Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పెంపుదలతో కూడిన ధరలు ఎంపిక ఎలా పని చేస్తుంది

తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైడ్ కావాలని కోరుకునే వ్యక్తులు డ్రైవర్‌తో త్వరగా కనెక్ట్ కావడంలో పెంచబడిన ధరలు ఏ విధంగా సహకరిస్తాయో తెలుసుకోండి.

ఇది ఎలా పని చేస్తుంది

రైడ్‌లకు డిమాండ్ పెరుగుతుంది

కొన్ని సార్లు చాలా ఎక్కువ మంది వ్యక్తులు రైడ్‌లను అభ్యర్థిస్తున్నప్పటికీ, వారందరికీ తగినన్ని కార్లను ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు, వాతావరణ ప్రతికూలత, రద్దీ సమయాలు మరియు ప్రత్యేక సందర్భాలు వంటి సమయాలలో అసాధారణంగా చాలా ఎక్కువ మంది వ్యక్తులు ఒకే సమయంలో Uber నుండి రైడ్‌ను అభ్యర్థించడం వంటి వాటికి దారి తీయవచ్చు.

ధరలు పెరుగుతాయి

డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఈ సందర్భాలలో, రైడ్ కావాలని కోరుకునే వ్యక్తులకు రైడ్ అందేలా సహాయపడేందుకు ఛార్జీ మొత్తాలు పెరగవచ్చు. ఈ విధానాన్ని ధరల పెంపుదల అంటారు మరియు ఇది Uber యాప్ ఒక విశ్వసనీయమైన ఎంపికగా కొనసాగడానికి సహకరిస్తుంది.

రైడర్‌లు ఎక్కువ మొత్తాలు చెల్లిస్తారు లేదా వేచి ఉంటారు

ధరల పెంపుదల కారణంగా ధరలు పెరిగినప్పుడు, ఆ విషయాన్ని Uber యాప్ ద్వారా రైడర్‌లకు తెలియజేయడం జరుగుతుంది. కొందరు రైడర్‌లు వెంటనే చెల్లిస్తారు, అయితే కొందరు రైడర్‌లు ధరలు తగ్గుతాయేమో చూసేందుకు కొన్ని నిమిషాలపాటు వేచి ఉంటారు.

ధరలలో పెంపుదల ఏ విధంగా గణించబడుతుంది?

ధరలు పెరుగుతున్నప్పుడు, ప్రామాణిక రేట్లకు గుణకం, అదనపు సర్జ్ ఛార్జ్ మొత్తం, లేదా సర్జ్ ఛార్జ్‌ చేర్చబడిన ముందస్తు ఛార్జీ మీ ఆఫర్ కార్డ్‌లో చూపబడతాయి. ఇది మీ నగరాన్ని బట్టి మారుతుంది. ధరల పెంపుదల సమయాలలో Uber సేవా రుసుము శాతంలో ఎలాంటి మార్పు ఉండదు.

రేట్లు రియల్ టైమ్ డిమాండ్ ఆధారంగా అప్‌డేట్ చేయబడతాయి కాబట్టి ధరల పెంపుదల త్వరగా మారవచ్చు. ధరలలో పెంపుదల నగరంలోని నిర్దిష్ట ప్రాంతాలకు నిర్దిష్టంగా ఉంటుంది, కాబట్టి పొరుగున ఉండే కొన్ని ప్రాంతాలలో ధరల పెంపుదల ఉంటే అదే సమయంలో ఇతర ప్రాంతాలలో పెంపుదల ఉండకపోవచ్చు.

యాప్‌లో ధరల పెంపుదలను గుర్తించడం ఎలా

ఒక నిర్దిష్ట ప్రాంతంలో డిమాండ్ పెరిగినప్పుడు మీ నగరంలో ధరల పెంపుదల వర్తిస్తే, ఆ పరిసర ప్రాంతం రంగు మారుతుంది. మ్యాప్‌లోని రంగుల ప్రాంతాలు లేత నారింజ రంగు నుండి ముదురు ఎరుపు రంగుల వరకు ఉంటాయి. లేత నారింజ ప్రాంతాలు ధరల పెంపుదల నుండి వచ్చే తక్కువ ఆదాయ అవకాశాలను సూచిస్తాయి, అదే విధంగా ముదురు ఎరుపు ప్రాంతాలు ఎక్కవ ఆదాయ అవకాశాలను సూచిస్తాయి.

మేము మార్కెట్‌ప్లేస్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుండగా, ఈ సైట్‌లో పేర్కొనని మార్గాల్లో మేము పనితీరును మరియు ధరలను పరీక్షించవచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو