Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చట్టాన్ని అనుసరించండి

ఈ విభాగంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన చట్టాలు మరియు నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు, ఏదైనా నేరానికి పాల్పడటం లేదా ఏదైనా ఇతర చట్టాన్ని ఉల్లంఘించడానికి Uber యాప్‌లను ఉపయోగించడం నిషిద్ధం.

కారు సీట్‌లు

శిశువులు మరియు చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు మరియు రైడర్‌లు స్థానిక చట్టాలకు లోబడి ఉండాలి. పిల్లలతో ప్రయాణించేటప్పుడు, వారికి తగిన కారు సీటును అందించే మరియు అమర్చే బాధ్యత ఖాతాదారుపై'ఉంటుంది. 12 ఏళ్లు మరియు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించాలి.

 • చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు, కారులో సీటును ఏర్పాటు చేయడం మీ బాధ్యత. కారు సీట్లు అవసరమయ్యే పిల్లలను తప్పకుండా రైడ్ మొత్తం వాటిలోనే స్ట్రాప్‌లతో సురక్షితంగా కూర్చోబెట్టాలి, ఒడిలో కూర్చోబెట్టుకోకూడదు. అన్ని కారు సీట్లు అన్ని కార్లలో సరిపోవు, కాబట్టి మీ దగ్గర తగిన కారు సీటు లేకపోయినా లేదంటే డ్రైవర్లు తమ కారులో మీరు ఒక సీటును ఇన్‌స్టాల్ చేయడం సౌకర్యవంతంగా భావించకపోయినా వారు రైడ్‌ను తిరస్కరించవచ్చు.

 • చిన్న పిల్లలతో ప్రయాణం చేసే రైడర్‌లను పికప్ చేసుకునే సమయాలలో, డ్రైవింగ్ స్టార్ట్ చేయడానికి ముందు వారు కారు సీటు జరుపుకుని, సౌకర్యంగా కూర్చునే దాకా వేచి ఉండాలి. వారికి తగిన విధంగా కారు సీటు అడ్జెస్ట్ చేసుకోలేదంటే లేదా రైడర్ మీ కారులో సీటును తగిన విధంగా జరుపుకోవడం మీకు అసౌకర్యంగా ఉంటే, మీరు రైడ్‌ను రద్దు చేయవచ్చు. దీని ఆధారంగా ట్రిప్‌లను తిరస్కరించినా లేదా రద్దు చేసినా, అది మీ డ్రైవర్ రేటింగ్‌లపై ప్రభావం చూపదని గుర్తుంచుకోండి.

అన్ని చట్టాలను అనుసరించండి

Uber యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, విమానాశ్రయంలో ఉండే సమయంలో విమానాశ్రయ నియమాలు మరియు నిబంధనలతో సహా అన్ని సంబంధిత స్థానిక చట్టాలు, అలాగే వేగం మరియు ట్రాఫిక్ చట్టాలతో సహా రోడ్డు నియమాలను అన్ని వేళలా తెలుసుకుని ఉండటం మరియు పాటించడం మీ బాధ్యత.

 • అన్ని సంబంధిత లైసెన్స్‌లు, అనుమతులు మరియు డ్రైవర్లకు సంబంధించి అవసరమయ్యే ఏవైనా ఇతర చట్టపరమైన పత్రాలను తప్పక ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు, చట్టప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్, బీమా మరియు వాహన రిజిస్ట్రేషన్‌‌ను డ్రైవర్‌లందరూ కలిగి ఉండాలి. రైడ్ షేరింగ్‌కు సంబంధించి, మీ ప్రాంతంలో రైడ్ షేర్ చేసే లేదా బాడుగకు వచ్చే డ్రైవర్‌లకు సంబంధించి వర్తించే నియంత్రణ ఆవశ్యకాలకు లోబడి ఉండటం వంటివి ఇందులో ఉంటాయి.

  ట్రిప్ సమయంలో సంభవించే ఏవైనా ప్రమాదాలు మరియు ట్రాఫిక్ ఉల్లంఘనల నివేదికలను మేము సమీక్షిస్తాము. రైడర్‌లు రావడం కోసం మీరు వేచి ఉండే సమయంలో మీ వాహనాన్ని పార్క్ చేసి ఉంచగల ప్రదేశాలపై స్థానిక పార్కింగ్ నియమాల ప్రకారం పరిమితులు ఉండవచ్చు. ఉదాహరణకు, బైక్ లేన్‌లలో ఆపటం లేదా యాక్సెసిబిలిటీ ర్యాంప్‌లను బ్లాక్ చేయడం వంటివి చట్ట ఉల్లంఘన కావచ్చు.

 • ప్రతి ఒక్కరి భద్రత దృష్ట్యా, మీ డ్రైవర్‌ను డ్రైవ్ చేయనివ్వండి. ఉదాహరణకు, స్టీరింగ్ వీల్‌ను తాకకండి, గేర్ షిఫ్ట్ లేదా ఇతర నాబ్‌లు, బటన్‌లు లేదా వాహనం నడపడానికి ఉపయోగించే ఇతర భాగాలను ట్యాంపర్ చేయకండి. 'వేగంగా వెళ్లమని, చట్టవిరుద్ధ ప్రదేశాలలో ఆపమని, డ్రాప్ఆఫ్‌లు చేయమని లేదా విన్యాసాలు చేయమని డ్రైవర్‌ను అడగకండి.

 • బైక్ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు లేదా పార్క్ చేస్తున్నప్పుడు, స్థానిక నిబంధనలు మరియు నియమాలను గుర్తుంచుకోండి; వర్తించే చట్టాల గురించి తెలుసుకోవడానికి మీరు మీ నగర ప్రభుత్వ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. స్థానిక రోడ్డు నియమాలను అనుసరించడం అంటే సాధారణంగా పాదచారులకు దారి ఇవ్వడం, ట్రాఫిక్ డైరెక్షన్‌లో నడపడం, డైరెక్షన్ మార్చాలనుకున్నప్పుడు సిగ్నల్ ఇవ్వడం మరియు రెడ్ లైట్ పడినప్పుడు, స్టాప్ సంకేతాలు ఉన్నప్పుడు పూర్తిగా ఆపడం వంటివి ఉంటాయి.

సేవలు అందించే పెంపుడు జంతువులు

సేవా జంతువు ఉన్న ఎవరికైనా డ్రైవర్లు తప్పనిసరిగా రైడ్‌లు అందించాలని స్థానిక చట్టాలు కోరుతున్నాయి. వారి సేవ జంతువు కారణంగా ఒక రైడర్‌ను తెలిసి తిరస్కరించడం వలన డ్రైవర్‌కు అలెర్జీలు, మతపరమైన అభ్యంతరాలు లేదా జంతువుల భయం ఉన్నప్పటికీ Uber అనువర్తనాలకు ప్రాప్యత కోల్పోతారు.

 • ఒక రైడర్ ఒక సేవా జంతువుతో ప్రయాణిస్తున్నందున మీరు యాత్రను తిరస్కరించలేరు.

 • మీతో పాటు మీకు సేవలు అందించే జంతువు కూడా ఉన్న కారణంగా మీ డ్రైవర్ మిమ్మల్ని తీసుకెళ్లడానికి నిరాకరించలేరు. మీ వద్ద ఉన్న జంతువు సేవా జంతువు కాకపోతే, మీ డ్రైవర్‌ను సంప్రదించి, మీతో పెంపుడు జంతువు ఉన్న సంగతి వారికి తెలియజేయడం మంచి పద్ధతి. పెంపుడు జంతువులను రవాణా చేయాలా వద్దా అనేది డ్రైవర్‌లు నిర్ణయించుకోవచ్చు.

మాదక ద్రవ్యాలు మరియు మద్యం

Uber యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు డ్రగ్స్ వాడకం, ఆల్కాహాల్ కంటైనర్‌లను తెరవడం ఎప్పుడూ అనుమతించబడవు.

 • కారు‌లో చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు తీసుకురావడం గానీ లేదా ఆల్కాహాల్ కంటైనర్‌లను తెరవడం గానీ ఎప్పుడూ చేయకూడదు. మీ డ్రైవర్ డ్రగ్స్ లేదా ఆల్కాహాల్ సేవించి ఉన్నారని మీకు గట్టి అనుమానం కలిగితే, ట్రిప్‌ను వెంటనే ముగించమని డ్రైవర్‌ను కోరండి. ఆపై కారు నుండి బయటికి దిగిపోయి, మీ స్థానిక అధికారులకు లేదా అత్యవసర సేవలకు కాల్ చేయండి. అలాగే వాహనం నుండి దిగిన తర్వాత, దయచేసి మీ అనుభవాన్ని Uberకు కూడా రిపోర్ట్ చేయండి.

 • చట్టప్రకారం, మీరు మత్తులో ఉన్నప్పుడు డ్రైవ్ చేయకూడదు. మద్యం, మాదకద్రవ్యాలు లేదా వాహనాన్ని సురక్షితంగా నడపగల మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా ఇతర పదార్థాన్ని తీసుకున్నప్పుడు డ్రైవ్ చేయడం చట్టప్రకారం నిషిద్ధం. ఎక్కువగా మద్యం సేవించిన వ్యక్తి లేదా రౌడీ అయిన రైడర్ మీకు ఎదురైతే, మీ స్వంత భద్రత దృష్ట్యా ట్రిప్‌ను తిరస్కరించడానికి మీకు హక్కు ఉంది. రైడర్‌లు ట్రిప్‌లో తెరిచి ఉన్న మద్యం కంటైనర్‌లను తీసుకుని రాకూడదు లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉండకూడదు. ఎక్కువగా మద్యం సేవించిన వ్యక్తి లేదా రౌడీ అయిన రైడర్ మీకు ఎదురైతే, మీ స్వంత భద్రత దృష్ట్యా ట్రిప్‌ను తిరస్కరించడానికి మీకు హక్కు ఉంది.

 • ఆల్కాహాల్, డ్రగ్స్ తీసుకున్నప్పుడు లేదా బైక్, స్కూటర్ సురక్షితంగా నడిపే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఇతరత్రా మత్త పదార్థులు తీసుకుని ఉండే సందర్భాలలో ఎన్నడూ డ్రైవింగ్ చేయకండి.

తుపాకులు మరియు ఆయుధాలు

రైడర్‌లు మరియు వారి అతిథులు, అలాగే డ్రైవర్లు Uber యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, వర్తించే చట్టం ప్రకారం అనుమతి ఉన్న పరిధి మేరకు ఏ రకమైన తుపాకులు లేదా ఆయుధాలను తీసుకెళ్లడం నిషిద్ధం.

మోసం

మోసానికి పాల్పడితే, నమ్మకం బలహీనపడవచ్చు, అది చాలా ప్రమాదకరం కూడా. ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని తప్పుగా కల్పించి చెప్పడం లేదా సైన్ ఇన్ చేస్తున్నప్పుడు లేదా భద్రతా తనిఖీ జరుగుతున్నప్పుడు వేరొకరి' గుర్తింపును ఉపయోగించడం వంటి వాటికి అనుమతి లేదు.

సంఘటనలను నివేదించేటప్పుడు, మీ Uber ఖాతాలను సృష్టించేటప్పుడు మరియు యాక్సెస్ చేసేటప్పుడు, ఛార్జీలు లేదా ఫీజు వివాదాలలో మరియు క్రెడిట్‌లను అభ్యర్థించేటప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి. మీకు రావాల్సిన ఫీజు లేదా రీఫండ్‌లను మాత్రమే అభ్యర్థించండి, ఆఫర్‌లు మరియు ప్రోమోలను ఉద్దేశించిన విధంగా మాత్రమే ఉపయోగించండి. చెల్లని లావాదేవీలను తెలిసి పూర్తి చేయవద్దు.

బుక్ చేయనివారిని మధ్యలో ఎక్కించుకోవడం

ప్రతి అనుభవంలో భద్రతను మెరుగుపరచడానికి, యాప్‌లో కాకుండా బయట పికప్‌లు నిషిద్ధం. Uber యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, బుక్ చేయనివారిని మధ్యలో ఆపి ఎక్కించుకోవడం చట్టప్రకారం నిషిద్ధం, కాబట్టి Uber సిస్టమ్‌లో కాకుండా వెలుపల చెల్లింపును ఎప్పుడూ అభ్యర్థించకండి లేదా అంగీకరించకండి. రైడర్ Uber ఏర్పాటు చేసిన చెల్లింపు ఎంపికను ఉపయోగిస్తుంటే మినహా డ్రైవర్‌లు ఎన్నడూ Uber సిస్టమ్‌లో కాకుండా వెలుపల చెల్లింపును అభ్యర్థించకూడదు లేదా అంగీకరించకూడదు.

ఇతర ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలు

అనుమతి లేకుండా Uber వ్యాపార చిహ్నం లేదా మేధోసంపత్తిని ఉపయోగించడం వంటి పనులు చేసి, వ్యాపారం లేదా బ్రాండ్‌కు ఎప్పుడూ హాని కలిగించకండి.

చట్టవిరుద్ధమైన, వివక్షాపూరితమైన, ద్వేషపూరితమైన లేదా లైంగికంగా అసభ్యకరమైన కార్యకలాపాలలో భాగంగా Uber యాప్‌లలో రైడ్‌లు, బైక్‌లు లేదా స్కూటర్ ట్రిప్‌లు, రవాణా లేదా ఇతర కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి మరియు వాటికి చెల్లింపు చేయడానికి లేదా వాటి వినియోగం గురించి ప్రచారం చేయడానికి Uber ఖాతా దేన్నీ ఉపయోగించకూడదు.

 • డ్రైవర్‌లు Uber నుండి పొందిన Uber బ్రాండ్ వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. లైట్‌లు, ప్లకార్డులు, సైన్ బోర్డ్‌లు లేదా Uber పేరు లేదా వ్యాపార చిహ్నాన్ని కలిగి ఉన్న ఇటువంటి వస్తువులు మొదలైన అనధికార లేదా మూడవ పక్షం వస్తువులను ఉపయోగించడం వలన రైడర్‌లు గందరగోళానికి గురి కావచ్చు.

మరిన్ని కమ్యూనిటీ మార్గదర్శకాలను చూడండి

ప్రతి ఒక్కరినీ గౌరవించండి

ఒకరినొకరు సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو