జిల్ హేజల్బేకర్
చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కమ్యూనికేషన్స్ & పబ్లిక్ పాలసీ
జిల్ హేజల్బేకర్ Uberలో కమ్యూనికేషన్స్ & పబ్లిక్ పాలసీ విభాగాలకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. కంపెనీ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ మరియు పబ్లిక్ పాలసీ కార్యక్రమాలకు బాధ్యత వహించే గ్లోబల్ టీమ్‌లకు నేతృత్వం వహిస్తున్నారు.
Uberలో చేరడానికి ముందు, జిల్ Snap Incలో కమ్యూనికేషన్స్ మరియు పబ్లిక్ పాలసీ టీమ్‌లకు నేతృత్వం వహించారు. Snapకు ముందు, జిల్ Googleలో పనిచేశారు, అక్కడ ఆమె యూరప్, మిడిల్ ఈస్ట్, మరియు ఆఫ్రికాకు సంబంధించిన కమ్యూనికేషన్స్, అలాగే యూరప్‌లోని ప్రభుత్వ సంబంధాలకు నాయకత్వం వహించారు. Googleలో తన కెరీర్ ప్రారంభ దశలో, జిల్ కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ టీమ్‌కు నాయకత్వం వహించారు.
అనేక స్థానిక, స్టేట్ మరియు ఫెడరల్ ఎన్నికల ప్రచారాలలో నాయకురాలుగా, US రాజకీయాలలో పాల్గొనడం ద్వారా జిల్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 2009లో, న్యూయార్క్ నగర మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ విజయవంతమైన రీ-ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో, జిల్ ఆయనకు ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. 2008లో, సెనేటర్ జాన్ మెక్‌కైన్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌కి, జిల్ నేషనల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మరియు చీఫ్ ప్రతినిధిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం మెక్‌కైన్ ఇనిస్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో ఒకరు.
2020 సంవత్సరంలో, సాంకేతిక రంగంలో ప్రముఖ మహిళా నాయకురాలుగా గుర్తింపునిస్తూ, Fortuneమరియు Ad Ageపత్రికల "40 అండర్ 40" జాబితాలలో జిల్కు స్థానం కల్పించారు. ఒరెగాన్కు చెందిన జిల్, ప్రస్తుతం తన భర్త, ముగ్గురు చిన్న పిల్లలు, ఇంకా వారి గోల్డెన్ రిట్రీవర్‌తో కలిసి వాషింగ్టన్ DCలో నివసిస్తున్నారు.