Uber యొక్క సాంకేతిక సమర్పణలు
ప్రజలు రైడ్‌లను అభ్యర్థించే విధానాన్ని మార్చడం మరియు పాయింట్ A నుండి పాయింట్ B వరకు వెళ్లడం ప్రారంభం మాత్రమే.
Uber యాప్, ఉత్పత్తులు మరియు ఇతర ఆఫర్‌లు
Uber అనేది ఒక సాంకేతిక సంస్థ, ప్రపంచానికి మెరుగైన రవాణాను అందించే మార్గాన్ని తిరిగి ఊహించమే దీని లక్ష్యం. రైడ్‌లు, రైడ్ సర్వీసుల స్వతంత్ర ప్రొవైడర్‌లు, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్సిట్, బైక్‌లు మరియు స్కూటర్‌లతో సహా ఇతర రకాల రవాణాతో జత అయ్యే బహుముఖ ఫ్లాట్ ఫారాలను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి మా టెక్నాలజీ మాకు సాయపడుతుంది.
మేము వినియోగదారులు మరియు రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మరియు ఇతర మర్చంట్లను కూడా కనెక్ట్ చేస్తాము, తద్వారా వారు భోజనాలు, కిరాణా సరుకులు మరియు ఇతర వస్తువులను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు, ఆపై మేము వారిని స్వతంత్ర డెలివరీ సర్వీస్ ప్రొవైడర్లతో మ్యాచ్ చేస్తాము. అదనంగా, Uber సరుకు రవాణా పరిశ్రమలోని షిప్పర్లు మరియు క్యారియర్లను కలుపుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు మరియు 15,000+ నగరాల్లో ప్రజలు కనెక్ట్ అవ్వడానికి మరియు ప్రయాణించడానికి మా టెక్నాలజీ సహాయపడుతుంది.