మీకు సైన్ అప్ చేయడంలో లేదా అమ్మకాల బృందంలోని సభ్యుడి నుండి ఫాలో-అప్ పొందడంలో సమస్య ఎదురౌతుండవచ్చు. రైడ్ల కోసం వోచర్లు మీ దేశంలో అందుబాటులో ఉన్నాయని దయచేసి గమనించండి.
రైడ్లు మరియు భోజనం ఖర్చును వోచర్లతో సర్దుబాటు చేయండి
కొత్త కస్టమర్లను చేరుకోండి మరియు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులను VIPలా చూడండి.
వోచర్లతో ఏ అనుభవాన్ని అయినా elevate చేయండి
కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచండి
మీరు ఆశ్చర్యపర్చాలన్నా లేదా ఆనందపరచాలనుకున్నా లేదా విషయాలను సరిచేయాలనుకున్నా, వోచర్లు కస్టమర్ లాయల్టీని పెంచడం సులభతరం చేస్తాయి.
ఎక్కువమంది వచ్చేలా చేయండి
మీరు దీని కోసం చెల్లిస్తే, అవి వస్తాయి. మీ స్టోర్ వద్దకు మరియు స్టోర్ నుండి తీసుకునే రైడ్లను సబ్సిడీ చేయండి. గొప్ప ప్రారంభాల కోసం మరియు కస్టమర్లు తిరిగి రప్పించడం కోసం ఉత్తమమైనది.
ప్రోత్సాహకాలతో డిమాండ్‌ను సృష్టించండి
అభినందపూర్వక రైడ్లు మరియు భోజనాలు ఉన్న ప్రోత్సాహకాలతో మీ మార్కెటింగ్ ప్రయత్నాలను మరింత పెంచండి. కస్టమర్లను సంపాదించడానికి ఉత్తమమైనది.
అమ్మకాల అవకాశాల కోసం మధ్యాహ్న భోజనాలను కొనండి
మీ ఉత్తమ అమ్మకాల ఉద్యోగులకు వోచర్లను అందించడం ద్వారా మధ్యాహ్న భోజనం ఖర్చులను భరించండి. సంభాషణను ప్రారంభించడానికి ఆహారం ఎల్లప్పుడూ సహాయపడుతుంది.
ప్రత్యేకమైన ఉద్యోగి ప్రోత్సాహకాన్ని అందించండి
ఇది వర్క్ ఈవెంట్ కోసం రైడ్ తీసుకోవడం అయినా లేదా భోజనం కోసం నెలవారీ స్టైఫండ్ అయినా, వోచర్లు మీ ప్రజలను సంతోషంగా ఉంచడంలో మరియు ప్రేరేపించడంలో సహాయపడతాయి.
మీ నియామకాన్ని మెరుగుపరచండి
ఇంటర్వ్యూ వద్దకు మరియు ఇంటర్వ్యూ నుండి రైడ్లకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా అభ్యర్థుల కోసం రెడ్ కార్పెట్ వేయండి, వారు సమయానికి వచ్చేలా చూసుకోండి.
వోచర్లను గిఫ్ట్ కార్డ్‌లతో పోల్చండి
రైడ్లు మరియు భోజనాల ఖర్చును కొన్ని విధానాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉండే విధానాన్ని కనుగొనండి.
- అవలోకనం
వోచర్లు: మీరు Uber క్రెడిట్‌ను ఉద్యోగులకు లేదా కస్టమర్లకు అందిస్తూ, వారు పొందిన రైడ్లు లేదా ఆర్డర్ చేసిన భోజనాలకు మాత్రమే చెల్లిస్తారు. మీరు పరామితులను కూడా నియంత్రిస్తూ క్రెడిట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటూ ఉండవచ్చు.
గిఫ్ట్ కార్డ్‌లు: మీరు Uber క్రెడిట్‌ను కొనుగోలు చేసి మీ ఉద్యోగులు లేదా కస్టమర్లు వారికి నచ్చిన విధంగా ఉపయోగించుకోవడం కోసం వారికి అందిస్తారు.
- ఇది ఎలా పని చేస్తుంది?
వోచర్లు: మీరు గ్రహీతలకు Uber క్రెడిట్‌ను అందించి దానికి గడువు ముగింపు తేదీలు, లొకేషన్ నియంత్రణలు, మరియు/లేదా క్రెడిట్‌ను ఉపయోగించగలిగే తేదీ మరియు సమయం వంటి పరిమితులను ఏర్పాటు చేయవచ్చు. గ్రహీతలు రైడ్లు లేదా భోజనాన్ని వారి Uber లేదా Uber Eats యాప్ నుండి అభ్యర్ధించి, వారి కొనుగోలుకు వోచర్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ సైన్ అప్ చేయవచ్చు.
గిఫ్ట్ కార్డ్‌లు: మీరు గ్రహీతలకు డిజిటల్ కార్డ్‌లను టెక్స్ట్, ఇమెయిల్ లేదా ప్రింట్ ద్వారా పంపించవచ్చు—ఎలా పంపించాలో మీరే నిర్ణయించండి. భౌతిక గిఫ్ట్ కార్డ్‌లు మా సేల్స్ బృందం వద్ద లభ్యమవుతాయి. కార్డ్‌లను ఆన్లైన్లో అయితే ఇక్కడ, సేల్స్ బృందం నుండి అయితే ఇక్కడ కొనుగోలు చేయండి.
- నేను ఎలా చెల్లించాలి?
వోచర్లు: వోచర్‌ను ఎవరైనా వినియోగదారు రిడీమ్ చేసి రైడ్ లేదా భోజనం కోసం చెల్లించడానికి ఉపయోగించిన సందర్భంలో మాత్రమే మీరు చెల్లింపు చేస్తారు. ఉదాహరణకు, మీరు వోచర్ల రూపంలో $100 అందించి, అందులో $50 మాత్రమే ఉపయోగించినట్లయితే మీరు $50 చెల్లిస్తారు.
గిఫ్ట్ కార్డ్‌లు: గిఫ్ట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన సందర్భంలో మీరు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు.
- వ్యాపార సంస్థలు ఈ ఉత్పత్తులను సాధారణంగా ఎలా ఉపయోగిస్తాయి?
వోచర్లు: సంస్థలు వోచర్లను ఉపయోగించే కొన్ని విధానాలలో వర్చువల్ ఈవెంట్లకు హాజరయ్యే వారికి భోజనం కొనడం, తమ వ్యాపార కేంద్రాలకు వినియోగదారుల తాకిడిని పెంచడానికి అయ్యే రైడ్ ఖర్చులను సర్దుబాటు చేసి, వాటిని వినియోగదారులకు కొనుగోళ్ళపై రివార్డ్‌లుగా అందించడం ఉన్నాయి.
గిఫ్ట్ కార్డ్‌లు: గిఫ్ట్ కార్డ్‌లను సంస్థలు తమ ఉద్యోగులకు ఏడాది ముగింపు లేదా హాలిడే బహుమతులుగా, కార్పోరేట్ బహుమతులుగా లేదా కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు, మరియు బహుమతులు లేదా నజరానాలుగా ఇవ్వడానికి ఉపయోగిస్తాయి.
వోచర్లు ఎందుకు ఉపయోగించాలి
మీ ప్రజలు ఇష్టపడే ప్రయోజనం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు Uberను ఉపయోగిస్తున్నారు. మీ కస్టమర్లు మరియు ఉద్యోగులకు ఇప్పటికే కేటాయించిన సేవా ఖర్చును భరించడం ద్వారా వారిని ఆనందపరచండి.
పంపడం మరియు రీడీమ్ చేయడం సులభం
వోచర్లను తక్షణమే సృష్టించి ఇమెయిల్, టెక్స్ట్ మరియు ఇతర ఛానెల్‌ల ద్వారా పంపండి. కస్టమర్లు ఒకే ట్యాప్‌తో రీడీమ్ చేయగలుగుతారు మరియు మీరు వారు తీసుకునే రైడ్లకు మాత్రమే చెల్లిస్తారు.
అంతర్దృష్టులు మరియు నివేదికలను రూపొందించడం సులభం
Uber for Business డ్యాష్‌బోర్డ్ నుండి వోచర్ల రిడెంప్షన్ యొక్క స్టేటస్‌ని ట్రాక్ చేయండి. మీ తర్వాతి ప్రయత్నాన్ని మరింత విజయవంతంగా మార్చడానికి ఫలితాలను ఉపయోగించండి.
కస్టమర్లకు $100 విలువ చేసిన Uber Eats క్రెడిట్‌ను ఇచ్చిన తరువాత Galaxy మొబైల్ పరికర అమ్మకాలను Samsung 20% పెంచింది.
మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ఇది ఎలా పని చేస్తుంది
అవలోకనం
ప్రొడక్ట్‌లు మరియు ఫీచర్లు
పరిష్కారాలు
రైడ్లు
Eats
డెలివరీ
పరిశ్రమలు మరియు బృందాలు
పరిశ్రమలు
బృందాలు
వనరులు
వనరులు