Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Dallas Fort Worth International Airport (DFW)

సంప్రదాయ DFW Airport షటిల్ లేదా టాక్సీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా? మీరు DFW ఎయిర్‌పోర్ట్‌ నుండి డల్లాస్ అక్వేరియం లేదా అర్బోరెటమ్‌కు వెళుతున్నా, మీకు ఇప్పటికే తెలిసిన Uber యాప్‌తో మీరు వెళ్తున్న చోటుకు చేరుకోండి. బటన్ తట్టడం ద్వారా DFW కు వెళ్ళడానికి మరియు రావడానికి రైడ్‌ను అభ్యర్థించండి.

DFW Airport, TX 75261
+1 972-973-3112

search
Where from?
Navigate right up
search
Where to?

Request a ride around the world

ఒక బటన్‌ను తట్టి, 700కు పైగా ప్రధాన కేంద్రాలలో ఎయిర్‌పోర్ట్‌కు రవాణాను పొందండి.

స్థానిక వ్యక్తి లాగా తిరగండి

తెలియని నగరంలో మీరు నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా, యాప్ మరియు మీ డ్రైవర్؜లను ఆ వివరాల సంగతి చూసుకోవడానికి అనుమతించండి.

Uberతో మీ ఇంట్లోనే ఉన్న అనుభూతిని పొందండి

మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పటికీ, రియల్-టైమ్ ధర మరియు క్యాష్ రహిత చెల్లింపులతో సహా, మీకు ఇష్టమైన ఫీచర్‌లను కనుగొనండి.

Ways to ride in the area

Pickup at Dallas Fort Worth International Airport (DFW)

రైడ్‌ను అభ్యర్ధించడానికి మీ యాప్‌ను తెరవండి

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మీ గమ్యస్థానానికి రైడ్‌ను అభ్యర్థించడానికి Uber యాప్‌ని తెరవండి. మీ గ్రూప్ పరిమాణం మరియు లగేజీ స్టోరేజీ అవసరాలకు సరిపడే DFW రవాణా ఎంపికను ఎంచుకోండి.

ఆగమనాల లెెవల్ వద్ద బయటకు దారి

మీరు DFW పికప్ పాయింట్‌ల గురించి నేరుగా యాప్‌లో మార్గ నిర్దేశాలను పొందుతారు . టెర్మినల్‌ను బట్టి పికప్ స్థానాలు మారవచ్చు. డల్లాస్ ఫోర్ట్-వర్త్ ఎయిర్‌పోర్ట్‌లో రైడ్‌షేర్ పికప్ సంకేతాలు కూడా అందుబాటులో ఉండవచ్చు.

మీ లొకేషన్‌ను నిర్ధారించండి

యాప్ పేర్కొన్న విధంగా మీకు కేటాయించిన DFW పికప్ స్థానానికి వెళ్లండి. దయచేసి గమనించండి: ఈ ప్రదేశం ఎల్లప్పుడూ మీ సమీప నిష్క్రమణ వద్ద ఉండకపోవచ్చు. మీ డ్రైవర్ పేరు, లైసెన్స్ ప్లేట్ మరియు కారు రంగు యాప్‌లో చూపబడుతుంది. మీరు ఎక్కడానికి ముందు మీ రైడ్‌ను ధృవీకరించండి. మీరు మీ డ్రైవర్‌ను కనుగొనలేకపోతే, వారిని యాప్ ద్వారా సంప్రదించండి.

DFW Airport Map

DFW Airport has 5 passenger terminals, with parking located next to each of them. Terminal D handles all international arrivals and departures.

DFW Airport map

Top questions from riders

  • అవును. మీరు Uberతో రైడ్‌ను అభ్యర్ధించగలిగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల ఈ జాబితాకు వెళ్ళండి.

  • The cost of an Uber trip to (or from) DFW depends on factors that include the type of ride you request, the estimated length and duration of the trip, tolls, and current demand for rides.

    You can see an estimate of the price before you request by going here and entering your pickup spot and destination. Then when you request a ride you’ll see your actual price in the app based on real-time factors.

  • మీరు అభ్యర్థించే రైడ్ రకం మరియు ఎయిర్‌పోర్ట్ పరిమాణంపై పికప్ లొకేషన్‌లు ఆధారపడవచ్చు. మీ డ్రైవర్‌ను ఎక్కడ కలుసుకోవాలనే దాని గురించి యాప్‌లోని సూచనలను అనుసరించండి. పేర్కొన్న ఎయిర్‌పోర్ట్‌ రైడ్‌షేర్ జోన్‌లను సూచించే సంకేతాల కోసం కూడా మీరు చూడవచ్చు.

    మీరు మీ డ్రైవర్‌ను కనుగొనలేకపోతే, వారిని యాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి.

  • The airport code DFW is an abbreviation of Dallas Fort Worth, Texas, USA.

More information

  • Uberతో డ్రైవింగ్ చేస్తున్నారా?

    రైడర్؜లను ఎక్కడ పికప్ చేసుకోవాలి అనే దాని నుండి, స్థానిక నియమ నిబంధనలను పాటించడం వరకు, మీ ఎయిర్‌పోర్ట్ ట్రిప్؜లను మరింత మెరుగుపరచడానికి మార్గాలను తెలుసుకోండి.

  • వేరొక ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నారా?

    ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా ఎయిర్‌పోర్ట్‌లలో డ్రాప్-ఆఫ్‌లు, పికప్‌లు పొందండి.

1/2

DFW visitor information

డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విమానాల రాకపోకల ఆధారంగా ప్రపంచంలో 4వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. డల్లాస్ మరియు ఫోర్ట్ వర్త్ కంబైన్డ్ మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ డల్లాస్ (20 మైళ్ళు; 32 కిలోమీటర్లు) మరియు ఫోర్ట్ వర్త్ (23 మైళ్ళు; 37 కిలోమీటర్లు) నుండి సాధారణ డ్రైవింగ్ పరిస్థితులలో రెండు ప్రదేశాల నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి కేవలం 20 నిమిషాలు పడుతుంది.

DFW విమానాశ్రయ టెర్మినల్స్

DFW 5 టెర్మినల్స్‌గా విభజించబడింది: A, B, C, D, మరియు E. టెర్మినల్ D 28 గేట్‌లతో అంతర్జాతీయ టెర్మినల్, అయితే కొన్ని అంతర్జాతీయ విమానాలు టెర్మినల్ A నుంచి బయలుదేరతాయి. DFW ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు అన్ని టెర్మినల్స్‌లో ఉన్నాయి. ఈ దిగువ సమాచారాన్ని ఉపయోగించి మీరు మీ ట్రిప్‌ను ప్లాన్ చేయవచ్చు.

DFW టెర్మినల్ A

  • అమెరికన్
  • అమెరికన్ ఎయిర్‌లైన్స్ అడ్మిరల్స్ క్లబ్

DFW టెర్మినల్ B

  • అమెరికన్ ఈగిల్
  • అమెరికన్ ఎయిర్‌లైన్స్ అడ్మిరల్స్ క్లబ్

DFW టెర్మినల్ C

  • అమెరికన్
  • అమెరికన్ ఎయిర్‌లైన్స్ అడ్మిరల్స్ క్లబ్

DFW ఇంటర్నేషనల్ టెర్మినల్ (D)

డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌లో ఇంటర్నేషనల్ విమానాల బోర్డింగ్ D5 నుంచి D40 గేట్‌ల మధ్య జరుగుతుంది. DFW 57 అంతర్జాతీయ గమ్యస్థానాలకు నాన్ ‌ స్టాప్ విమానాలను అందిస్తుంది. టెర్మినల్ D బ్రిటీష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా మరియు క్వాంటాస్‌లతో సహా అనేక అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌లకు కేేంద్రంగా ఉంది. అదనంగా, దీనిలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ అడ్మిరల్స్ క్లబ్ ‌ఉంది. టెర్మినల్ ఈ క్రింది విమానయాన సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది:

  • ఏరోమెక్సికో
  • అమెరికన్
  • అవియాన్కా
  • బ్రిటిష్ ఎయిర్‌వేస్
  • ఎమిరేట్స్
  • ఐస్‌లాండ్‌ఎయిర్
  • ఇంటర్‌జెట్
  • జపాన్ ఎయిర్‌లైన్స్
  • కొరియన్ ఎయిర్
  • లుఫ్తాన్సా
  • క్వాంటాస్
  • ఖతార్ ఎయిర్‌వేస్
  • సన్ కంట్రీ
  • ఒలారిస్
  • వావ్

DFW టెర్మినల్ E

  • ఎయిర్ కెనడా
  • అలాస్కా
  • అమెరికన్
  • డెల్టా
  • ఫ్రాంటియర్
  • జెట్‌బ్లూ
  • స్పిరిట్
  • యునైటెడ్
  • వెస్ట్‌జెట్
  • డెల్టా స్కై క్లబ్
  • యునైటెడ్ క్లబ్

DFW వద్ద డైనింగ్

డల్లాస్ ఫోర్ట్‌వర్త్ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని టెర్మినల్స్‌లో ‌ విస్తృతమైన డైనింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ డైనింగ్ ఆప్షన్‌లతో, ప్రయాణీకులు కాఫీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ మరియు DFW ఎయిర్‌పోర్ట్ బార్‌లతో సహా ఆహారాన్ని మరియు పానీయాలకు సంబంధించిన ఆప్షన్‌లు ఉన్నాయి. టేబుల్ సర్వీస్‌తో భోజనం చేయాలని అనుకునే ప్రయాణికులు DFW ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్‌ల్లో ‌ఒకదానిలో డైనింగ్ ఎంచుకోవచ్చు.

DFW నుంచి విభిన్న ప్రదేశాలకు వెళ్లడం

సెక్యూరిటీ క్లియర్ చేసిన తర్వాత, DFW లో ప్రయాణీకులు స్కైలింక్‌ను ఉపయోగించవచ్చు, ఇది పూర్తిగా ఆటోమేటెడ్, 2-వే ట్రైయిన్ సిస్టమ్, ఇది మొత్తం 5 టెర్మినల్స్‌ను కలుపుతుంది. ప్రతి 2 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి మరియు 35 mph వరకు వేగంతో ప్రయాణిస్తాయి. ప్రతి టెర్మినల్‌లో 2 స్టేషన్‌లు ఉన్నాయి, ఇవి క్రింది గేట్ ప్రాంతాల్లో ఉన్నాయి:

  • టెర్మినల్ A: A13 నుంచి A16 మధ్య మరియు A28 నుంచి A33 మధ్య
  • టెర్మినల్ B: B10 నుంచి B12 మధ్య మరియు B28 నుంచి B31 మధ్య
  • టెర్మినల్ C: C8 నుంచి C12 మధ్య మరియు C27 నుంచి C31 మధ్య
  • టెర్మినల్ D: D11 నుంచి D21 మధ్య మరియు D24 నుంచి D36 మధ్య
  • టెర్మినల్ E: E8 నుంచి E12 మధ్య మరియు E31 నుంచి E32 మధ్య

అదనంగా, సెక్యూరిటీకి ముందు, టెర్మినల్ లింక్ అన్ని టెర్మినల్స్‌ను DFW ఎయిర్‌పోర్ట్ షటిల్ బస్ సిస్టమ్‌తో కలుపుతుంది.

DFWలో చేయదగ్గ పనులు

DFW విమానాశ్రయం స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ కళాకారుల వర్క్ ఉండే ఆర్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది, వీటిలో శిల్పాలు, పెయింటింగ్‌లు, మొజాయిక్‌లు మరియు మరెన్నో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం టెర్మినల్ Dలో సెక్యూరిటీ తరువాత మరియు స్కైలింక్ స్టేషన్‌ల్లో ఉన్నాయి. సమీపంలో చిన్న పిల్లల కోసం ఒక ఆట స్థలం; పెద్దవారి కోసం, 2 గేమింగ్ డెస్టినేషన్‌లు (టెర్మినల్ B లోని గేట్ 42 మరియు టెర్మినల్ Eలోని గేట్ 16 పక్కన) ప్రయాణీకులకు హెడ్‌ఫోన్‌లు మరియు లెదర్ గేమింగ్ కుర్చీలతో నిండిన లేటెస్డ్ వీడియో గేమ్‌లను అందిస్తాయి. టెర్మినల్ A మరియు టెర్మినల్ D లో రెండు హెయిర్ సెలూన్‌లు ఉన్నాయి.

DFW వద్ద కరెన్సీ ఎక్స్ఛేంజ్

డల్లాస్ విమానాశ్రయం కరెన్సీ మారకం ఎక్స్ఛేంజ్ ఎక్స్ఛేంజ్ ప్రధానంగా టెర్మినల్ D (ఇంటర్నేషనల్ టెర్మినల్) లో, గేట్స్ 11, 22 (సెక్యూరిటీ వెలుపల), 24 మరియు 36 సమీపంలో చూడవచ్చు. మరొక కరెన్సీ ఎక్స్ఛేంజ్ టెర్మినల్ A లో గేట్ 29 సమీపంలో ఉంది.

DFW సమీపంలో ఉన్న హోటల్స్

మీకు లేఓవర్ ఉన్నా లేదా రాత్రిపూట మీ విమానం ఆలస్యమైనా, లేదా DFW సమీప ప్రాంతానికి వెళ్ళడానికి మీరు బస చేయడానికి స్థలం అవసరమైతే, సమీపంలో అనేక హోటల్స్ మరియు వసతి గృహాలు ఉన్నాయి.

DFW సమీపంలో ఆసక్తికరమైన ప్రదేశాలు

  • ఫోర్ట్ వర్త్ బొటానికల్ గార్డెన్, ఫోర్ట్ వర్త్
  • ఫోర్ట్ వర్త్ స్టాక్‌యార్డ్స్, ఫోర్ట్ వర్త్
  • పయనీర్ ప్లాజా, డల్లాస్

DFW గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ కనుగొనండి.

Facebook
Instagram
Twitter

This page contains information from third-party websites that are not under the control of Uber and that may be periodically changed or updated. Any information included on this page that is not directly related to Uber or its operations is for informational purposes only and in no way shall be relied upon, or interpreted or construed to create any warranties of any kind, either express or implied, regarding the information contained herein. Certain requirements and features vary by country, region, and city.