10 మిలియన్ ఉచిత రైడ్‌లు, భోజనాలు మరియు డెలివరీలు
మహమ్మారి మొదటి వేవ్‌లో ప్రపంచం స్తంభించినప్పుడు, మేము 10 మిలియన్‌ల ఉచిత రైడ్‌లు, భోజనం మరియు డెలివరీలను చేశాము.
కొవిడ్-19 మన జీవితాలు, మన వ్యాపారాలను తల్లక్రిందులు చేసింది. మార్చి 2020 లో, Uber-రవాణాకు శక్తినిచ్చే సంస్థ-మా ప్లాట్‌ఫారమ్‌లోని రైడర్‌లను ప్రయాణించకుండా ఉండమని కోరింది. ఇంట్లోనే ఉండమని మేము వారిని కోరాము, తద్వారా ముఖ్యమైనవి తరలించడంలో మేము సహాయపడగలిగాము: మొదట స్పందించేవారిని పనికి వెళ్లడానికి సహాయపడటం, వృద్ధులకు ఆహారం మరియు అత్యవసర సామాగ్రిని ఫ్రంట్ లైన్స్‌కు తీసుకురావడం, మరియు మా నిబద్ధత లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి 10 మిలియన్‌ల ఉచిత రైడ్‌లు, భోజనం మరియు డెలివరీలను విరాళంగా ఇవ్వడం.
మూడు నెలల తరువాత, ఆ 10 మిలియన్‌ల రైడ్‌లు మరియు డెలివరీలు జరిగాయి. ఫలితంగా, భారతదేశంలో వైద్యులు పనికి వెళ్లగలిగారు. మెక్సికోలోని నిస్సహాయ కుటుంబాలు ఆహార పొట్లాలను అందుకున్నారు. గృహ హింస బాధితులు షెల్టర్‌లు మరియు సురక్షిత ప్రదేశాలకు ప్రయాణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా,Uber 54 దేశాలలో 200 కి పైగా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుని సహాయం అవసరమైన వారిని సేవలందించింది. ప్రపంచవ్యాప్తంగా మా ప్రభావవంతమైన నెట్‌వర్క్‌ను నడిపించే మా ఆవిష్కరణకు కేవలం 3 ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ (దక్షిణాఫ్రికా)
సంక్షోభ సమయంలో ఇంట్లో ఆశ్రయం పొందిన రోగులకు వెస్ట్రన్ కేప్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నేతృత్వంలో, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో Uber 1.4 మిలియన్లకు పైగా ప్రిస్క్రిప్షన్‌లను పంపిణీ చేసింది.
NHS (UK)
మహమ్మారి యొక్క మొదటి వేవ్‌లో యుకె లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు 300,000 ఉచిత రైడ్‌లు మరియు భోజనాన్ని NHS సిబ్బందికి మేము అందించాము.
వరల్ డ్ సెంట్రల్ కిచెన్ (యుఎస్)
మేము బ్రోంక్స్, NY ;నెవార్క్, NJ; మరియు వాషింగ్టన్ DCలో మహమ్మారి ఫలితంగా ఇంటికే పరిమితమైన ప్రమాదంలో దుర్భల ప్రమాదంలో ఉండే సంఘాలకు 300,000 తాజా భోజనాన్ని పంపిణీ చేయడానికి సదుపాయం కల్పించాము.
అసాధారణమైన ఈ సంక్షోభ సమయంలో మన కమ్యూనిటీలను నడుపుతూ ఉండటానికి సహాయపడిన, Uber ప్లాట్‌ఫాంపై ఉన్న మిలియన్‌ల మంది డ్రైవర్‌లు మరియు డెలివరీ వ్యక్తులు లేకుండా ఈ రైడ్‌లు మరియు డెలివరీలు సాధ్యం అయ్యేవి కాదు. వారిని సురక్షితంగా ఉంచడానికి మేము చేయగలిగినదంతా చేయడం మొదటి ప్రాధాన్యత. వారు ఎదుర్కొన్న ప్రమాదాలని గుర్తించి, మేము PPEపై $50 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టాము, మరియు మేముమాస్క్ లేనిచో, రైడ్ లేదు అనే విధానాన్ని త్వరగా అమలు చేసాము, జవాబుదారీతనంతో నడపడానికి మా సాంకేతికతను ఉపయోగించాము. మా పరిశ్రమలో COVID-19 తో బాధపడుతున్న డ్రైవర్‌లు మరియు డెలివరీ వ్యక్తులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించిన వారిలో మేము మొదటివారము, మరియు డ్రైవర్‌లను ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలలో చేర్చాలని మేము విజయవంతంగా సూచించాము.
ఆహార డెలివరీని అవలంబించడాన్నిమహమ్మారి నాటకీయంగా వేగవంతం చేసినప్పటికీ, రెస్టారెంట్‌లకు అది ఇప్పటికి పెద్ద సవాలుగా మారింది. వాస్తవానికి, సంక్షోభం కారణంగా ఆర్థికంగా ప్రభావితమైన వ్యక్తులు డ్రైవర్‌లు మాత్రమే కాదు. రెస్టారెంట్ పరిశ్రమలో మిలియన్‌ల మంది తీవ్రంగా నష్టపోవడం వల్ల యుఎస్‌లో మేము $6 మిలియన్ల విరాళాన్ని రెస్టారెంట్ ఎంప్లాయీ రిలీఫ్ ఫండ్ కి అందించాము, రెస్టారెంట్‌ల బ్యాంక్ ఖాతాల్లో $20 మిలియన్‌లకు పైగా ఉంచే సహకార ఫీచర్‌ని యాప్‌లో ప్రారంభించాము, మరియు ఇబ్బందులు ఎదుర్కొంటున్న యుఎస్ వ్యాపారాలకు $4.5 మిలియన్‌ల నిధులను ప్రకటించాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్‌ల అవసరాలను తీర్చడానికి రూపొందించిన కొత్త యాప్ ఫీచర్‌లను కూడా మేము జోడించాము.
కోసం మా 10 మిలియన్‌ల ఉచిత మరియు రాయితీ రైడ్‌ల గురించి తెలుసుకోండి.మా ప్రభావశీలైన పని గురించి మరింత చదవండి
వ్యాక్సినేషన్‌ల కొరకు రైడ్‌లు
ఉపాధ్యాయుల నుండి వృద్ధుల వరకు, కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడానికి రవాణా అనేది అడ్డంకి కాకుండా మేం సాయం చేస్తున్నాం.
జాత్యహంకారానికి ఏమాత్రం సహించకపోవడం
జాత్యహంకారానికి మరియు వివక్షకు మన ప్రపంచంలో స్థానం లేదు-వాటితో పోరాడటానికి మేము చేస్తున్నది ఇదే.