చెల్లింపులు ఎలా పని చేస్తాయి
మీరు Uberతో డ్రైవ్ చేసినప్పుడు, మీ ఆదాయాలు ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతాయి, కాబట్టి వాటిని ప్రత్యేకించి వ్రాసి పెట్టుకోవడం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఖాతాను ఎలా జోడించాలి మరియు క్యాష్ అవుట్ ఎలా చేయాలి అనే విషయాలను కనుగొనండి.
డెలివరీ సమాచారం కోసం చూస్తున్నారా?
బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ని ఎలా సెటప్ చేయాలి
1. యాప్‌ని ఉపయోగించండి లేదా ఆన్‌లైన్‌లో సైన్ ఇన్ చేయండి
డ్రైవర్ యాప్‌లో మీ బ్యాంక్ ఖాతాను జోడించడానికి, యాప్ మెనులో చెల్లింపులుకి వెళ్లండి. ప్రత్యామ్నాయంగా, driver.uber.comని సందర్శించి, సైన్ ఇన్ చేసి, మీ డ్యాష్‌బోర్డ్‌లోని బ్యాంకింగ్ ట్యాబ్‌కు వెళ్లండి.
2. మీ బ్యాంక్ వివరాలను జోడించండి
మీ బ్యాంక్ వివరాలు, పూర్తి చిరునామా మరియు పుట్టిన తేదీని ఇటీవలి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో కనిపించిన విధంగా పూరించండి. ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, మీ డిపాజిట్ ఆలస్యం కావచ్చు.
3. మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని కనుగొనలేకున్నారా?
మీరు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మీ బ్యాంక్ వివరాలను కనుగొనవచ్చు. మీకు ఇంకా ఏవైనా అదనపు సందేహాలు ఉంటే, మీ బ్యాంక్‌ని సంప్రదించండి.
Uberకు చెల్లింపులను ఎలా సమర్పించాలి
మీరు సేకరించిన డబ్బులో కొంత భాగాన్ని మీ వద్ద ఉంచుకుని, మరొక భాగాన్ని Uberకు చెల్లించాలి. Uber పార్ట్‌నర్ యాప్‌లోని లావాదేవీ కార్యకలాపాల స్క్రీన్‌లో మీరు Uberకు చెల్లించాల్సిన డబ్బును ట్రాక్ చేయవచ్చు.
తిరిగి చెల్లింపు ఎంపికల గురించి మరియు ఎలా సెటప్ చేయాలనే దాని గురించి తెలుసుకోవడానికి క్రింద చదవండి.
1. ఆన్‌లైన్‌లో చెల్లించండి
ధశలు
యాప్‌లో చెల్లింపు గడువు నోటిఫికేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా - యాప్‌లో ఆన్‌లైన్‌లో ఎక్కడి నుండైనా చేయండి.
మీరు ఆన్‌లైన్‌లో చెల్లించినట్లయితే, చెల్లింపు వెంటనే మీ ఖాతాలో సర్దుబాటు అవుతుంది మరియు మీ ఫ్లీట్ 15-30 నిమిషాల్లో తిరిగి యాక్టివేట్ అవుతుంది.
లేదా
- దయచేసి Google ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి BHIM యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- BHIM యాప్‌ని తెరవండి
- దయచేసి BHIM యాప్‌లో మీకు కావలసిన భాషను ఎంచుకోండి
- దయచేసి రిజిస్టర్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని వెరిఫై చేయండి. OTP అభ్యర్థన యాప్‌లోనే జరుగుతుంది, అందులోనే ఆటోమేటిక్‌గా స్వీకరించబడుతుంది. OTPని మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తదుపరిపై క్లిక్ చేయండి
- దయచేసి మీరు క్రియాశీల బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోండి మరియు ఇది మీ Uber ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ అని నిర్ధారించుకోండి
- లావాదేవీల అధికార ధృవీకరణ కోసం UPI PIN ఉపయోగించబడుతుంది.
- మీరు వేరొక UPI ఆధారిత యాప్‌లో UPI PINను సెట్ చేస్తే, మీరు BHIM యాప్‌లో కూడా అదే UPI PINను ఉపయోగించవచ్చు.
- తదుపరి దశలో, దయచేసి మీ డెబిట్ కార్డ్ యొక్క చివరి 6 అంకెలను మరియు గడువు తేదీని ఇన్‌పుట్ చేయండి. సరే నొక్కండి.
- బ్యాంక్ OTP అభ్యర్థన యాప్‌లో చేయబడుతుంది, దానిలోనే ఆటోమేటిక్‌గా స్వీకరించబడుతుంది. OTPని మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
- దయచేసి మీ కొత్త UPI PIN (mPIN)ని సెట్ చేయండి. నిర్ధారించడానికి దయచేసి UPI PINను మళ్లీ ఎంటర్ చేయండి.. మీ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది.
