భద్రత పట్ల మా నిబద్ధత
మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు కోరుకున్న సమయాలలో పని చేస్తూ, మీ సమయాన్ని తగిన విధంగా ఉపయోగించుకుంటూ సంపాదించుకోవడంతోపాటు మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు మరియు ప్రదేశాలకు మిమ్మల్ని దూరం కానివ్వకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకే భద్రతకు భంగం కలిగించే చర్యలను తగ్గించే క్రమంలో భాగంగా, కొత్త ప్రమాణాలను రూపొందించడం నుండి సాంకేతికతకు సంబంధించిన అభివృద్ధి వరకు, అన్నింటిలోనూ భద్రతకు కట్టుబడి ఉంటాము.
మేము కల్పించే భద్రతను మీరు ఎలా పొందవచ్చు
యాప్‌లోని భద్రతా ఫీచర్లు
మీ ట్రిప్ వివరాలను మీకు ఇష్టమైన వారితో షేర్ చేసుకోండి. మీ రైడ్ సమయంలో మీ ట్రిప్‌ను ట్రాక్ చేయండి. మీరు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటానికి మా సాంకేతిక పరిజ్ఞానం మీకు సహాయపడుతుంది.
విస్తృత సంఘం
మిలియన్ల కొద్దీ ఉన్న రైడర్లు, డ్రైవర్లు ఉభయతారకమైన సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి సరైన రీతిలో వ్యవహరిస్తూ పరస్పర బాధ్యతను కలిగి ఉంటారు.
ప్రతి సందర్భంలోనూ మద్దతివ్వండి
ప్రత్యేకించి శిక్షణ పొందిన బృందం 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. భద్రతకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు కలిగినట్లయితే, పగలైనా లేదా రాత్రి అయినా యాప్‌లో వారిని సంప్రదించండి.
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రయాణాలను కల్పించడం
డ్రైవర్ భద్రత
భద్రతకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు కలిగినట్లయితే, సహాయం కోసం మా 24/7 మద్దతు విభాగాన్ని సంప్ రదించండి. నచ్చిన వారితో మీ ట్రిప్‌ను షేర్ చేసుకోండి. మేము మీ భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటాము, కాబట్టి అవకాశం ఉన్న ఎక్కడికైనా మీరు వెళ్లవచ్చు.
రైడర్ భద్రత
ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ రైడ్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. యాప్‌లో అందించిన భద్రతా ఫీచర్లకు ప్రతీ రైడర్ యాక్సెస్ ఉంటుంది. అలాగే మీకు అవసరమైతే, ఒక్కో రైడ్‌కు ఒక్కో మద్దతు బృందం ఉంటుంది.
“ప్రతి రోజూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని మిలియన్ల కొద్దీ వ్యక్తులు మా సాంకేతికతను ఉపయోగించి కార్లలో ప్రయాణిస్తున్నారు. వ్యక్తులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటం అతిపెద్ద బాధ్యత, దాన్ని మేము అంత తేలికగా తీసుకోము.”
డారా ఖోస్రోషాహి, Uber CEO
వైవిధ్యాన్ని చూపేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాము
భద్రత పట్ల మా నిబద్ధత మీ రైడ్‌కే పరిమితం కాకుండా అనేక అంశాల ఆధారితంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణాలు, అలాగే నగరాలు అందరికీ సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో సహాయపడేందుకు, మేము ప్రజా భద్రతకు సంబంధించిన అధికారుల నుండి హింసా వ్యతిరేక సంస్థల దాకా ఉన్న ప్రముఖ నిపుణులతో కూడిన బృందంతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాము.
*నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్లు ప్రాంతం ఆధారంగా భిన్నంగా ఉంటాయి, అలాగే అవి అందుబాటులో ఉండకపోవచ్చు.