ట్యూషన్ లేకుండా ఉన్నత విద్య
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు
80కి పైగా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల నుండి ఎంచుకోండి.
ఆంగ్ల భాషా కోర్సులు
మీ చదవడం, రాయడం, వినడం మరియు మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్
విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా నిర్మించాలో తెలుసుకోండి.
ASU ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న డ్రైవర్లను కలుసుకోండి
"నేను ప్రారంభించిన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఇది నా అవకాశం."
—పాల్, డ్రైవర్, బోస్టన్
యుఎస్ లో సైకాలజీని అధ్యయనం చేయాలనే కలలతో పాల్ కెన్యాను వదిలివేళ్లాడు. తన కుటుంబ పోషణ కోసం పాఠశాల విద్యను మానేసిన అతడికి ఎప్పుడైనా తిరిగి పూర్తి చేసే అవకాశం వస్తుందో లేదో అతనికి తెలియదు. ఇప్పుడు అతను సైకాలజీ చదువుతున్నాడు.
"నేను కలలుగన్న ఈ డిగ్రీని నేను నిజంగా పొందగలను."
—ఎమిలీ, డ్రైవర్, డెన్వర్
ఎమిలీ రెండవ తరగతి ఉపాధ్యాయుడు, అతను టెక్ పరిశ్రమలో ఉపాధి పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ రంగంలోకి ప్రవేశించడానికి ఆమెకు డిగ్రీ పొందడానికి ఒక మార్గం అవసరం. ఇప్పుడు ఆమె UX డిజైన్ చదువుతోంది.
"నా భార్యకు కళాశాల విద్యను అందించగలనని తెలియగానే, నేను నమ్మలేకపోయాను."
—డారీ, డ్రైవర్, ఫీనిక్స్
షానన్ కాలేజీ చదువు పూర్తి చేయడానికి ఎప్పుడూ అవకాశం రాలేదు. ఆమె భర్త, డారిన్, డ్రైవర్, ట్యూషన్ కవరేజీకి అర్హత సాధించినప్పుడు, అతను దానిని వెంటనే ఆమెకు నేర్పించాడు. ఇప్పుడు ఆమె డిగ్రీ చదువుతోంది.
కుటుంబ సభ్యులకు స్వాగతం
మీరు ఈ అవకాశాన్ని మీ కోసం ఉపయోగించుకోవచ్చు లేదా అర్హతగల జీవిత భాగస్వామి లేదా డొమెస్టిక్ పార్ట్నర్, పిల్లలు, తోబుట్టువు, తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకుడు లేదా ఆధారపడిన వారికి పంపవచ్చు.
ఎలా అర్హత సాదించాలి
మీరు 3,000 ట్రిప్‌లు పూర్తి చేసి Uber Plus గోల్డ్, డైమండ్ లేదా ప్లాటినం స్టేటస్‌కి చేరుకున్నప్పుడు ఈ అవకాశాన్ని/ఆపర్చునిటీని అన్‌లాక్ చేయండి.
రహదారి మీదే
తరచుగా అడిగే ప్రశ్నలు
- ASU ఆన్లైన్లో పూర్తి ట్యూషన్ కవరేజీకి ఎవరు అర్హులు?
US లోని Uber Plus ప్రోగ్రామ్ ద్వారా గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్ సంపాదించిన మరియు 3,000 లేదా అంతకంటే ఎక్కువ జీవితకాల ట్రిప్‌లను పూర్తి చేసిన డ్రైవర్లు అరిజోనా స్టేట్ యూనివర్శిటీ(ASU) లో ఆన్లైన్ కోర్సులకు పూర్తి ట్యూషన్ కవరేజీకి అర్హులు.
ఈ రివార్డ్‌కు అర్హత కలిగి ఉండేేటటువంటి జీవిత భాగస్వామి లేదా డొమెస్టిక్ పార్ట్నర్, పిల్లలు లేదా ఆధారపడిన వారు, తోబుట్టువులు లేదా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులతో సహా అర్హులైన కుటుంబ సభ్యులకు బదిలీ చేసే ఎంపికను మీరు కలిగి ఉంటారు.
- నా కుటుంబ సభ్యుడు ASU ఆన్లైన్లో పూర్తి ట్యూషన్ కవరేజీకి అర్హులా?
మీరు ఎక్కువగా శ్రద్ధ వహించే వ్యక్తులకు సహాయం చేయడానికి, వారి కలలను సాకారం చేయడానికి, అర్హతగల డ్రైవర్లు తమ రివార్డ్‌ను కుటుంబ సభ్యులకు బదిలీ చేయవచ్చు. ఆ కుటుంబ సభ్యునికి మీరు మరియు మీ కుటుంబం ఎటువంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వీరంతా కుటుంబ సభ్యుల కోవలోకి వస్తారు:
జీవిత భాగస్వామి లేదా డొమెస్టిక్ పార్ట్నర్
పిల్లలు
తోబుట్టువు
ఆధారపడిన వ్యక్తులు
తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులు
- ట్యూషన్ కవరేజ్ ఎలా పనిచేస్తుంది? ఇది విద్యార్థుల రుణమా లేదా తిరిగి చెల్లించాలా/రీయింబర్స్మెంట్?
ఇది విద్యార్థుల రుణం లేదా రీయింబర్స్మెంట్ కాదు; మీ ట్యూషన్ పూర్తిగా Uber ద్వారా కవర్ అవుతుంది.
పాఠ్యపుస్తకాలు మరియు ట్యూషన్ కవరేజ్ విలువపై వార్షిక పన్నులు వంటి అదనపు ఖర్చులకు అర్హతగల డ్రైవర్లు లేదా వారి అర్హతగల కుటుంబ సభ్యులు బాధ్యత వహిస్తారు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు పాల్గొనాలని నిర్ణయించుకున్న కోర్సులను బట్టి పన్ను మరియు పాఠ్యపుస్తక ఖర్చులు మారుతూ ఉంటాయి.
మీరు ASU ఆన్లైన్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ఎంచుకుంటే, ఎన్రోల్మెంట్ ప్రోసెస్‌లో మీరు ఫెడరల్ స్టూడెంట్ అసిస్టెన్స్ (FFSA) కోసం ఉచిత దరఖాస్తును పూర్తి చేయాలి. ఇది విద్యార్థుల రుణం లేదా తిరిగి చెల్లించే/రీయింబర్స్మెంట్ దరఖాస్తు కాదు—ఇది మీరు ఫెడరల్ గ్రాంట్ మరియు స్కాలర్షిప్కు అర్హులు పొందారా లేదా అని చూపించే ఒక అప్లికేషన్ మరియు ఇది ఉచిత బహుమతి సహాయంగా పరిగణించబడుతుంది మరియు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు FAFSAను పూర్తి చేసి, విద్యార్థుల రుణాలకు అర్హులుగా భావిస్తే, మీరు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సామగ్రి (అదనపు సెమిస్టర్‌కు $650) వంటి అదనపు ఫీజు చెల్లించడానికి వాటిని ఉపయోగించవచ్చు.
- ASU ఆన్లైన్ ద్వారా ఎలాంటి విద్య లభిస్తుంది?
అర్హతగల డ్రైవర్లు లేదా కుటుంబ సభ్యుడు వారి ట్యూషన్ కవరేజీలో 100% 2 రకాల విద్యా ఆఫర్లకు అందించవచ్చు:
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీపై క్రెడిట్లను సంపాదించండి
ASU ఆన్లైన్ ద్వారా అందించే 80కి పైగా పూర్తి గుర్తింపు పొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌లకు మీకు ప్రవేశానుమతి ఉంది. ఆన్లైన్లో పొందిన డిప్లొమా మరియు ట్రాన్స్క్రిప్ట్ క్యాంపస్‌లో పొందిన వాటికి సమానంగా ఉంటాయి— “అరిజోనా స్టేట్ యూనివర్శిటీ”. ఆన్లైన్ కోర్సులను అదే అవార్డు పొందిన ASU అధ్యాపకులు బోధిస్తారు.
మీరు మొదట ASU ఆన్లైన్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లోకి అడ్మిట్ కాకపోతే, అర్హతగల డ్రైవర్లు లేదా కుటుంబ సభ్యులకు ASU సంపాదించే అడ్మిషన్ ప్రోగ్రామ్‌కి ప్రవేశానుమతి ఉంది, భవిష్యత్తు విద్యార్థులకు ASUలో ప్రవేశం పొందటానికి సహాయపడే కోర్సుల సీరీస్ దీనిలో అందించబడతాయి.
ఆంగ్ల భాషలో విద్యా కోర్సులు కొనసాగించడం &/లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
డిగ్రీ కోరుకోనివారికి, ASU పూర్తిగా అర్హతగల డ్రైవర్లు లేదా కుటుంబ సభ్యుల కోసం 2 రకాల ఆన్లైన్ నిరంతర విద్యా కార్యక్రమాలను అందిస్తుంది. ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరచాలనుకునే వారి కోసం రూపొందించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ (ELL) కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మీ చదివే, వ్రాసే, మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. మీ నైపుణ్యాన్ని బట్టి ELL కోర్సులు 8 వేర్వేరు ఫ్లూయెన్సీ స్థాయిలలో అందించబడతాయి. ప్రతి కోర్సు పూర్తి కావడానికి సుమారు 8 వారాలు పడుతుంది. వ్యవస్థాపక నైపుణ్యాల ప్యాకేజీని/సెట్‌ను అభివృద్ధి చేయాలనుకునే వారికి, ASU 5-కోర్సు ప్రోగ్రామ్‌ను ప్రత్యేకించి Uber కోసం రూపొందించింది, ఇది మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను మీకు నేర్పుతుంది.
- నా Uber Plus గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్‌ని కోల్పోతే ఏమి జరుగుతుంది? నేను లేదా నా కుటుంబ సభ్యుడు ట్యూషన్ కవరేజీని కోల్పోతామా?
మీరు గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్‌ని కొనసాగించినంత వరకు మీరు ట్యూషన్ కవరేజీకి అర్హులు. మీ Uber Plus స్టేటస్ 'బ్లూ'కి మారితే, మీకు 3 నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీరు గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్‌ని అభ్యర్థించడం ద్వారా ట్యూషన్ కవరేజీకి అర్హతను తిరిగి పొందవచ్చు. క్లాస్ టర్మ్ యందు మీ అర్హత ముగిసినప్పటికీ, మీరు అర్హత సాధించినప్పుడు ప్రారంభించిన అన్ని కోర్సులకు ట్యూషన్ కవర్ అవుతుంది.
- Uber Plus అంటే ఏమిటి?
Uber Plus అనేది డ్రైవర్లకు అందించే కొత్త రివార్డ్ ప్రోగ్రామ్, ఇది మీ రైడ్ల లక్ష్యాలను, అదే విధంగా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ట్రిప్‌లకు వెళ్తూ, రైడర్లకు మంచి సర్వీస్‌లను అందించినప్పుడు, మీరు మీ Uber Plus స్టేటస్‌కి చేరుకొనే పాయింట్లను సంపాదిస్తారు. మీరు ఉన్నత స్టేటస్‌కి చేరుకున్నప్పుడు, ASU ఆన్లైన్లో 100% ట్యూషన్ కవరేజ్ వంటి కొత్త రివార్డ్‌లను అన్‌లాక్ చేయడానికి మీకు అవకాశం ఉంది.
- ఎన్రోల్మెంట్ ప్రాసెస్, కోర్సు ఆఫర్లు మరియు మరిన్నింటి గురించి నేను ఎలా తెలుసుకోవాలి?
మీ ట్యూషన్ కవరేజ్, ఎన్రోల్మెంట్ ప్రాసెస్, కోర్సు ఆఫర్లు మరియు మరిన్నింటి గురించి మరింత తెలుసుకోవడానికి మీరుASU వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించడానికి మీకు ఆసక్తి ఉంటే, మీరు ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ప్రత్యేక ఎన్రోల్మెంట్ కోచ్‌తో మాట్లాడటానికి మీరు 844-369-6587లో నేరుగా ASUకి కాల్ చేయవచ్చు. ప్రారంభించడానికి దయచేసి Uber ద్వారా మీ ట్యూషన్ కవరేజీని పేర్కొనండి.
షరతులు మరియు నిబంధనలు వర్తిస్తాయి
హక్కు వదలుకోవటం/నిరాకరణ: 100% ట్యూషన్ కవరేజ్ పొందడానికి, మీరు Uber Plus గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్ స్టేటస్‌ను కలిగి ఉండాలి మరియు 3,000 ట్రిప్‌లను పూర్తి చేయాలి. అర్హతగల కుటుంబ సభ్యులు మాత్రమే. పన్నులు, టెక్ట్స్ పుస్తకాలు మరియు సాంకేతికత పట్ల విద్యార్థులు బాధ్యత వహించాలి. నిబంధనలు, షరతులు మరియు ఇతర పరిమితులు వర్తిస్తాయి.
కంపెనీ