Uberలో బిజినెస్ ప్రొఫైల్‌లు
Uber for Business ప్రోత్సాహకాలకు మీకు అర్హత ఉందో లేదో తెలుసుకుని, ప్రాధాన్యతా పికప్*, సజావైన ఎక్స్పెన్సింగ్ను మరియు మరెన్నో ఆస్వాదించడం ప్రారంభించండి.
ఇప్పటికే 170,000 సంస్థలు Uber for Businessను ఉపయోగిస్తుండడంతో, వారిలో ఒకరుగా ఇప్పటికే మీ యాజమాన్యం కూడా ఉండొచ్చు.
బిజినెస్ ట్రావెలర్ కోసం రూపొందించబడింది
ప్రత్యేకమైన రైడ్ ఆప్షన్
బిజినెస్ కంఫర్ట్ అనేది బిజినెస్ ప్రయాణికుల కోసం రూపొందించిన ప్రత్యేకమైన రైడ్ ఆప్షన్. ప్రాధాన్యతా పికప్*, మెరుగైన సపోర్ట్, టాప్-రేటెడ్ డ్రైవర్లు మరియు మరెన్నో వాటితో సమయాన్ని ఆదా చేసి, ఉత్పాదకంగా ప్రయాణించండి.
ఖర్చులపై సమయాన్ని ఆదా చేయండి
అప్రయత్నంగా ఎక్స్పెన్స్ రిపోర్టింగ్‌ను ఆస్వాదించండి, ఎక్స్పెన్స్ ప్రొవైడర్లకు ఆటోమేటిక్‌గా రసీదు అప్లోడ్లు చేసి విలువైన సమయాన్ని ఆదా చేసుకోండి. ఎక్స్పెన్స్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేయడం ఇంతకన్నా సులభంగా ఎప్పుడూ లేదు.
వ్యక్తిగతం నుండి వ్యాపారాన్ని వేరు చేయండి
మీ వర్క్ ట్రావెల్ వ్యక్తిగత ప్రయాణంతో మిళితం కావొచ్చు, కానీ మీ ఖర్చుల విషయంలో అలా ఉండాల్సిన అవసరం లేదు. బిజినెస్ మరియు వ్యక్తిగత ప్రొఫైల్‌లను వేరు చేయడం వల్ల మీ ఖర్చులను సరిగ్గా విభజించారని, సరైన చెల్లింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారని ఖరారు చేసుకోవచ్చు.
సెటప్ చేయడం సులభం
మీ వ్యక్తిగత Uber ఖాతా క్రెడెన్షియల్లను నమోదు చేయాల్సిందిగా, మరియు మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌కు పంపిన 4-అంకెల కోడ్ ద్వారా మీ ఖాతాను ధృవీకరించాల్సిందిగా మీరు ప్రాంప్ట్ చేయబడవచ్చు.
లాగిన్ అయిన తర్వాత, మీరు సంస్థ ఖాతాకు కనెక్ట్ అవ్వడానికి అర్హులో కాదో చూడటానికి మీ వర్క్ ఈమెయిల్‌ను నమోదు చేయండి.
మీకు అర్హత ఉంటే, మీ ఖాతాను ధృవీకరించడానికి మరియు యాక్టివేట్ చేయడానికి మీకు ఈమెయిల్ వస్తుంది. మీ మొబైల్ పరికరంలో ఈమెయిల్‌ను తెరిచి, ఈమెయిల్లో మీ ఖాతాను యాక్టివేట్ చేయండి మీద తట్టండి.
ఇప్పుడే చేరండి మీద తట్టండి.
మీరు సిద్ధంగా ఉన్నారు! వచ్చేసారి, ఆఫీస్ పని కోసం Uberను ఉపయోగిస్తున్నప్పుడు, మీ బిజినెస్ ప్రొఫైల్‌కు టోగుల్ చేయండి.
మీ బిజినె స్ ట్రావెల్‌ను వీలైనంత సద్వినియోగం చేసుకోండి
ముందుగానే ప్లాన్ చేసుకోండి
ఒత్తిడి లేని రైడ్ కోసం ఆన్-టైమ్ పికప్‌ను ఖరారు చేయడంలో సహాయపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే Uber రిజర్వ్‌తో మీ రాబోయే ట్రిప్ కోసం మీరు రైడ్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
ప్రోత్సాహకాలు మరియు విధానాన్ని చూడండి
Uber యాప్‌లోని బిజినెస్ హబ్, మీ కంపెనీ అందించే ట్రావెల్ ప్రయోజనాలు మరియు వర్క్ ప్రోత్సాహకాలను సులభంగా యాక్సెస్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది.
