డ్రైవర్‌లు Uberతో ఎంత మొత్తాన్ని సంపాదించుకోగలరు?
మీరు Uber యాప్‌ను ఉపయోగించి డ్రైవింగ్ చేయడం ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు అనే విషయం మీరు ఎప్పుడు, ఎక్కడ, ఎంత తరచుగా డ్రైవింగ్ చేస్తారు అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీ బాడుగ మొత్తాలు ఎలా గణించబడతాయి అని తెలుసుకోవడంతో పాటు మీ ఆదాయాలను పెంపొందించడంలో సహకరించే ప్రోత్సాహకాలను గురించి తెలుసుకోండి.¹
ఆదాయాలు ఎలా లెక్క ించబడతాయి
మీరు Uberతో డ్రైవ్ చేయడం ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదించవచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక్కో ట్రిప్ ద్వారా మీరు సంపాదించే మొత్తాన్ని నిర్ణయించడంలో ఈ క్రింది అంశాలు సహకరిస్తాయి.
ప్రామాణిక బాడుగ
పూర్తి చేసిన ప్రతి ట్రిప్‌కి మీరు కిరాయిని సంపాదించుకుంటారు.
ధరల పెరుగుదల
రైడర్ డిమాండ్ ఎప్పుడు, ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి మీ యాప్‌లోని హీట్ మ్యాప్‌ను చూడండి, దీని ద్వారా మీరు మీ ప్రామాణిక ఛార్జీల కంటే ఎక్కువ మొత్తం సంపాదించుకోవచ్చు.
కనీస ట్రిప్ ఆదాయాలు
ప్రతి నగరంలోనూ మీరు ఏ ట్రిప్ ద్వారా అయినా సంపాదించుకోగలిగే కనీస మొత్తం ఉంటుంది. చిన్నపాటి ట్రిప్ లలో కూడా మీరు చేసిన ప్రయత్నాన్ని మీ ఆదాయాలు ప్రతిబింబిస్తాయని ఇది నిర్ధారిస్తుంది.
సర్వీస్ ఫీజు
యాప్‌ని అభివృద్ధి పరచడం మరియు కస్టమర్ మద్దతు వంటి వాటికి నిధులను సమకూర్చడంలో ఈ ఫీజు సహాయపడుతుంది.
రద్దులు
చాలా సందర్భాలలో, రైడర్ తన అభ్యర్థనను రద్దు చేసినప్పుడు మీరు రద్దు ర ుసుముని అందుకుంటారు.
ప్రోత్సాహకాలు మరియు అవి ఎలా పని చేస్తాయి
మీ ప్రాంతంలో అత్యధిక రైడ్ అభ్యర్థనలు ఉంటాయని డ్రైవర్ యాప్ ఊహించిన దానిపై ఆధారపడి యాప్‌లో చేర్చబడే ప్రోత్సాహకాల సహాయంతో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో పాటు మీ ఆదాయాలను పెంపొందించుకునేందుకు లక్ష్యాలను కూడా సెట్ చేసుకోవడంలో మీకు సహకరిస్తుంది. డ్రైవర్‌లందరికీ అన్ని ప్రోత్సాహకాలు అందుబాటులో ఉండవు. క్రింది షరతులను చూడండి.²
నిర్ణీత సంఖ్యలో ట్రిప్‌లను చేరుకోండి
ఆఫర్ అందుబాటులో ఉన్నప్పుడు నిర్ణీత సమయంలో మీరు నిర్ణీత సంఖ్యలో ట్రిప్‌లను పూర్తి చేయడం ద్వారా అదనపు మొత్తాన్ని సంపాదించుకోండి.
బిజీ సమయాల్లో డ్రైవ్ చేయండి
బిజీ సమయాల్లో నిర్దిష్ట ప్రాంతాలలో ప్రయాణాలకు అదనపు చెల్లింపు పొందండి.
సంపాదించుకునేందుకు కొన్ని మార్గాలు
యాప్‌తో ముందుకు సాగడం
మీరు డ్రైవింగ్ చేసి మరింత ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకోవడానికి మీకు సహ ాయపడగల శక్తివంతమైన ఫీచర్లు యాప్‌లో ఉన్నాయి. ట్రెండ్స్‌ను ట్రాక్ చేయడం నుండి సమీపంలోని సంపాదించుకోగలిగే అవకాశాలను గురించి మీకు తెలియజేయడం వరకు, యాప్ మీకు రోడ్డుపై ఉండే సాధనంగా వ్యవహరిస్తుంది.
మీరు అందజేసిన సర్వీస్‌కు టిప్‌లు పొందడం
ప్రతి ట్రిప్ ముగిసిన తర్వాత, రైడర్‌లు నేరుగా యాప్ నుండే మీకు టిప్ అందజేయగలరు. ఎప్పుడూ మీరు మీ టిప్‌లలోని 100% మొత్తాన్ని పొందుతారు.
మీరు చెల్లింపులు ఎప్పుడు ఎలా పొందుతారు
వేగవంతమైన క్యాష్ అవుట్
చెల్లింపులు పొందడం సులభం. మీకు కావలసిందంతా ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే. మీ ఆదాయాలను వారంవారీగా బదిలీ చేస్తాము.
మీ కస్టమర్ నగదు చెల్లించే పక్షంలో
మీరు ఏదైనా ట్రిప్‌ని పూర్తి చేసిన వెంటనే నగదుతో చెల్లింపులు పొందుతారు. యాప్‌లో మీరు కస్టమర్ నుండి సేకరించవలసిన మొత్తంతోపాటు మీరు Uberకి చెల్లించవలసిన రుసుము కూడా గణించి చూపబడుతుంది.
డ్రైవింగ్ సంబంధిత ఖర్చులలో ఆదా
మీ స్వంత వ్యాపారాన్ని నిర్వహించడం అనేది సరళతతోపాటు సంబంధిత నిర్వహణకు సంబంధించిన ఖర్చుల బాధ్యతను కూడా కలిగి ఉంటుంది. ఇంధనం, బీమా మరియు వాహన మెయింటెయినెన్స్ వంటివి పన్ను మినహాయింపు పొందవచ్చు అలాగే మీకు సహకారం అందజేసేలా తగ్గింపులను ఆఫర్ చేసేందుకు Uber వీటికి సంబంధించిన భాగస్వామ్యాలను కలిగి ఉంది.
డ్రైవర్ యాప్‌కి సంబంధించిన త్వరిత పర్యటనను తీసుకోండి
మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? Uberతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు మద్దతు అందజేయడానికి ఇతర డ్రైవర్‌ల నుండి చిట్కాలు మరియు సమాచారాత్మక వీడియోలతో కూడిన వనరుకి వెళ్లగలిగే ఐచ్ఛికాన్ని మీరు కలిగి ఉంటారు.
రైడర్‌ల నుంచి ప్రముఖ ప్రశ్నలు
- నేను నా ట్రిప్ ఆదాయాలను ఎక్కడ చూడగలను?
మీ సంపాదనలకు సంబంధించిన సారాంశాలను మీరు యాప్‌లో చూడవచ్చు. మీ మ్యాప్ స్క్రీన్‌లో బాడుగ చిహ్నాన్ని నొక్కండి, తర్వాత మీ ఆదాయాలను చూసేందుకు కుడి లేదా ఎడమ వైపునకు స్వైప్ చేయండి.
- నేను Uber యాప్‌ని ఉపయోగించి కేవలం వారాంతాలలో మాత్రమే డ్రైవింగ్ చ ేయవచ్చా?
Down Small చేయవచ్చు. మీరు ఎప్పుడు, ఎలా డ్రైవ్ చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు సంపాదించుకునేందుకు సరళమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, Uberతో డ్రైవ్ చేయడం మీకు సరిగ్గా సరిపోవచ్చు.
- టోల్‌ల కోసం డ్రైవర్‌లు చెల్లింపులు పొందుతారా?
Down Small ఏదైనా ట్రిప్‌లో ఉన్నప్పుడు, టోల్ మొత్తాన్ని రైడర్‌లకు ఛార్జీ చేయడంతోపాటు వారి బాడుగలో ఆటోమేటిక్‌గా జోడించబడుతుంది. మీ టోల్ రీయింబర్స్‌మెంట్‌లను మీరు ఆదాయాలు విభాగంలో లేదా మీ యాప్‌లోని ట్రిప్ వివరాలలో చూడవచ్చు.
¹ఈ పేజీలో అందజేసిన సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అంతే కానీ ఇందులో ఏ విధమైన సంపాదనకు హామీ లేదు. సంపాదన ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటుంది. మీ నగరంలోని డెలివరీ ఛార్జీలకు సంబంధించిన అత్యంత ఖచ్చితమైన వివరాల కోసం, ఎప్పుడూ మీ నగరానికి సంబంధించిన నిర్దిష్ట వెబ్‌సైట్‌లో చూడండి.
²మీరు ప్రోత్సాహకానికి అర్హత పొందినప్పుడు Uber మీకు తెలియజేస్తుంది. ప్రోత్సాహకాలకు పరిమితులు వర్తిస్తాయి. ఏవైనా పరిమితులు మరియు షరతులు, నిర్దిష్ట ప్రమోషన్ లేదా సాధనంలో మీతో భాగస్వామ్యం చేయబడతాయి. అటువంటి ప్రోత్సాహకాన్ని పొందడానికి అవసరమైన ఆవశ్యకాలతో సహా వాటికే పరిమితం కాకుండా, ఏదైనా ప్రోత్సాహకాన్ని మార్చడానికి లేదా రద్దు చేయడానికి Uber హక్కుని కలిగి ఉంటుంది.