Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రతి ఒక్కరినీ గౌరవించండి

ప్రతి ఒక్కరికీ సహాయసహకారాలు అందిస్తామనే, వారిని సాదరంగా స్వాగతిస్తామనే భావన కలిగించాలని మేము విశ్వసిస్తున్నాము. అందువలన మేము శారీరక సంబంధం, లైంగిక వేధింపు మరియు దుష్ప్రవర్తన, బెదిరించడం మరియు దురుసుగా ప్రవర్తించడం, అవాంఛిత పరిచయం, వివక్షత మరియు ఆస్తి నష్టం వంటి అంశాలపై ప్రమాణాలను సృష్టించాము.

తాకడం

Uberకు సంబంధించిన ఏదైనా యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు అపరిచితులను లేదా మీరు కలుసుకున్న ఎవరినీ తాకరాదు. ఎవరినైనా కొట్టడం, బాధపెట్టడం లేదా బాధపెట్టాలని అనుకోవడం ఎన్నడూ అనుమతించబడదు.

లైంగిక వేధింపులు మరియు చెడు ప్రవర్తన

లైంగిక వేధింపులు మరియు ఏ విధమైన లైంగిక దుష్ప్రవర్తన అయినా నిషిద్ధం. లైంగిక వేధింపు మరియు దుష్ప్రవర్తన అనగా ఇతర వ్యక్తి నుండి స్పష్టమైన సమ్మతి లేకుండా లైంగిక సంబంధం లేదా ప్రవర్తనను సూచిస్తుంది.

వ్యక్తిగత స్వేచ్ఛ మరియు గోప్యతను గౌరవించాలి. కింది జాబితాలో అనుచితమైన ప్రవర్తనకు ఉదాహరణలను అందించాము, కానీ ఇది సమగ్రమైనది కాదు.

  • వ్యక్తులకు అసౌకర్యంగా అనిపించే ప్రవర్తనలు మరియు వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. మెల్లగా తాకడం, ఈల వేయడం మరియు కన్ను కొట్టడం వంటివి ఉదాహరణలు. మీకు తెలియని వ్యక్తులను తాకకండి లేదా వారితో సరసాలాడకండి.
  • హానికరం కానట్లుగా అనిపించే నిర్దిష్ట సంభాషణలు అభ్యంతరకరంగా ఉండవచ్చు. రూపురేఖలు, గ్రహించిన లింగ గుర్తింపు లేదా లైంగిక ధోరణిపై వ్యాఖ్యలు చేయకండి. “మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?” వంటి సంబంధం లేని వ్యక్తిగత ప్రశ్నలను అడగకుండా ఉండండి. మీ స్వంత లేదా వేరొకరి లైంగిక జీవితం గురించి చర్చించడం, అభ్యంతరకరమైన భాషలో మాట్లాడటం లేదా సెక్స్ గురించి జోకులు వేయడం వంటివి మానుకోండి.
  • Uberలో సెక్స్ రహితం అనే నియమం ఉంది. ట్రిప్‌లో ఉన్నప్పటితో సహా Uber యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లైంగికంగా కలవడం నిషిద్ధం. ఇక్కడ మరింత తెలుసుకోండి.

బెదిరించడం మరియు దురుసుగా ప్రవర్తించడం

దూకుడుగా, ఘర్షణకు దిగేలా లేదా వేధించేలా ప్రవరించడానికి అనుమతి లేదు. అగౌరవపరిచే లేదా బెదిరించే విధంగా మాట్లాడకండి లేదా సంజ్ఞలు చేయకండి. మతం మరియు రాజకీయ విశ్వాసాల వంటి వ్యక్తిగత విషయాలలో భేదాభిప్రాయాలకు దారి తీసే అవకాశం ఉంది, కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచి ఆలోచన.

  • డ్రైవర్‌లు మరియు కో-డ్రైవర్‌లతో చేసే సంభాషణలు సాధారణంగా మరియు స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత ప్రశ్నలు అడగకండి లేదా ఇతరుల పట్ల దురుసుగా వ్యవహరించకండి.

  • రైడర్‌లతో పరస్పరం జరిగే సంభాషణలు సాధారణంగా మరియు స్నేహపూర్వకంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత ప్రశ్నలు అడగకండి లేదా ఇతరుల పట్ల దురుసుగా వ్యవహరించకండి.

కోరుకోని కాంటాక్ట్

ట్రిప్ పూర్తయిన తర్వాత, పోగొట్టుకున్న వస్తువును తిరిగి ఇవ్వడానికి తప్ప మరే ప్రయోజనం కోసం పరిచయాన్ని కొనసాగించకూడదు. ఉదాహరణకు, ట్రిప్ పూర్తయిన తర్వాత టెక్స్ట్ చేయడం, కాల్ చేయడం, సోషల్ మీడియాలో సంప్రదించడం లేదా వ్యక్తిగతంగా కలవడం లేదా కలవడానికి ప్రయత్నించడం వంటి వాటికి అనుమతి లేదు.

  • మీ ప్రస్తుత ట్రిప్‌కు సంబంధించి లేదా పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందడానికి కాకుండా వేరే ఏదైనా కారణంగా రైడర్ మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వెంటనే Uberకి తెలియజేయాలి.

  • మీ ప్రస్తుత ట్రిప్ లేదా డెలివరీకి సంబంధించి లేదా పోగొట్టుకున్న వస్తువును తిరిగి ఇవ్వడానికి కాకుండా వేరే ఏదైనా కారణంగా డ్రైవర్ మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వెంటనే Uberకి తెలియజేయాలి.

వివక్ష చూపించడం

మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా మరియు స్వాగతనీయంగా భావించాలి. అందువలన, వివక్షాపూరితంగా వ్యవహరించడం లేదా ప్రవర్తించడం వంటివి మేము సహించము. వయస్సు, రంగు, వైకల్యం, లింగ గుర్తింపు, వైవాహిక స్థితి, జాతీయ మూలం, జాతి, మతం, లింగం లేదా లైంగిక ధోరణి వంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని, ఒకరిపై వివక్ష చూపకండి.

  • నిర్దిష్ట పరిసర ప్రాంతాలలో ఉన్న వ్యక్తులు లేదా వ్యాపార సంస్థల స్వభావం కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లకూడదనే ఏకైక ఉద్దేశ్యంతో అభ్యర్థనలను కావాలని తిరస్కరించడానికి లేదా రద్దు చేయడానికి అనుమతి లేదు.

  • మీ చట్టబద్ధంగా రక్షితమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని మీకు ట్రిప్‌ను తిరస్కరించారని మీరు విశ్వసిస్తే, దయచేసి Uber యాప్‌లో సంఘటన గురించి నివేదించండి.

  • మీరు మా బైక్‌లో లేదా రైడ్‌లో వెళ్తున్నప్పుడు, మీ చట్టబద్ధంగా రక్షితమైన లక్షణాలను ఆధారంగా చేసుకుని మరొక వినియోగదారు మిమ్మల్ని బెదిరించినట్లు, అవమానించినట్లు లేదా వేధించినట్లు మీరు విశ్వసిస్తే, దయచేసి Uber యాప్‌లలో ఈ సంఘటనను నివేదించండి.

ఆస్తి నష్టం

ఆస్తి నష్టం కలిగించడానికి ఎప్పుడూ అనుమతి లేదు. యాప్ ద్వారా అభ్యర్థించిన కారు, బైక్, స్కూటర్ లేదా ఇతర రవాణా విధానాన్ని పాడు చేయడం; ఫోన్ లేదా టాబ్లెట్‌ను విరగ్గొట్టడం లేదా నాశనం చేయడం; ఉద్దేశపూర్వకంగా ఆహారం లేదా పానీయాన్ని క్రింద పడేయడం; కారులో ధూమపానం చేయడం; లేదా అధికంగా మద్యం సేవించడం వల్ల వాంతులు చేయడం వంటివి కొన్ని ఉదాహరణలు. మీరు ఆస్తి నష్టం కలిగిస్తే, సాధారణ వినియోగం వలన కలిగేది కాకుండా శుభ్రపరచడానికి మరియు మరమ్మతు చేయడానికి అయ్యే అదనపు ఫీజులను చెల్లించే బాధ్యత మీరు వహించాలి. మీరు Uber యాప్‌ల ద్వారా బైక్, మోపెడ్ లేదా స్కూటర్‌ను అద్దెకు తీసుకుంటే, మీ ట్రిప్ ముగిసిన తర్వాత చివరిలో దాన్ని సురక్షితంగా లాక్ చేసినట్లు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. అలా చేయడంలో విఫలమైతే, అదనపు ఛార్జీ లేదా ఫీజు చెల్లించాల్సి రావచ్చు.

మరిన్ని కమ్యూనిటీ మార్గదర్శకాలను చూడండి

ఒకరినొకరు సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

చట్టాన్ని అనుసరించండి

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو