మా గురించి
ప్రజలను ఒక చోటు నుండి మరొక చోటుకి తరలించడం ద్వారా, మేము వారికి ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తాము
ప్రజలు పట్టణం అంతటా మరియు తమ కలల వైపు ప్రయాణించగలిగినప్పుడు మంచి విషయాలు జరుగుతాయి. అవకాశాలు కనిపిస్తాయి, తెరుచుకుంటాయి, వాస్తవంగా మారతాయి. బటన్‌ను నొక్కి రైడ్ పొందడంతో ప్రారంభమైన మా టెక్నాలజీ సహాయంతో అన్ని రకాల ప్రదేశాలకు వివిధ మార్గాల్లో ప్రయాణించటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య వందల కోట్ల సంబంధాలను ఏర్పరిచింది.
మా CEO లేఖ
మా అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి సహాయపడే టెక్నాలజీని అందించడంలో మా బృందం యొక్క నిబద్ధత గురించి చదవండి.
సుస్థిరత
2040 నాటికి 100% రైడ్లు ఉద్గార రహిత వాహనాల్లో జరిగే, ప్రజా రవాణాలో లేదా మైక్రోమొబిలిటీతో పూర్తిగా విద్యుత్, ఉద్గార రహిత ప్లాట్‌ఫామ్‌గా మారడానికి ఉబెర్ కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌గా వాతావరణ మార్పుల సవాలును మరింత ధీటుగా ఎదుర్కోవడం మా యొక్క బాధ్యత. రైడర్లకు పర్యావరణ హితమైన రైడ్ చేయడానికి మరిన్ని మార్గాలను అందించడం, ఎలక్ట్రిక్‌కి మారడంలో డ్రైవర్లకు సహాయం చేయడం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే స్వచ్ఛమైన మరియు పూర్తిగా విద్యుత్ కు మారటాన్ని వేగవంతం చేయడంలో సహాయపడటానికి స్వచ్ఛంద సంసమథలు మరియు ప్రైవేట్ రంగాలతో భాగస్వామ్యం ద్వారా మేము దీన్ని చేస్తాము.
రైడ్లు మరియు అంతకు మించి
రైడర్లకు పాయింట్ A నుండి పాయింట్ B వరకు మార్గాన్ని ఇవ్వడంతో పాటు, మేము స్వీయ-డ్రైవింగ్ టెక్నాలజీ మరియు పట్టణ వాయు రవాణాతో భవిష్యత్తును దగ్గరకు తీసుకురావడానికి కృషి చేయడం, ఆహారాన్ని త్వరగా మరియు సరసంగా ఆర్డర్ చేయడంలో ప్రజలకు సహాయపడటం, ఆరోగ్య సంరక్షణకు అడ్డంకులను తొలగించడం, కొత్త ఫ్రైట్-బుకింగ్ సేవలను సృష్టించడం మరియు సంస్థలకు ఆటంకం లేని ఉద్యోగుల ప్రయాణ అనుభవాన్ని అందించడంలో సహాయం చేస్తున్నాము.
మీ భద్రతే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది
మీరు వెనుక సీటులో ఉన్న రైడర్ అయినా లేదా వాహనాన్ని నడిపే డ్రైవర్ అయినా, మీ భద్రత మాకు ముఖ్యం. మేము మా వంతు కృషికి కట్టుబడి ఉన్నాము మరియు మా విధానంలో సాంకేతికత అతి ముఖ్యమైనది. భద్రతను మెరుగుపరచి, ప్రతిఒక్కరికీ సులభంగా వెళ్లడంలో సహాయపడుటానికి మేము భద్రతా నిపుణులతో భాగస్వామ్యం చేసి కొత్త సాంకేతికత మరియు విధానాలను అభివృద్ధి చేస్తాము.
కంపెనీ సమాచారం
ఉబెర్ ను ఎవరు నడుపుతున్నారు
ఉబెర్ వద్ద మేము రైడర్లు, డ్రైవర్లు మరియు ఉద్యోగుల కోసం సరైన సమయంలో, సరైన పనిని చేయటానికి ప్రాధాన్యతనిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తున్నాము. ముందుకు నడిపిస్తున్న బృందం గురించి మరింత తెలుసుకోండి.
వైవిధ్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం
అందరినీ కలుపుకొని పనిచేసే, మరియు మేము సేవలు అందిస్తున్న నగరాల వైవిధ్యాన్ని ప్రతిబింబిచే కార్యాలయాన్ని సృష్టించడం మా లక్ష్యం మరియు - ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలాగే ఉండగలరు మరియు ఆ యదార్ధతే ఒక బలంగా కొనియాడబడుతుంది. ప్రతి రంగం నుండి ప్రజలు అభివృద్ధి చెందగల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, మేము ఉబెర్ ను మా ఉద్యోగులు మరియు మా కస్టమర్ల కోసం మెరాగైన సంస్థగా చేస్తాము.
తాజా విషయాలను తెలుసుకుంటూ ఉండండి
న్యూస్‌రూమ్
మీకు సమీపంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్యాలు, యాప్ అప్డేట్లు, ప్రయత్నాలు మరియు మరిన్నింటి గురించి ప్రకటనలను పొందండి.
బ్లాగ్
కొత్త ప్రదేశాలను కనుగొనండి, అలాగే ఉబెర్ ఉత్పత్తులు, భాగస్వామ్యాలు మరియు మరిన్నింటి గురించి తెలుసుకోండి.
పెట్టుబడిదారు సంబంధాలు
ఆర్థిక నివేదికలను డౌన్లోడ్ చేయండి, తర్వాతి త్రైమాసిక ప్రణాళికలను చూడండి మరియు మా కార్పొరేట్ బాధ్యతా కార్యక్రమాల గురించి చదవండి.