Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రూప్ ఆర్డర్‌లతో టీమ్ మీల్స్‌ను సులభంగా చేయండి

ఉద్యోగులను విడిగా వారికి నచ్చిన ఐటెమ్‌లను షేర్ చేయబడిన గ్రూప్ ఆర్డర్‌లకు జోడించడానికి అనుమతించడం ద్వారా మీ బృందం భోజనాలను సులభంగా నిర్వహించండి.

మొత్తం బృందానికి భోజనం ఏర్పాటు చేయడం సులభం

Uber for Business ఖాతా ఏర్పాటు చేయండి

దీనిని ఉచితంగా మరియు సులభంగా సైన్ అప్ చేయవచ్చు. ఇక్కడ ప్రారంభించండి.

మీ బృందానికి భోజన విధానాలను ఏర్పాటు చేయండి

డెలివరీ లొకేషన్‌లు, భోజన పర్యాయాల సంఖ్య, మరియు మరెన్నో విషయాలను నిర్ణయించడం ద్వారా మీ స్వంత ప్రోగ్రామ్‌ను నిర్మించండి.

గ్రూప్ ఆర్డర్ ప్రారంభించండి

మీ భోజన పాలసీకి జత చేయబడి ఉన్న బృందంలోని ఏ సభ్యులైనా UberEats.com నుండి లేదా Uber Eats మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్ చేయడం ప్రారంభించవచ్చు.

గ్రూప్ ఆర్డర్‌కు బృంద సభ్యులను జోడించండి

ప్రతి ఉద్యోగి మెనూను బ్రౌజ్ చేయగలిగి వారి భోజనాన్ని ఎంచుకోవడానికి వీలుండే కస్టమ్ లింక్‌ను షేర్ చేయండి.

ఆర్డర్ చేయండి

అందరూ ఎవరి భోజనాన్ని వారు ఆర్డర్ చేసుకున్న తర్వాత బృందం అడ్మిన్ ఆ ఆర్డర్‌ను రెస్టారెంట్‌కు సబ్మిట్ చేస్తారు.

డెలివరీ మరియు పూర్తయింది

గ్రూప్ ఆర్డర్‌లను గ్రూప్ ఆర్డర్‌లో భాగమైన ఎవరైనా ఆన్‌లైన్‌లో లేదా యాప్‌లో చూడవచ్చు.

“Uber for Business ఓ వైపు స్థానిక రెస్టారెంట్‌లకు మద్దతుగా ఉంటూనే మా అమ్మకాల ప్రారంభం కోసం మా భోజనం ఖర్చులు తగ్గించడంలో సహాయపడింది .”

ఏంజలీనా ఎల్‌హస్సాన్, డైరెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఫీల్డ్ మార్కెటింగ్, సంసారా

గ్రూప్ ఆర్డర్ చేయడం ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగ్గ అనుభవంగా చేయండి

ఉద్యోగులు వారికి నచ్చిన దానిని ఎంచుకుంటారు

గ్రూప్ ఆర్డర్ చేయడం వలన, ఉద్యోగులు వారి నిర్దిష్ట రుచులకు తగినట్లు తయారు చేసిన వంటకాలను ఎంచుకుంటారు. అది మీకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు వారికి సంతృప్తిని అందిస్తుంది.

భద్రత ఎల్లప్పుడూ ప్రధానం

శుచి మరియు తాజాదనం కోసం ప్రతి భోజనం విడిగా ప్యాక్ చేయబడి ఉంటుంది. అంటే ఇకపై ఆర్డర్‌లు అనుచిత వ్యక్తుల చేతిలోనికి వెళ్ళవు అని అర్థం.

మీ వ్యాపార బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉంటుంది

ఉద్యోగుల భోజనాలన్నీ ఒకే డెలివరీగా కలిపి ఆర్డర్ చేయడం ద్వారా మరియు మీ విధానాలకు తగ్గట్టుగా గ్రూప్ ఆర్డర్ చేసే పరిమితులు ఏర్పాటు చేయడం ద్వారా ఫీజును ఆదా చేయండి.

అధునాతన ఫీచర్‌లు గ్రూప్ ఆర్డర్‌ చేయడాన్ని సులభం చేస్తాయి

ముందుగానే ఆర్డర్ చేయండి

ముందుగానే ప్లాన్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ వారి ఐటెమ్‌లను సబ్మిట్ చేసే అవకాశం పొందేలా చూడటానికి మీరు గ్రూప్ ఆర్డర్‌లను సమయానికి ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు.

ఒక్కో వ్యక్తికి వ్యయ పరిమితులు

ఖర్చులను తగ్గించండి మరియు విడి విడిగా వ్యక్తిగత వ్యయ పరిమితులను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్డర్ చేయడానికి ఏది అంగీకార యోగ్యమో ఉద్యోగులు సులభంగా తెలుసుకునేలా చేయండి. ఊహించని బిల్లులు మరియు ఖర్చులు ఇక గతం అని అనుకునేలా చేయండి.

మీరు మీల్స్ అందించాల్సిన బృందాలు ఉన్నాయి. మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.

  • మీరు ఈ దశలను అనుసరించవచ్చు:

    1. Ubereats.com కు వెళ్లి, రెస్టారెంట్؜ను ఎంచుకుని, గ్రూప్ ఆర్డర్ బటన్؜పై నొక్కండి.

    2. గ్రూప్ ఆర్డర్ లింక్؜ను వారితో పంచుకుని, ఆర్డర్ చేయడానికి మీ టీమ్؜ను ఆహ్వానించండి. వారికి అనుకూలంగా వారు మార్చుకోవచ్చు, మీకు కావలసిన విధంగా మీరు ఖర్చు చేయవచ్చు.

    3. డెలివరీ కోసం చెల్లించండి మరియు ట్రాక్ చేయండి.

    4. మీ మీల్؜ను ఆస్వాదించండి!

  • రిమోట్ ఉద్యోగుల కోసం Uber గ్రూప్ ఆర్డర్؜లు ఉపయోగించి, వ్యాపారాలు టీమ్ సభ్యులు కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికి మరియు మరింత సాంగత్యం ఏర్పరుచుకోవడానికి అవకాశాలు కల్పించి, వర్చువల్ టీమ్ బలమైనదిగా మరింత పొందికగా మారడానికి తోడ్పడవచ్చు.

  • గ్రూప్ ఆర్డర్؜లకు ఒకే వ్యక్తి చెల్లించవచ్చు, లేదా గ్రూప్ ఆర్డర్؜లోని ప్రతి ఒక్కరూ తమ కోసం తాము చెల్లించుకోవచ్చు. మీరు గ్రూప్ ఆర్డర్؜లోని ప్రతి వ్యక్తికి ఖర్చు పరిమితిని సెట్ చేయవచ్చు.

  • Uber గ్రూప్ ఆర్డర్ చేసినప్పుడు, సర్వీస్؜కు సంబంధించిన ప్రామాణిక ఫీజులు వర్తిస్తాయి. ఆర్డర్ చేస్తున్నప్పుడు ఈ ఫీజుల గురించి మరింత ఖచ్చితమైన మరియు తాజా సమాచారం కోసం Uber Eats యాప్؜ను చూడాల్సిందిగా మేం సిఫార్సు చేస్తున్నాం.

  • Uber Eats గ్రూప్ ఆర్డర్؜ల సామర్ధ్యం రెస్టారెంట్ పరిమాణం, సామర్థ్యాలు మరియు అందుబాటులో ఉన్న స్టాక్؜ను బట్టి మారుతుంది. కొన్ని పెద్ద రెస్టారెంట్؜లు లేదా ఈవెంట్؜లపై దృష్టి సారించే రెస్టారెంట్؜లు 100 మంది వరకు ఆర్డర్؜లను నిర్వహించగలవు, కానీ ఆహార తయారీ సామర్థ్యం మరియు వంటకం సంక్లిష్టత వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

  • ఉద్యోగులు ఏమి తినాలనుకుంటున్నారో అదే ఎంచుకోవచ్చు, ఇది ఆహారం వృధా చేయడాన్ని తగ్గించగలదు. టీమ్ బడ్జెట్ పరిమితిలో ఉందని నిర్ధారించుకోవడానికి, కంపెనీలు ప్రతి వ్యక్తికి ఖర్చు పరిమితిని కూడా సెట్ చేయవచ్చు.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو