Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గర్వంగా కదలండి.

ప్రైడ్ నెలలో—మరియు ప్రతి నెల—ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, సురక్షితంగా మరియు భయం లేకుండా ప్రయాణించే హక్కు ఉందని మేం విశ్వసిస్తున్నాం.

మా కమ్యూనిటీ బహిరంగంగా మరియు ప్రామాణికమైన జీవితాన్ని గడపడానికి, ఎవరినైనా మరియు వారు కోరుకున్న విధంగా ప్రేమించడానికి మరియు వారి నిజాన్ని మాట్లాడే శక్తిని అనుభవించడానికి మేం అంకితభావంతో ఉన్నాం.

మేం ప్రస్తుతం పని చేస్తున్న కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి:

  • రైడర్‌లు మరియు డ్రైవర్‌లుకోసం సంఘటనలను రిపోర్ట్ చేయడానికి, సులభతరం చేయడానికి Uber సహాయ కేంద్రం స్వతంత్ర వివక్షను రిపోర్ట్ చేేసే ఎంపికను కలిగి ఉంది. మీరు దీన్ని Uber యాప్‌లో మరియు help.uber.com లో కనుగొనవచ్చు.
  • మా కమ్యూనిటీ మార్గదర్శకాలు వివక్షను స్పష్టంగా నిషేధించి, Uber యాప్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ప్రతి అనుభవాన్ని సురక్షితంగా, గౌరవంగా మరియు సానుకూలంగా భావించడంలో సహాయపడటంలో పాత్రపోషిస్తుంది. మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ మా యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఏమి ఆశించాలో అర్థం చేసుకుని, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా మేం కొనసాగిస్తాం.
  • ట్రాన్స్‌జెండర్ డ్రైవర్‌లు మరియు కొరియర్‌లకు ఎలా మద్దతు ఇవ్వాలనే దానిపై దృష్టి సారించి, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌లందరికీ పక్షపాతం మరియు వివక్షపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇది సంభావ్య వివక్ష సంఘటనలను నిర్వహించడానికి మా ప్రక్రియలను మెరుగుపరుస్తుంది.
  • ఆల్బర్ట్ కెన్నెడీ ట్రస్ట్న్యూయార్క్ నగరం హింస నిరోధక ప్రాజెక్ట్, మరియు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిడ్స్ ఫౌండేషన్తో సహా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 NGOలకు ఉచిత రైడ్‌లు మరియు భోజనాలు అందించడానికి మేం మా కొనసాగుతున్న నిబద్ధతలను కొనసాగిస్తున్నాం.
  • మా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న వారికి మెరుగైన మద్దతు ఇవ్వడానికి మేం కమ్యూనిటీ సభ్యుల మాటలు వింటాం, వారి నుండి నేర్చుకుంటాం మరియు వారితో నిమగ్నమై ఉంటాం—అలాగే కొనసాగుతాం.

అందరినీ కలుపుకొని మాట్లాడండి

ప్రతి ఒక్కరి కోసం - మరింత సానుకూల పరస్పర చర్యలను ప్రోత్సహించడంలో సహాయపడటానికి మేం కొన్ని చిట్కాలను రూపొందించాం.

ప్రైడ్ అన్ని రంగులలోనూ వస్తుంది

LGBTQIA + కమ్యూనిటీలో విభిన్న రంగులను సూచించే వివిధ సంఘాలు, జెండాలు, లైంగిక ధోరణులు మరియు లింగ గుర్తింపులపై దృష్టి పెట్టడంలో విజయం సాధించినందుకు మేము గర్విస్తున్నాము. *

  • జెండర్‌క్వీర్

    వింత లింగత్వం కలిగి ఉండే వారు నిర్దిష్టమైన లైంగిక వర్గాల కోవలో ఉండకుండా, వారి విషయంలో అన్ని సందర్భాలలో కాకపోయినా చాలా తరచుగా లైంగిక ధోరణి మారిపోతుంటుంది. వింత లింగత్వం కలిగి ఉండే వ్యక్తులు తమను తాము పురుషుడిగానూ అలాగే మహిళగానూ రెండు లింగాలుగానూ అలాగే కొన్నిసార్లు పురుషులు, మహిళలు అనే ఈ రెండు వర్గాలు కాకుండా వేరే వర్గంగా భావించుకుంటారు.

  • నాన్-బైనరీ

    తనను తాను ఒక పురుషుడుగా లేదా మహిళగా వివరించుకోలేని ఒక వ్యక్తిని వివరించే విశేషణం. బైనరీయేతర వ్యక్తులు పురుషుడిగానూ అలాగే మహిళగానూ, ఈ రెండింటి మధ్యలోని ఒక వ్యక్తిగా, లేదా పూర్తిగా ఈ వర్గాలకు వెలుపలి వ్యక్తిగా ఉంటారు. వీరిలో చాలా మంది లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులుగా గుర్తింపు పొందినప్పటికీ, బైనరీయేతర వ్యక్తులు అందరూ అలా చేయరు.

  • ట్రాన్స్‌జెండర్

    పుట్టుకతో కలిగి ఉన్న లింగం కాకుండా ప్రకృతి విరుద్ధమైన లింగ గుర్తింపు మరియు/లేదా వైఖరి కలిగి ఉండే వ్యక్తులందరికీ కలిపి ఉపయోగించే ఒక పదం. లింగ మార్పిడి పొందిన వ్యక్తి కావడం వల్ల ప్రత్యేకమైన లైంగిక ధోరణిని కలిగి ఉండరు. అందువల్ల, లింగ మార్పిడి పొందిన వ్యక్తులను సాధారణంగా స్వజాతితో లైంగిక చర్య చేసేవారిగానూ, స్వలింగ సంపర్కులుగానూ, లెస్బియన్ మరియు ద్విలింగ సంపర్కులుగానూ గుర్తిస్తారు.

  • పాన్‌సెక్సువల్

    ఏ లింగానికి చెందిన వ్యక్తుల పట్ల అయినా భావోద్వేగపరంగా, శృంగారపరంగా లేదా లైంగికంగా ఆకర్షితులయ్యే వ్యక్తులను వివరిస్తుంది, అయినా కూడా ఒకే సమయంలో ఒకే రీతిలో లేదా ఒకే స్థాయిలో ఆకర్షణకు లోనుకాకపోవచ్చు.

  • క్వీర్

    లింగ గుర్తింపు తరచూ మారిపోయే ధోరణులను వ్యక్తీకరించడానికి ప్రజలు తరచుగా ఉపయోగించే పదం. తరచుగా "LGBTQ."

    తో మారుస్తూ, ఉపయోగించబడుతుంది
  • పాలీసెక్సువల్

    పాలీసెక్సువల్ వ్యక్తి అంటే అన్ని లింగాల పట్ల కాకుండా ఒకటి కంటే ఎక్కువ లింగాల పట్ల లైంగికంగా మరియు/లేదా శృంగారపరంగా ఆకర్షితుడయ్యే వ్యక్తి.

  • గే

    తమ లింగానికే చెందిన సభ్యులకు భావోద్వేగపరంగా, శృంగారపరంగా లేదా లైంగికంగా ఆకర్షితులయ్యే వ్యక్తి.

  • అజెండర్

    సాధారణంగా ఒక లింగం లేని మరియు/లేదా నపుంసక లింగంగా అభివర్ణించే కోవలోని వివిఘ లింగాల వ్యక్తులందరినీ వర్ణించడానికి ఉపయోగించే ఒక సాధారణ పదం.

  • లెస్బియన్

    ఇతర మహిళలపై మానసికంగా మరియు ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షణ కలిగిన మహిళ.

  • అసెక్సువల్

    వ్యతిరేక లింగం పట్ల లైంగిక ఆకర్షణ లేదా కోరిక లేకపోవడం.

  • బైసెక్సువల్

    భావోద్వేగపరంగా, శృంగారపరంగా లేదా లైంగికంగా బహుళ లైంగికత, లింగం లేదా లింగ గుర్తింపుకు ఆకర్షితులయ్యే ఒక వ్యక్తి, అయినా కూడా ఒకే సమయంలో ఒకే రీతిలో లేదా ఒకే స్థాయిలో ఆకర్షణకు లోనుకాకపోవచ్చు.

  • ఇంటర్‌సెక్స్

    విస్తృతమైన సహజ శారీరక వ్యత్యాసాలను వివరించడానికి అన్నింటికీ కలిపి ఉపయోగించే ఒక సాధారణ పదం. కొన్ని సందర్భాల్లో, ఈ లక్షణాలు పుట్టుకతోనే కనిపిస్తాయి, మరికొన్ని యుక్తవయస్సు వచ్చే వరకు కనిపించవు. ఈ రకమైన కొన్ని క్రోమోజోమ్ తేడాలు శారీరకంగా స్పష్టంగా కనిపించకపోవచ్చు.

  • జెండర్-ఫ్లూయిడ్

    ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం, ఇది ఒక స్థిరమైన లింగంతో గుర్తింపు పొందని వ్యక్తి; ఒక నిర్దిష్ట లింగ గుర్తింపుని పోగొట్టుకున్న లేదా పోగొట్టుకున్నట్లు భావనలను వ్యక్తీకరించే ఒక వ్యక్తిని సూచిస్తుంది.

1/13

అందరికీ సహాయకారులు

ప్రతి ఉద్యోగితో గౌరవంగా, విశ్వసనీయంగా ఉంటూ వారికి సహకారం అందించడంతో పాటు వారితో స్నేహంగా మెలుగుతూ, ఒక సానుకూలమైన, సుహృద్భావ కార్యాలయ వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం.

సహాయకారి అంటే సమానత్వం కోసం తోటి గ్రూప్‌లకు చేయూతనిస్తూ సహాయపడే వ్యక్తి.

విజయవంతమైన సహాయకారి అనిపించుకోవడానికి కొన్ని చిట్కాలు:

బాగా వినేవారిగా ఉండండి

మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ముందుగా ఇతరులు చెప్పేది వినడం సానుకూల సంభాషణను ప్రోత్సహించడంలో సహాయపడే ముఖ్యమైన స్వభావం.

పదసంపుటి తెలుసుకోండి

ఒక మంచి సహాయకారి అనిపించుకోవడానికి తప్పనిసరిగా తమ విశేషాధికారం, ప్రత్యేక చొరవ చూపిస్తూ ఇతరులకు అండగా నిలబడాలి. సవ్యమైన రీతిలో ఎలా సంబోధించాలో తెలుసుకుంటూ అవసరమైనప్పుడు ప్రశ్నలు అడిగి, తెలుసుకోవడం ముఖ్యం.

సాంకేతిక ప్రక్రియలను తెలుసుకోండి

లింగత్వం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు గురించి ఊహాగానాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రశ్నలు అడగడం కూడా చాలా ముఖ్యం. చెడు ప్రవర్తనను చూసినప్పుడు మీరు తప్పనిసరిగా స్పందించాల్సి ఉంటుంది.

సమాన అవకాశం

Uber కమ్యూనిటీ భిన్నత్వంలోని శక్తిని విలువైనదిగా పరిగణించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ సమాన ఆదాయ అవకాశాలను అందిస్తున్నందుకు గర్విస్తోంది. సమాన అవకాశాలు కల్పించడానికి, అందరినీ కలుపుకుపోవడానికి మేము చూపుతున్న నిబద్ధత మా ఉద్యోగుల సంస్కృతి మరియు విధానాలన్నింటిలో కూడా ముడిపడి ఉంటుంది.

ప్రగతి సాధన అన్నది ఎన్నటికీ పూర్తయ్యేది కాదని మాకు తెలుసు. అలాగే హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ నుండి గత 6 సంవత్సరాలుగా కార్పొరేట్ సమానత్వ సూచికలో 100 పాయింట్లు అందుకోవడాన్ని మేం గౌరవంగా భావిస్తున్నాం.

ఎల్లప్పుడూ అండగా నిలబడండి

పారదర్శకత, కమ్యూనికేషన్‌ను పెంచడానికి, 2019లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల కోసం మేం మొదటిసారిగా లింగ పరివర్తన మార్గదర్శకాలను ప్రారంభించాం.

లింగ మార్పిడి చేయించుకున్న మా భాగస్వాములకు సంపాదించుకునే అవకాశాలను పెంపొందించడానికి మా కృషిలో భాగంగా, లింగ మార్పిడి చేయించుకున్న వ్యక్తులను మా డ్రైవర్ పార్టనర్‌లుగానూ, డెలివరీ పార్టనర్‌లుగానూ అలాగే ఉద్యోగులుగానూ చేర్చుకునేందుకు మేం పాటుపడుతున్నాం.

*పైన పేర్కొన్న నిబంధనలను హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ మరియు ట్రాన్స్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ రచించాయి. మరిన్ని వివరాల కోసం hrc.org మరియు transstudent.org లింక్‌లను సందర్శించండి. ఈ కంటెంట్‌ను ఉపయోగించడానికి గల అనుమతి హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ లేదా ట్రాన్స్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ రీసోర్స్‌ల ద్వారా Uber చేస్తున్న ఎండార్స్‌మెంట్‌గా ఉద్దేశించినది కాదు, ఆ విధంగా పరిగణించకూడదు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو