Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భద్రత పట్ల మా నిబద్ధత

మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు కోరుకున్న సమయాలలో పని చేస్తూ, మీ సమయాన్ని తగిన విధంగా ఉపయోగించుకుంటూ సంపాదించుకోవడంతోపాటు మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మరియు ప్రదేశాలకు మిమ్మల్ని దూరం కానివ్వకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకే భద్రతకు భంగం కలిగించే చర్యలను తగ్గించే క్రమంలో భాగంగా, కొత్త ప్రమాణాలను రూపొందించడం నుండి సాంకేతికతకు సంబంధించిన అభివృద్ధి వరకు, అన్నింటిలోనూ భద్రతకు కట్టుబడి ఉంటాము.

COVID-19 సమయంలో పరస్పరం సురక్షితంగా ఉండడంలో సహాయపడుతుంది.

కరోనా వైరస్ (COVID-19) వల్ల ఏర్పడిన పరిస్థితిని మేము చురుకుగా పర్యవేక్షిస్తూ, మా ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన వారిని ఆరోగ్యంగానూ మరియు సురక్షితంగానూ ఉంచడంలో సహాయపడటానికి నిరంతరం కృషి చేస్తున్నాము.

 • మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం

  మా సంఘాలు మళ్లీ సేవలు అందించడం ప్రారంభిస్తున్నందున, Uberతో రైడ్ చేసేటప్పుడు మీకు సురక్షిత భావన కలగాలని మేము కోరుకుంటున్నాము. అందుకుగానూ మేము మా కొత్త డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణాన్ని పరిచయం చేస్తున్నాము. Uber వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భద్రతను కల్పించడం, ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడం, ఆరోగ్య నిపుణుల నుండి మార్గదర్శకాలను అందించడం‌ వంటి వాటితో కూడిన ఈ కొత్త ప్రమాణాలు మా ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మరియు భద్రతను అందించేలా రూపొందించాము.

 • మనమందరం చేయవలసినవి

  రైడర్‌లు మరియు డ్రైవర్‌లు అందరూ టీకా వేయించుకున్నప్పటికీ Uberను ఉపయోగించేటప్పుడు ఫేస్ కవర్ లేదా మాస్క్‌ని తప్పనిసరిగా ధరించాలి.

 • ఫేస్ కవర్ తనిఖీ

  డ్రైవింగ్ ప్రారంభించే ముందు డ్రైవర్‌లు తమను తాము ఫోటో తీసుకోవాలని మేము కోరుతాము, ఆపై మా టెక్నాలజీ సహాయంతో వారు ఫేస్ కవర్ ధరించి ఉన్నారో లేదో ధృవీకరించుకుంటాము.

 • డ్రైవర్‌ల కోసం ఆరోగ్య మరియు భద్రతా సామాగ్రి

  ఆహారాన్ని సురక్షితంగా డెలివరీ చేసేందుకు డెలివరీ వ్యక్తులకు మరియు డ్రైవర్‌లకు ఫేస్ కవర్‌లు, క్రిమిసంహారకాలు మరియు గ్లోవ్స్ వంటి ఆరోగ్య రక్షణ సామాగ్రిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము.

 • నిపుణుల నేతృత్వ మార్గదర్శకత్వం

  భద్రతా చిట్కాలు మరియు వనరుల గురించి తెలియజేయడానికి మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి పని చేస్తున్నాము.

 • రైడ్ రక్షణ అభిప్రాయం

  మీరు ఇప్పుడు డ్రైవర్ ఫేస్ కవర్ లేదా మాస్క్‌ని ధరించకపోవడం లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరు. ఇది మమ్మల్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది, అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండేలా చేస్తుంది.

1/6

మేము కల్పించే భద్రతను మీరు ఎలా పొందవచ్చు

యాప్‌లోని భద్రతా ఫీచర్‌లు

మీ ట్రిప్ వివరాలను మీకు ఇష్టమైన వారితో షేర్ చేసుకోండి. మీ రైడ్ సమయంలో మీ ట్రిప్‌ను ట్రాక్ చేయండి. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మా సాంకేతిక పరిజ్ఞానం మీకు సహాయపడుతుంది.

విస్తృత సంఘం

మిలియన్ల కొద్దీ ఉన్న రైడర్‌లు, డ్రైవర్‌లు ఉభయతారకమైన సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి సరైన రీతిలో వ్యవహరిస్తూ పరస్పర బాధ్యతను కలిగి ఉంటారు.

ప్రతి సందర్భంలోనూ మద్దతివ్వండి

ప్రత్యేకించి శిక్షణ పొందిన బృందం 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. భద్రతకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు కలిగినట్లయితే, పగలైనా లేదా రాత్రి అయినా యాప్‌లో వారిని సంప్రదించండి.

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రయాణాలను కల్పించడం

డ్రైవర్ భద్రత

భద్రతకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు కలిగినట్లయితే, సహాయం కోసం మా 24/7 మద్దతు విభాగాన్ని సంప్రదించండి. నచ్చిన వారితో మీ ట్రిప్‌ను షేర్ చేసుకోండి. మేము మీ భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటాము, కాబట్టి అవకాశం ఉన్న ఎక్కడికైనా మీరు వెళ్లవచ్చు.

రైడర్ భద్రత

ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ రైడ్‌లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాప్‌లో అందించిన భద్రతా ఫీచర్‌లకు ప్రతీ రైడర్‌ యాక్సెస్ ఉంటుంది. అలాగే మీకు అవసరమైతే, ఒక్కో రైడ్‌కు ఒక్కో మద్దతు బృందం ఉంటుంది.

“ప్రతి రోజూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని మిలియన్ల కొద్దీ వ్యక్తులు మా సాంకేతికతను ఉపయోగించి కార్లలో ప్రయాణిస్తున్నారు. వ్యక్తులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం అతిపెద్ద బాధ్యత, దాన్ని మేము అంత తేలికగా తీసుకోము.”

డారా ఖోస్రోషాహి, Uber CEO

వైవిధ్యాన్ని చూపేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాము

భద్రత పట్ల మా నిబద్ధత మీ రైడ్‌కే పరిమితం కాకుండా అనేక అంశాల ఆధారితంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణాలు, అలాగే నగరాలు అందరికీ సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో సహాయపడేందుకు, మేము ప్రజా భద్రతకు సంబంధించిన అధికారుల నుండి హింసా వ్యతిరేక సంస్థల దాకా ఉన్న ప్రముఖ నిపుణులతో కూడిన బృందంతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాము.

డ్రైవర్ భద్రత

మీకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైన చోట ఆత్మవిశ్వాసంతో డ్రైవ్ చేయండి.

రైడర్ భద్రత

ఎప్పుడైనా బయలుదేరి, సౌకర్యవంతంగా చేరుకోండి.

నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు ప్రాంతం ఆధారంగా మారడంతో పాటు అందుబాటులో ఉండకపోవచ్చు.

For all offers from our partners, drivers must have been cleared to drive with Uber and be active on the platform. Prices and discounts are subject to change or withdrawal at any time and without notice, and may be subject to other restrictions set by the partner. Please visit the partner’s website for a full description of the terms and conditions applicable to your rental, vehicle purchase, product, or service, including whether taxes, gas, and other applicable fees are included or excluded. Uber is not responsible for the products or services offered by other companies, or for the terms and conditions (including financial terms) under which those products and services are offered.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو