Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అందరి పట్ల భద్రత మరియు గౌరవం

Uber' సంఘం మార్గదర్శకాలు  

 

ప్రతి అనుభవాన్ని సురక్షితంగా, గౌరవపూర్వకంగా మరియు సానుకూలంగా మార్చడంలో సహాయపడటానికి మా మార్గదర్శకాలను రూపొందించాము.

డ్రైవర్లు, రైడర్‌లు, డెలివరీ పార్టనర్‌లు, Uber Eats వినియోగదారులు, వ్యాపారులు మరియు ఏవైనా Uber ఉత్పత్తులను ఉపయోగించే వ్యాపారాలతో సహా మా యాప్‌లన్నింటిలో Uber ఖాతా కోసం సైన్ అప్ చేసుకునే ప్రతి ఒక్కరూ అధికార పరిధి ప్రకారం వర్తించే పరిధి మేరకు మార్గదర్శకాలను అనుసరించాలని ఆశిస్తున్నాము. గ్రీన్‌లైట్ హబ్‌లలో పని చేస్తున్న Uber ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్‌లతో ఆన్‌లైన్ సిస్టమ్‌ల ద్వారా లేదా ఫోన్ ద్వారా జరిగే పరస్పర చర్యలకు కూడా ఇవి వర్తిస్తాయి.

ప్రతి ఒక్కరినీ గౌరవించండి

The guidelines in this section help to foster positive interactions within our diverse community during every experience.

ఒకరినొకరు సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన అనుభవాలను సృష్టించడంలో సహాయపడటానికి మా బృందం ప్రతిరోజూ కృషి చేస్తోంది. అందుకోసమే ఈ ప్రమాణాలను రచించాము.

చట్టాన్ని అనుసరించండి

మేము చట్టాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉన్నాము. మా యాప్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అలాగే వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని మేము ఆశిస్తున్నాము.

మీ ఎంపికల సామర్ధ్యం

ప్రతిరోజు లక్షలాది మంది వ్యక్తులు Uberతో ఉన్నతమైన అనుభవాలను పొందుతున్నారు. ఈ సానుకూల వ్యవహార శైలి మనం ఎవరో తెలియజెప్పడంలో సహాయపడుతుంది. Uberను సురక్షితమైన, స్నేహపూర్వకమైన సంఘంగా తీర్చిదిద్దడంలో సహాయపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు.

మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తాము

ఏదైనా జరిగితే, అది మంచైనా లేదా చెడైనా, మీరు సులభంగా చెప్పుకోగలిగే సదుపాయం కల్పిస్తాము. మా బృందం నిరంతరం మా ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. అదేవిధంగా, మీ ఫీడ్‌బ్యాక్ కూడా మాకెంతో ముఖ్యం, అప్పుడే మేము తగిన చర్యలు తీసుకుని, అభివృద్ధి చెందుతున్న మా సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మా ప్రమాణాలను నిర్దేశించగలుగుతాము.

సహాయాన్ని కనుగొనడం ఎలా

మీరు సంఘటనను నివేదించాలనుకుంటే, మా యాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా కాల్ చేయవచ్చు లేదా help.uber.comని సందర్శించవచ్చు. మీరు తక్షణ ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే, Uber‌కు తెలియజేసే ముందు మీ స్థానిక అధికారులను అప్రమత్తం చేయండి.

రేటింగ్‌లు ఎలా పని చేస్తాయి

అధిక రేటింగ్ అనేది మీ పనితీరు చాలా గొప్పగా ఉన్నట్లు మీకు తెలియజేస్తుంది. మీ రేటింగ్ మీ నగరంలో సగటు కంటే తక్కువగా ఉంటే, ఎలా మెరుగుపరుచుకోవాలో మేము మీకు తెలియజేస్తాము. అలాగే మీ రేటింగ్ సగటు కంటే గణనీయ స్థాయిలో తక్కువగా ఉంటే, మీరు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా యాప్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు.

మా మార్గదర్శకాలు మీకు ఎలా వర్తిస్తాయి

మా సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉన్నట్లు మా సహాయ బృందానికి సమర్పించిన అన్ని నివేదికలను Uber సమీక్షిస్తుంది, అలాగే మేము ఒక ప్రత్యేక బృందం సహాయంతో దర్యాప్తు చేపట్టవచ్చు. మా సమీక్ష పూర్తయ్యే వరకు మీ ఖాతాను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచవచ్చు. మా మార్గదర్శకాలలో దేన్నైనా పాటించని పక్షంలో, మీ Uber ఖాతాలకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండవచ్చు.

ఈ పేజీని Uber సంఘం మార్గదర్శకాలను సంక్షిప్తంగా వివరించే వనరుగా అందించాము. మా సంఘం మార్గదర్శకాలను వివరంగా చదవడానికి, ఇక్కడికివెళ్లండి. రైడర్‌లు వారి వినియోగ నిబంధనలను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు. డ్రైవర్‌లు Uber‌తో కుదుర్చుకున్న వారి చట్టపరమైన ఒప్పందాన్ని ఇక్కడ పొందవచ్చు.

మా సంఘం ప్రమాణాలలో దేన్నైనా పాటించకపోతే మీ Uber ఖాతాలకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండవచ్చు. మీరు యాప్ వెలుపల చేసే నిర్దిష్ట చర్యల వలన Uber సంఘం భద్రతకు ముప్పు కలుగుతుందని లేదా Uber బ్రాండ్, ప్రతిష్ట లేదా వ్యాపారానికి హాని జరుగుతుందని మేము కనుగొంటే, ఇందులో వాటిని కూడా పరిగణించవచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو