Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పని చేయడానికి మెరుగైన మార్గం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్‌లు, డెలివరీ చేసేవారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి మద్దతును ఇస్తున్నాము.

కొవిడ్-19 మహమ్మారి ప్రభావం పట్టి పీడిస్తున్నప్పుడు, డ్రైవర్లు, డెలివరీ చేసేవారు అక్షరాలా ప్రపంచాన్ని కదిలించారు. మనలో చాలా మందికి ఇంటి వద్దే ఉండి, సామాజిక కాంటాక్ట్‌ను తగ్గించమని సలహా ఇచ్చారు, అందువలన మనకు అవసరమైన వస్తువులను పొందడానికి లేదా మనం వెళ్లవలసిన అవసర ప్రదేశాలకు చేరడానికి వారు మనకు అందించిన సహాయం పాత్ర కీలకమైనది.

నగరాలు, కమ్యూనిటీల సమైక్యతకు డ్రైవర్లు, డెలివరీ చేసేవారు ఎంత అవసరం అనేది మహమ్మారి సమయంలో స్పష్టమైనంతగా గతంలో ఎప్పుడూ కాలేదు. వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైడర్‌లు, ఆహారాన్ని, ప్యాకేజీలను పొందడమే కాదు -వారు ప్రజల జీవితాలపైన కూడా ప్రభావం చూపుతున్నారు. ఒక రైడర్‌కు చెడ్డరోజన వారు అతను చెప్పేది వినడానికి సమయం వెచ్చించి ఉండవచ్చు లేదా ఆహార పంపిణీ సమయంలో తోట గేటు వద్ద ఆగి వృద్ధులైన గృహవాసితో ఎంతో అవసరమైన సంభాషణను సాగించి ఉండవచ్చు.

అందుకే మా CEOగిగ్ వర్కర్‌లు ఇంకా మెరుగైన వాటికి అర్హులు అని పేర్కొన్నారు. యూరప్‌లో ఉన్నవారికి ఒక మంచి ఒప్పందం అని మేము ప్రకటించాము. అందువల్ల మేము ఉచిత డిగ్రీ కార్యక్రమాలను అందించడానికి , ASU ఇంకా ఓపెన్ యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. అందువల్లనే మేముప్రపంచవ్యాప్తంగా డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో సహాయపడటానికి మద్దతు ఇవ్వడానికి మేము చేయగలిగినదంతా చేస్తాము.

ఎలక్ట్రిక్ వాహనాలకు సమానత్వంతో కూడిన పరివర్తనను ప్రోత్సహించడం

మా Uber Green ఉత్పత్తిని, మా 2040 నాటికి ఉద్గార రహిత వాగ్దానాన్ని మించి మేము EVNoire, గ్రిడ్ ప్రత్యామ్నాయాల తో కలసి అమెరికాలో నల్ల జాతి, అట్టడుగు వర్గాల డ్రైవర్లు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చుకోగలగడానికి భరోసానిచ్చే పైలట్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము.

డ్రైవర్లు, డెలివరీ చేసేవారికి ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను అందిస్తున్నాము

డ్రైవర్లు, డెలివరీ వ్యక్తులు విజయం సాధించడానికి, వారి ఆర్థిక వ్యవహారాలను మెరుగుపరచడానికి, భవిష్యత్తు పనికొరకు వారిని సిద్ధం చేయడానికి మేం కార్యక్రమాలను అభివృద్ధి చేస్తాం. మధ్య, దక్షిణ అమెరికా అంతటా, మేము అవన్జా ను IFC భాగస్వామ్యంతో ప్రారంభించాము . కెన్యాలో, మేమునావిగేట్ కార్యక్రమాన్ని AMIతో కలసి అభివృద్ధిపరచాము. అలాగే మేం అమెరికాలో ఆపరేషన్ హోప్‌తో ఇలాంటి అంకురార్పణకు కృషి చేస్తున్నాము.

రహదారిపైన, వెలుపల వ్యాపార నైపుణ్యాలు, అవకాశాలను అందించడం

తామే వ్యవస్థాపకులుగా ఉండే మా ప్లాట్ ఫారంలో చాలా మంది డ్రైవర్లు మరియు డెలివరీ వ్యక్తులు చేరారు. UK లో, మేము ఎంటర్‌ప్రైజ్ నేషన్ తో కలసి బిజినెస్ బిల్డర్ కార్యక్రమాన్ని నడపడానికి కృషి చేస్తాము, అది శిక్షణను ఇచ్చి, కొత్త వ్యాపార ఆలోచనల దిశగా £ 10,000 వరకు నిధులను మంజూరు చేస్తుంది. దక్షిణాఫ్రికాలో, మేము లులారైడ్స్ కు మద్దతు ఇస్తున్నాము, అట్టడుగు నేపథ్యాలు గల యువతకు మోటారుబైక్‌లను నడపడంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు Uber Eats ప్లాట్‌ఫామ్‌లో చేరగలుగుతారు.

కదలికలను అందరికీ సమానంగాా చేయాలనే మా ఆశయంలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, డెలివరీ చేసేవారికి సానుకూల అవకాశాలను కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

మాఫ్లాట్‌ఫారం వర్క్ కొరకుకొత్త మోడల్ గురించి మరింత తెలుసుకోండి.

మా ప్రభావశీలైన పని గురించి మరింత చదవండి

మా నిబద్ధతలు

రవాణా అందరికీ సమానంగా ఉండేలా చేయడం.

బ్లాక్ బిజినెసెస్ మ్యాటర్

ప్రపంచవ్యాప్తంగా నల్ల జాతీయుల వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం.

డ్రైవర్‌లు, డెలివరీ చేసేవారికి అందరికి ధన్యవాదాలు

వేలాది మంది డ్రైవర్లు మరియు డెలివరీ ప్రజలు మహమ్మారి సమయంలో ముఖ్యమైన వాటిని తరలించడం కొనసాగించారు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو