The Uber driver app, your resource on the road
The Uber driver app is easy to use and provides you with information to help you make decisions and get ahead. We collaborated with drivers and delivery people around the world to build it. See for yourself.
రద్దీ సమయంలో ఎటువైపు డ్రైవ్ చేయాలనే హెచ్చరికలు పొందండి
సమీపంలోని మరిన్ని ట్రిప్‌లను కనుగొనేందుకు మీ మ్యాప్‌లో అవకాశాలు నొక్కి, అక్కడకు చేరుకునే మార్గనిర్దేశం సూచించమని యాప్‌ను అడగండి.
మీరు తదుపరి ఎటు వెళ్లాలో తెలుసుకోండి
మీరు రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉంటే, మీ మ్యాప్ స్క్రీన్‌కి దిగువన కనిపించే స్టేటస్ బార్ ద్వారా మీకు తెలుస్తుంది. దీని వల్ల, మీరు అక్కడే ఉండాలా లేదా డ్రైవ్ చేయడం ప్రారంభించాలా అనే దానిపై మీరు అవగాహనతో నిర్ణయం తీసుకోగలరు.
మీ ఆదాయాలను క్షణంలో ట్రాక్ చేయండి
మీ రోజువారీ, వారంవారీ ఆదాయాల లక్ష్యాలకు సంబంధించిన మీ ప్రోగ్రెస్‌ను సులభంగా ట్రాక్ చేయండి. కేవలం ఒకసారి నొక్కడం ద్వారా మీరు మీ ఆదాయాల సారాంశాలను కూడా యాక్సెస్ చేయవచ్చు.
ఆదాయాలను ట్రాక్ చేయడం ఎలా: మీ మ్యాప్ స్క్రీన్‌పై బాడుగ చిహ్నాన్ని నొక్కి, ఆపై మీ ఆదాయాలను విశ్లేషించడానికి కుడి మరియు ఎడమవైపులకు స్వైప్ చేయండి.
మీ రోజును సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోండి
గంటలవారీ ట్రెండ్స్ చూడడం, ప్రాధాన్యతలు సెట్ చేయడం మరియు ప్రోత్సాహకాలను వీక్షించడం లాంటివి—వీటన్నింటినీ ఒకే చోట చేయండి.
ట్రిప్ ప్లానర్‌ను గుర్తించడం ఎలా: మీ మ్యాప్ స్క్రీన్‌కు దిగువున ఎడమవైపు మూలన ఉన్న బాణం గుర్తును నొక్కండి. డెలివరీ భాగస్వాముల కోసం, మీ యాప్‌లో ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
మీరు సేవను కోల్పోయినప్పటికీ కూడా యాప్‌పై ఆధారపడవచ్చు
మీ కనెక్షన్ కోల్పోయారా? ఏమి జరిగినా కూడా మీరు ఇప్పటికీ ట్రిప్‌లను ప్రారంభించవచ్చు మరియు ముగించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు పొందండి
త్వరలో జరిగే ఈవెంట్‌లు, సంపాదించుకోగలిగే అవకాశాలు లాంటి వాటి నుండి మీ ఖాతాకి సంబంధించిన సమాచారం, కొత్త ఫీచర్‌ల దాకా అన్నింటికి సంబంధించిన సందేశాలను పొందండి.
నోటిఫికేషన్‌లను గుర్తించ డం ఎలా: మీకు కొత్త సందేశాలు వచ్చిన ఎప్పుడైనా, మీ మ్యాప్ స్క్రీన్‌కు ఎగువున కుడివైపు మూలన, మీ ఫోటోపై బ్యాడ్జ్ కనిపిస్తుంది. వాటిని చదవడానికి వాటిపై నొక్కండి.
యాప్‌ను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి
ఈ ట్రిప్ మీకు మొదటిదైనా లేదా 100వదైనా, ఇప్పుడు మీ కోసం చిట్కాలు మరియు సమాచారాత్మక వీడియోలతో కూడిన వనరు అందుబాటులో ఉంటుంది.
డ్రైవర్ యాప్ ప్రాథమికాంశాలను గుర్తించడం ఎలా: మీ మ్యాప్ స్క్రీన్ ఎగువన కుడివైపు ఉన్న మీ ఫోటోపై నొక్కండి. తర్వాత ఖాతాకి పైన ఉన్న సహాయం ఎంపికను నొక్కండి.
అధిక ఆదాయాలను అందజేసే ప్రదేశాలకు నావిగేట్ చేయండి
మీరు మీ ప్రామాణిక బాడుగలతోపాటు మరింత అదనపు మొత్తాలను సంపాదించుకోగలిగేందుకు, ప్రోత్సాహకరంగా ఉన్న ప్రాంతాలపై నొక్కండి, మీరు ఆ ప్రాంతానికి నావిగేట్ చేయాలనుకుంటున్నారా అని యాప్ మిమ్మల్ని అడుగుతుంది.
డ్రైవర్ యాప్ ఎలా పని చేస్తుంది
ఆన్‌లైన్‌కి వెళ్లడం
డ్రైవర్ యాప్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు డ్రైవ్ చేయడానికి లేదా డెలివరీలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఏ సమయంలోనైనా, యాప్‌ని తెరిచి వెళ్లు నొక్కండి.
ట్రిప్ మరియు డెలివరీ అభ్యర్థనలను అంగీ కరించడం
ఒకసారి ఆన్‌లైన్‌కి వెళ్లిన తర్వాత, మీరు మీ ప్రాంతంలోని అభ్యర్థనలను స్వీకరించడం ఆటోమేటిక్‌గా ప్రారంభం అవుతుంది. మీ ఫోన్ మీకు శబ్దం ద్వారా తెలియజేస్తుంది. అంగీకరించేందుకు, స్వైప్ చేయండి.
మలుపులతో అందించే దిశానిర్దేశాలు
మీరు మీ కస్టమర్‌ని గుర్తించి, వారి గమ్యస్థానానికి నావిగేట్ చేసే ప్రక్రియను యాప్ సులభతరం చేసింది.
ప్రతి ట్రిప్‌తో సంపాదన
ఒక్కో ట్రిప్ ముగిసిన తర్వాత మీరు ఎంత మొత్తాన్ని సంపాదించారు అలాగే మీ రోజువారీ మరియు వారంవారీ సంపాదన లక్ష్యంలో మీ ప్రోగ్రెస్ ఎంత వరకు ఉంది వంటి వివరాలను చూడండి. సంపాదన ప్రతి వారం మీ బ్యాంక్ ఖాతాకు ఆటోమేటిక్‌గా బదిలీ చేయబడతాయి.
రేటింగ్ విధానం
ప్రతి ట్రిప్ ముగిసిన తర్వాత రైడర్‌లు మరియు డ్రైవర్‌లను, వీరితో పాటుగా ఇతర కస్టమర్‌లను తమ అభిప్రాయాన్ని అందించాల్సిందిగా కోరడం జరుగుతుంది.
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డ్రైవ్ చేయండి
యాప్‌లో మీకు అనుకూలమైన విధంగా డ్రైవ్ చేయండి
Feature availability may vary based on your city and region.