Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒకరినొకరు సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరూ వహించాల్సిన బాధ్యత ఉంది. అందువల్ల ఖాతా షేర్ చేయడం, ఖాతాదారు వయస్సు, మరిన్నింటిపై మేము నిర్ణీత ప్రమాణాలు పాటిస్తాము.

ఖాతా షేరింగ్

ఖాతాను పంచుకోవడానికి అనుమతి లేదు. ఏదైనా Uber యాప్‌ను ఉపయోగించడానికి, మీరు యాక్టివ్ ఖాతా కోసం నమోదు చేసుకుని, దాన్ని కలిగి ఉండాలి. మీ ఖాతాను ఉపయోగించడానికి మరొక వ్యక్తిని అనుమతించకండి, అలాగే మీ లాగిన్ సమాచారాన్ని మరెవరితోనూ పంచుకోకండి.

  • మీ ఖాతాను సురక్షితం చేసుకోండి. మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి మరెవరినీ అనుమతించకండి. మా వయో పరిమితులకు అనుగుణంగా ఉండే మరొకరి కోసం రైడ్‌ను అభ్యర్థించడంలో తప్పు లేదు, దీన్ని Uber సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు పరిగణించము.

  • మీ ఖాతాను సురక్షితం చేసుకోండి. మీ ఖాతాను ఉపయోగించి Uber యాప్‌లో అభ్యర్థనలను అంగీకరించడానికి మరెవరినీ అనుమతించకండి.

  • మీ ఖాతాను సంరక్షించుకోండి. మీ ఖాతాను ఉపయోగించి ఎప్పుడూ వేరొకరిని స్కూటర్ లేదా బైక్‌ను అద్దెకు తీసుకోవాడానికి అనుమతించవద్దు.

18 ఏళ్లలోపు వ్యక్తులు

రైడర్ ఖాతా కలిగి ఉండటానికి మీకు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. రైడ్ సమయంలో ఖాతాదారు లేదా ఇంకెవరైనా పెద్దవారు తోడుగా లేకుండా 18 ఏళ్లలోపు వయస్సు గలవారిని ఒంటరిగా పంపడం కోసం ఖాతాదారులు రైడ్‌ను అభ్యర్థించకూడదు. అలాగే, ఖాతాదారులు 18 ఏళ్లలోపు వయస్సు గలవారు నడపడం కోసం బైక్ లేదా స్కూటర్‌ను అద్దెకు తీసుకోకూడదు.

  • మీరు పికప్ చేసుకునే సమయంలో మీ రైడర్ వయస్సు 18 ఏళ్లలోపు ఉన్నట్లు గమనించినట్లయితే, ట్రిప్‌ను తిరస్కరించి, ఈ విషయాన్ని Uberకి నివేదించవచ్చు. ఈ ప్రాతిపదికన తిరస్కరించే లేదా రద్దు చేసే ట్రిప్‌ల ప్రభావం మీ డ్రైవర్ రేటింగ్‌పై పడదని గుర్తుంచుకోండి. అలాగే మీరు ట్రిప్‌ను ఎందుకు అంగీకరించలేరనే విషయాన్ని మీ రైడర్‌కు తెలియజేయడం మంచి ఆలోచన, ఇలా చేయడం వలన వారికి కూడా జరిగిన విషయం తెలుస్తుంది.

  • పెద్దవారు 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారి కోసం రైడ్‌ను అభ్యర్థించకూడదు లేదా ఒంటిరిగా రైడ్‌లో వెళ్లడానికి అనుమతించకూడదు.

  • 18 ఏళ్లలోపు వయస్సు గలవారు Uber యాప్‌ను ఉపయోగించి బైక్ లేదా స్కూటర్‌ను అద్దెకు తీసుకోవడానికి అనుమతి లేదు.

అదనపు ప్రయాణీకులు మరియు ప్యాకేజీలు

Uberతో డ్రైవ్ చేస్తున్నప్పుడు, అభ్యర్థించిన రైడర్ మరియు రైడర్' అతిథులు తప్ప మరెవరినీ వాహనంలోకి అనుమతించకూడదు. Uberతో రైడ్ చేస్తున్నప్పుడు, వాహనంలో ఉన్న మొత్తం బృందం యొక్క ప్రవర్తనకు ఖాతాదారు బాధ్యత వహించాలి. మీరు మరొక పెద్దవారి కోసం రైడ్‌ను అభ్యర్థించినా లేదంటే బైక్ లేదా స్కూటర్‌ను అద్దెకు తీసుకున్నా, ట్రిప్ సమయంలో వారి ప్రవర్తనకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, Uber యాప్‌ను డెలివరీ సేవగా ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. రైడర్ ఏదైనా వస్తువు మరియు/లేదా ప్యాకేజీని డెలివరీ చేయాలనే ఉద్దేశ్యంతో రైడ్‌ను అభ్యర్థించినట్లయితే, దాన్ని అంగీకరించకుండా ఉండేందుకు లేదా రైడ్ అభ్యర్థనను రద్దు చేసేందుకు డ్రైవర్‌లకు హక్కు ఉంది. మీరు ప్యాకేజీ మరియు/లేదా వస్తువును డెలివరీ చేయడం కోసం Uber యాప్‌లను ఉపయోగించాలని ఎంచుకుంటే, ప్యాకేజీ(లు) మరియు/లేదా వస్తువు(ల)కు ఏమి జరిగినా సరే, అందుకు పూర్తిగా మీరే కారకులు మరియు ఆ బాధ్యత మీపై ఉంటుంది. అటువంటి ప్యాకేజీలు మరియు/లేదా వస్తువులను కవర్ చేసే బీమా సదుపాయం Uberలో లేదు.

వాహనం గురించి సమాచారం

పికప్‌ను సులభం చేయడం కోసం, డ్రైవర్‌లు మరియు వారి వాహనాలకు సంబంధించిన లైసెన్స్ ప్లేట్ నంబర్, వాహన తయారీదారు మరియు మోడల్, ప్రొఫైల్ చిత్రం మరియు పేరు వంటి గుర్తింపు సమాచారాన్ని Uber యాప్‌లు రైడర్‌లకు అందిస్తాయి.

  • దీని వలన Uber ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలదు. మీ వాహనం సమాచారం, గడువు ముగియనున్న డ్రైవింగ్ లైసెన్స్ లాంటి మీ డాక్యుమెంటేషన్ అప్‌డేట్‌ల గురించి మాకు తెలియజేయండి.

  • మీ రైడ్‌ను ఎల్లప్పుడు యాప్‌లో అందించిన సమాచారంతో సరిపోల్చి చూడండి. 'సరైన గుర్తింపు సమాచారం లేని డ్రైవర్‌ నడుపుతున్న కారులో ఎక్కవద్దు.

సీట్ బెల్ట్‌లు

సీట్ బెల్ట్‌ను పెట్టుకోవడం అనేది కారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడగల మరియు గాయాల తీవ్రతను తగ్గించగల అత్యంత సమర్థవంతమైన మార్గంగా చెప్పవచ్చు. డ్రైవర్ మరియు వెనుక సీటులో ఉన్నవారితో సహా రైడర్‌లందరూ ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. రైడర్‌లు తమ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సరిపోయేలా సీట్ బెల్ట్‌లు ఉన్న కారును అభ్యర్థించాలి, తమ కారులో ప్రయాణించబోయే ప్రతి ఒక్కరికీ సరిపోయే సంఖ్యలో సీట్ బెల్ట్‌లు లేని పక్షంలో, డ్రైవర్‌లు రైడ్‌ను తిరస్కరించవచ్చు.

బైక్‌లు, మోటార్‌సైకిళ్ళు, స్కూటర్‌ల కోసం హెల్మెట్‌లు

మీ భద్రత కోసం బైక్, మోటార్‌సైకిల్‍ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు, బాగా సరిపోయే హెల్మెట్‌ను ఉపయోగించండి. హెల్మెట్‌లను తయారీదారు సూచనల ప్రకారం ధరించినప్పుడు అవి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి: మీ నుదిటి క్రింద, మీ గడ్డంకి అమర్చేలా ఉండాలి.

కెమెరాలు లేదా ఇతర వీడియో లేదా ఆడియో రికార్డింగ్ పరికరాల ఉపయోగం

Uber యాప్‌లను ఉపయోగిస్తున్న ఎవరైనా Uber లేదా సంబంధిత అధికారులకు నివేదించడం కోసం సమస్యను పొందుపరచడంతో సహా వర్తించే చట్టాల ప్రకారం అనుమతి ఉన్న పరిధి మేరకు ట్రిప్ లేదా డెలివరీని పూర్తిగా లేదా అందులో కొంత భాగాన్ని రికార్డ్ చేయడానికి ఎంచుకోవచ్చు. వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం రికార్డింగ్ పరికరాలను ఉపయోగిస్తున్న వ్యక్తి ఎవరైనా సరే తాము రికార్డ్ చేయబోతున్న వ్యక్తికి ఆ విషయం తెలియజేసి, అందుకు గానూ వారి సమ్మతిని పొందాల్సి ఉండవచ్చు. దయచేసి ఇవి వర్తిస్తాయో లేదో తెలుసుకోవడానికి మీ నగరంలోని స్థానిక నియంత్రణలను చూడండి.

ఒక వ్యక్తి యొక్క చిత్రం, ఆడియో లేదా వీడియో రికార్డింగ్‌ను ప్రసారం చేయడానికి అనుమతి లేదు.

అప్రమత్తంగా ఉండండి

రోడ్డుపై వెళ్తున్నారంటే మిమ్మల్ని మరియు ఇతరులను సురక్షితంగా ఉంచడంలో మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. అంటే, మీ దృష్టి రోడ్డుపైనే ఉంచి, అప్రమత్తంగా ఉంటూ, తక్షణ చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఏవైనా ఉంటే గమనించాలి. అసురక్షిత డ్రైవింగ్ ప్రవర్తనకు సంబంధించిన రిపోర్ట్‌లను మేము సమీక్షిస్తాము.

సరైన నిర్వహణ మరియు సంరక్షణ

పరిశ్రమ భద్రత మరియు నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా డ్రైవర్లు తమ వాహనాలలో బ్రేక్‌లు, సీట్ బెల్ట్‌లు మరియు టైర్‌లు బాగా పని చేసేలా చూసుకుంటూ ఉండాలని, అలాగే వాహన తయారీదారు ఉపసంహరించిన భాగాలు ఏవైనా ఉన్నాయేమో పర్యవేక్షించి, వాటిని మరమ్మతు చేయాలని ఆశిస్తున్నాము.

దారి షేర్ చేయండి

ప్రయాణీకులు ఏ విధంగా ప్రయాణిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా వారందరినీ జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లేటటువంటి సురక్షితమైన ప్రవర్తనను అలవరుచుకున్నప్పుడు రహదారులు సురక్షితంగా ఉంటాయి.

  • వాహనంతో బయల్దేరే ప్రతిసారి మీ భుజం వైపు నుండి చూస్తూ సైకిళ్లు, స్కూటర్‌లపై వెళ్లేవారు, కార్లలో వెళ్లేవారు, పాదచారులు ఎవరైనా వస్తున్నారేమో గమనిస్తుండండి.

  • బైక్‌లపై, స్కూటర్‌లపై వెళ్లే ఇతరులను, నడిచి వెళ్లే వారిని గమనించుకుంటూ, మీరు వెళ్లే దారి ఎలా ఉన్నది చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్లండి.

ప్రజా అత్యవసర పరిస్థితులు

ప్రకృతి వైపరీత్యాలు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రజా సంక్షోభ పరిస్థితుల్లోనే కాకుండా, ప్రజా అత్యవసర సమయాల్లో కూడా మా ప్లాట్‌ఫామ్ భద్రతను కాపాడటం కోసం Uber అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఉదాహరణకు, Uber ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న ఎవరైనా వ్యక్తి ప్రజలకు ప్రమాదకారి కావచ్చని ప్రజారోగ్య సంరక్షణ శాఖ నుండి Uberకు నోటీసు అందినట్లయితే, ఆ వ్యక్తి ఖాతాను సహేతుక పద్ధతిలో సురక్షితం అని తేలే దాకా నిరీక్షణలో ఉంచుతాము. అదే విధంగా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం లేదా ఇతర ప్రజా సంక్షోభ పరిస్థితి లేదా Uber ప్లాట్‌ఫామ్ నిరంతరాయంగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ప్రమాదం సంభవించగలదని గుర్తించే సందర్భాలలో అధికారుల మార్గదర్శకత్వానికి అనుగుణంగా ఒక మొత్తం నగరం లేదా ప్రాంతంలోని వ్యక్తులు Uber ప్లాట్‌ఫామ్‌లో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని ఉపయోగించకుండా మేము నిలువరించే అవకాశం ఉంది.

మరిన్ని కమ్యూనిటీ మార్గదర్శకాలను చూడండి

ప్రతి ఒక్కరినీ గౌరవించండి

చట్టాన్ని అనుసరించండి

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو