Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆత్మవిశ్వాసంతో డ్రైవ్ చేయండి

ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లేందుకు మీరు అర్హత పొందారు. మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్న వారిని రక్షించడంలో సహాయపడే రహదారి మరియు సాంకేతికతకు సంబంధించిన సహాయాన్ని పొందండి.

మా డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం

Uber వినూత్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భద్రతను కల్పించడం, ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడం, ఆరోగ్య నిపుణుల నుండి మార్గదర్శకాలను అందించడం‌ వంటి వాటితో కూడిన ఈ కొత్త ప్రమాణాలు మా ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మరియు భద్రతను అందించేలా రూపొందించాము.

 • మా డోర్-టు-డోర్ భద్రతా ప్రమాణం

  మీ ఆరోగ్య సంరక్షణ కోసం కొత్త ప్రమాణాలు.

 • మనమందరం చేయవలసినవి

  మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, రైడర్‌లు అందరూ ఫేస్ కవర్ లేదా మాస్క్ ధరించాలి. అలాగే మీ మధ్య మరింత దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవడానికి, రైడర్‌లకు ఇకపై ముందు సీట్లో కూర్చునేందుకు అనుమతి లేదు.

 • ఫేస్ కవర్ తనిఖీ

  మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లదానికి ముందు, మీ ఫోటో తీసుకోమని మేము కోరుతాము, ఆపై మా టెక్నాలజీ సహాయంతో మీరు ఫేస్ కవర్ ధరించి ఉన్నారో లేదో ధృవీకరించుకుంటాము.

 • ఆరోగ్య మరియు భద్రతా సామాగ్రి

  ఆహారాన్ని సురక్షితంగా డెలివరీ చేసేందుకు మీకు ఫేస్ కవర్‌లు, క్రిమిసంహారకాలు మరియు గ్లోవ్స్ వంటి ఆరోగ్య రక్షణ సామాగ్రిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము.

 • నిపుణుల నేతృత్వ మార్గదర్శకత్వం

  భద్రతా చిట్కాలు మరియు వనరుల గురించి తెలియజేయడానికి మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో కలిసి పని చేస్తున్నాము.

 • రైడ్ రక్షణ అభిప్రాయం

  మీరు ఇప్పుడు రైడర్ ఫేస్ కవర్ లేదా మాస్క్‌ని ధరించకపోవడం లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరు. ఇది మమ్మల్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది, అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండేలా చేస్తుంది.

1/6

సురక్షిత అనుభవాన్ని అందించే విధంగా రూపకల్పన

మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ఫీచర్‌లు

మీకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో మరియు మా సహాయ బృందంతో మిమ్మల్ని కనెక్ట్ చేసి ఉంచేలా మీకు సహాయపడే సాంకేతికతతో యాప్ రూపొందించబడింది, కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

మీకు సహాయం అవసరమైతే, ఇక్కడ పొందండి

ప్రమాదం జరిగినప్పుడు సహాయం అందించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందాలు యాప్ ద్వారా ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటాయి.

విస్తృత సంఘం

నగరాలు మరియు భద్రతా నిపుణులతో మేము కలిసి పని చేయడం ద్వారా, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ప్రయాణాలను అందించడంలో మేము సహాయపడుతున్నాము.

మీ భద్రతే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది

భద్రత గురించి అనుభవపూర్వకంగా తెలుసుకునేలా రూపొందించాము. కాబట్టి మీరు రాత్రిపూట సౌకర్యవంతంగా డ్రైవ్ చేయవచ్చు. దీని వల్ల మీరు ఎక్కడికి వెళుతున్నారనే విషయాన్ని మీకు అత్యంత ముఖ్యమైన వారికి చెప్పవచ్చు. అలాగే ఏదైనా సంఘటన జరిగితే ఆ విషయం వేరొకరికి చేరవేయబడుతుందని మీరు తెలుసుకుంటారు.*

ప్రమాదం జరిగితే 24/7 సహాయం

ప్రమాదం జరిగితే సహాయం అందించడానికి శిక్షణ పొందిన Uber కస్టమర్ అసోసియేట్‌లు రోజంతా అందుబాటులో ఉంటారు.

నా రైడ్‌ని అనుసరించు

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ ప్రయాణ మార్గాన్ని చూడగలరు మరియు మీరు చేరుకున్న వెంటనే వారికి తెలుస్తుంది.

2-విధాల రేటింగ్‌లు

మీ అభిప్రాయం చాలా ముఖ్యమైనది. తక్కువ రేటింగ్ ఇచ్చిన ట్రిప్‌లు లాగ్ చేయబడతాయి మరియు Uber సంఘాన్ని రక్షించడానికి వినియోగదారులను తొలగించవచ్చు.

ఫోన్ వివరాలను చూపకపోవడం

మీరు యాప్ ద్వారా మీ రైడర్‌ను సంప్రదించాల్సి వస్తే, మీ ఫోన్ నంబర్‌ను ప్రైవేట్‌గా ఉంచడం జరుగుతుంది.

GPS ట్రాకింగ్

అన్ని Uber ట్రిప్‌లను ప్రారంభం నుండి ముగింపు వరకు ట్రాక్ చేయడం జరుగుతుంది, కాబట్టి ఏదైనా జరిగితే మీ ట్రిప్‌కు సంబంధించిన రికార్డ్ ఉంటుంది.

ప్రతి ఒక్కరికీ మరింత సురక్షితమైన ప్రయాణాలు, ధన్యవాదాలు

నగరాలను సురక్షితంగా ఉంచడం మరియు రహదారులపై ప్రయాణించేందుకు వాటిని అనుకూలంగా ఉంచేందుకు చేసే సహాయంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు.

డ్రైవింగ్ సమయంలో దానిపైనే దృష్టి కేంద్రీకరించడం

మీరు పోస్ట్ చేసిన వేగ పరిమితిలోపు డ్రైవింగ్ చేస్తున్నారని యాప్ మీకు గుర్తు చేస్తుంది, కాబట్టి మీరు డ్రైవింగ్ చేయడంలో అప్రమత్తంగా ఉండండి.

భద్రతా చిట్కాలు

రైడర్‌లను పికప్ చేసుకోవడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనడం నుండి, మీ భద్రతలో మరియు మీ చుట్టుపక్కల వ్యక్తుల భద్రతలో మీరు పెద్ద మార్పును తీసుకురావచ్చు.

మా సంఘాన్ని బలోపేతం చేయడం

Uber సంఘం మార్గదర్శకాలు రైడర్‌లు మరియు డ్రైవర్‌లు ఒత్తిడి లేని రైడ్‌ను ఆనందించడంలో సహాయపడతాయి. ఎవరైనా వ్యక్తి మార్గదర్శకాలను అనుసరించని పక్షంలో వారిని పూర్తి Uber సంఘం భద్రత కోసం ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించే ప్రమాదం ఉంది.

*నిర్దిష్ట ఆవశ్యకాలు మరియు ఫీచర్‌లు ప్రాంతం ఆధారంగా భిన్నంగా ఉంటాయి, అలాగే అవి అందుబాటులో ఉండకపోవచ్చు.

¹ ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉంది మరియు ఎంపిక చేసిన మార్కెట్‌లలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو