదికకు మాత్రమే జతచేయబడతాయి. ఇది జరగకపోతే, Uber కంటెంట్‌లలో దేన్నీ యాక్సెస్ చేయలేదు.

  • ఇది భద్రతా టూల్‌కిట్ ద్వారా లభిస్తుంది, ట్రిప్ తీసుకునేటప్పుడు మ్యాప్‌లోని షీల్డ్ చిహ్నాన్ని ట్యాప్ చేయడం ద్వారా దీన్ని కనుగొనవచ్చు.

    మేము ప్రస్తుతం రైడర్‌ల కోసం ఆడియో రికార్డింగ్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాము. ఇది రాబోయే వారాల్లో మళ్లీ అందుబాటులో ఉంటుంది

  • ఫీచర్ అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన నగరాల్లో, రైడర్‌లు మరియు డ్రైవర్‌లు తమ సొంత స్మార్ట్‌ఫోన్ ద్వారా రికార్డింగ్‌ను ప్రారంభించవచ్చు. ఈ సామర్ధ్యం అందుబాటులో ఉందని రైడర్‌లు మరియు డ్రైవర్‌లందరికీ నోటీసు ఇచ్చినప్పటికీ, వాహనంలోని వేరే పార్టీలకు తెలియజేయబడదు.

  • రైడర్‌లు మరియు డ్రైవర్‌లు ఇద్దరూ తమ పరికరం ద్వారా వేర్వేరుగా రికార్డ్ చేయడానికి ఎంచుకోవచ్చు. భద్రతా నివేదికకు జత చేసినప్పుడు మాత్రమే Uber రికార్డింగ్ వినగలదు. చట్టపరంగా అవసరమైన సందర్భాలలో, షేర్ చేసిన రికార్డింగ్‌ను Uber పోలీసు శాఖ వంటి సంబంధిత అధికారులకు అందించవచ్చు.