- BHIM యాప్ సరిగ్గా పనిచేస్తోందో లేదో నిర్ధారించుకోవడానికి, దయచేసి యాప్ నుండి మీ ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసి వెరిఫై చేసుకోండి.
- మీ వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) ID లేదా UPI IDని సెట్ చేయడానికి దయచేసి 'ప్రొఫైల్' పేజీకి వెళ్లండి. ఒక పార్ట్‌నర్ ఒకే బ్యాంక్ ఖాతా కోసం రెండు వర్చువల్ పేమెంట్ అడ్రస్‌లను సెటప్ చేయవచ్చు.
- BHIM యాప్‌లో 3 ఎంపికలు ఉన్నాయి - “పంపండి”, “స్వీకరించండి” మరియు “స్కాన్ చేసి & చెల్లించండి"
- ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలిపే వీడియోతో మరో 5 నిమిషాల్లో మీరు మా నుండి సందేశాన్ని అందుకుంటారు. మీ UPI ఖాతాను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడానికి దయచేసి దాన్ని పూర్తిగా చూడండి.
2. ఆఫ్‌లైన్‌లో చెల్లించండి
ధశలు
- నగరంలోని నగదు సేకరణ కేంద్రాల గురించి తెలుసుకోవడానికి, దయచేసి ఇక్కడకు వెళ్లండి:
- యాప్‌లో సహాయక విభాగం >> యాప్‌ని ఉపయోగించడం >> చెల్లింపుు సహాయం >> కేంద్రాల జాబితా
- నగరంలోని అన్ని నగదు సేకరణ కేంద్రాలతో కూడిన Google మ్యాప్ తెరవబడుతుంది
- మీరు మీ సమీప కేంద్రాన్ని క్లిక్ చేసి, ఆ కేంద్రానికి నావిగేట్ చేయవచ్చు
- మీరు వ్యాపారికి నగదు చెల్లించవచ్చు, చెల్లింపు మీ ఖాతాలో సర్దుబాటు అవుతుంది మరియు మీ ఫ్లీట్ 15-30 నిమిషాల్లో తిరిగి యాక్టివేట్ అవుతుంది.
- నగరంలోని నగదు సేకరణ కేంద్రాల గురించి తెలుసుకోవడానికి, దయచేసి ఇక్కడకు వెళ్లండి:
3. పార్ట్‌నర్ సేవా కేంద్రం
దశలు
- వీటికి సంబంధించి మీకు సహాయం అవసరమైతే దయచేసి పార్ట్‌నర్ సేవా కేంద్రాన్ని సందర్శించండి:
- స్మార్ట్‌ఫోన్
- బ్యాంక్ ఖాతా యొక్క ATM/డెబిట్ కార్డ్
- బ్యాంక్‌తో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ SIM
- UPI యాప్‌ని ఇన్‌స్టాల్ చేసే విషయంలో వారు మీకు సహాయపడతారు, మీరు దీన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. చెల్లింపు కోసం ఉపయోగించే బ్యాంక్ ఖాతా లేదా VPAలో తగినంత డబ్బు ఉండాలని దయచేసి గమనించండి.
- BHIM యాప్‌తో మీ UPI ID లింక్ అయిన తర్వాత, భవిష్యత్తులో చెల్లింపులు చేయడానికి మీరు PSKకి రావాల్సిన అవసరం లేదు.
- మీరు ఏజెంట్‌కు చెల్లించవచ్చు, చెల్లింపు మీ ఖాతాలో సర్దుబాటు అవుతుంది మరియు మీ ఫ్లీట్ 24 గంటల్లో తిరిగి యాక్టివేట్ అవుతుంది.
ముఖ్య గమనిక:
మీరు క్యాష్ డెలివరీల నుండి సేకరించిన నగదును మీ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము. తద్వారా Uberకి బకాయిని చెల్లించాల్సిన సమయంలో మీ ఖాతాలో తగినన్ని నిధులు ఉండేలా చూసుకోవచ్చు. Uber వారానికి ఒకసారి చెల్లింపును సేకరిస్తుంది.
Uber చెల్లింపును సేకరించలేకపోతే, నగదు లావాదేవీలతో కూడిన డెలివరీ ట్రిప్‌లకు మీరు యాక్సెస్‌ను కోల్పోవచ్చు. Uber ఒకటి కంటే ఎక్కువ చెల్లింపులను సేకరించలేకపోతే, మీ డెలివరీ ఖాతా డీయాక్టివేట్ అవవచ్చు.
మరిన్ని అంశాల గురించి తెలుసుకోండి
ఈ వెబ్ పేజీలో అందించిన సమాచారం పూర్తిగా సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే, అవి మీ దేశం, ప్రాంతం లేదా నగరానికి వర్తించకపోవచ్చు. ఇది మార్పుకు లోబడి ఉంటుంది, ఎలాంటి నోటీసు లేకుండా అప్‌డేట్ చేయవచ్చు.
కంపెనీ