ప్రతి సందర్భానికి రైడ్ ఉంటుంది
పని రీత్యా మీరు వెళ్లే ప్రతి చోటా విస్తృత శ్రేణి రైడ్ ఆప్షన్లు. మీకు ఎయిర్పోర్ట్ నుండి రైడ్ అవసరమైనా, పట్టణంలో టీమ్ డిన్నర్ ఉన్నా, లేదా క్లయింట్ మీటింగ్‌కు మీదైన శైలిలో ప్రయాణించాలని అనుకున్నా, ప్రతి సందర్భానికి రైడ్ ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
- నా Uber for Business ఖాతాను యాక్టివేట్ చేయడానికి నాకు ఈమెయిల్ అందలేదు, తర్వాత ఏం చేయాలి?
మీ Uber for Business ఖాతాను యాక్టివేట్ చేయడానికి మీకు ఈమెయిల్ అందకపోయితే, మీ వర్క్ ఈమెయిల్ అడ్రస్‌తో అనుబంధించిన Uber for Business ఖాతాను మేం కనుగొనలేకపోయాం అని అర్థం. వ్యక్తిగత రైడ్లు మరియు మీల్స్ల నుండి వర్క్ రైడ్లు మరియు మీల్స్లను వేరు చేయడానికి, సులభమైన ఎక్స్పెన్సింగ్ను ఆస్వాదించడానికి మీరు ఇప్పటికీ బిజినెస్ ప్రొఫైల్‌ను సెటప్ చేయవచ్చు.
- మీ బిజినెస్ ఖాతా కోసం చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి
- మీరు ట్రావెల్ రిపోర్ట్‌లను ఎంత తరచుగా అందుకోవాలని అనుకుంటుంటున్నారో ఎంచుకోండి
- సరళీకృత రిపోర్టింగ్ కోసం ఎక్స్పెన్స్ ప్రొవైడర్‌ను లింక్ చేయండి
- మొత్తం సిద్ధం!
- నేను నా మొత్తం టీమ్ లేదా కంపెనీని ఎలా సైన్ అప్ చేయాలి?
Down Small Uber for Business మీ ఉద్యోగుల ప్రయాణం మేనేజ్ చేయడంలో, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.
- నేను వారపు లేదా నెలవారీ ట్రావెల్ రిపోర్ట్‌లను ఎలా ఆన్ చేయాలి?
Down Small - మీ యాప్ మెనూ నుండిచెల్లింపును ఎంచుకోండి,రైడ్ ప్రొఫైల్స్ కోసం క్రిందికి స్క్రోల్ చేయండి.
- మీ ప్రాధాన్యతలకు వెళ్ళడానికి బిజినెస్ ప్రొఫైల్‌లు పై తట్టండి.
- వారపు లేదా నెలవారీ ట్రావెల్ రిపోర్ట్‌లను ఆన్ చేయడానికి ట్రావెల్ రిపోర్ట్ పై తట్టండి.
- నేను నా బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్‌లను ఎలా సవరించవచ్చు?
Down Small - మీ యాప్‌లోని దిగువ నావిగేషన్ నుండి ఖాతాను ఎంచుకోండి, ఆపై Wallet ఎంచుకోండి.
- రైడ్స్ ప్రొఫైల్‌లు కింద, మీ సెట్టింగ్‌లకు అవసరమైన మీ బిజినెస్ ప్రొఫైల్‌లను ఎంచుకోండి.
- మీ చెల్లింపు పద్ధతిని అప్డేట్ చేయడానికి డిఫాల్ట్ చెల్లింపుపై తట్టండి, వారపు లేదా నెలవారీ ట్రావెల్ నివేదికలను ఆన్ చేయడానికి ట్రావెల్ రిపోర్ట్ పై తట్టండి, మీ ఎక్స్పెన్స్ ప్రొవైడర్‌ను అప్డేట్ చేయడానికి ఎక్స్పెన్స్ ప్రొవైడర్‌పై తట్టండి.
- మీ ఎక్స్పెన్స్ ప్రొవైడర్ భాగస్వాములు ఎవరు?
Down Small మేం Coupa, Certify, Chrome River, Concur, Expensify మరియు మరిన్నింటితో కలిసి పని చేస్తాం. ఎక్స్పెన్స్ ప్రొవైడర్లు అందరినీ ఇక్కడ చూడండి.
- Uber ఎక్కడ అందుబాటులో ఉంది?
Down Small ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ నగరాలు, 700 పైచిలుకు ఎయిర్‌పోర్ట్‌లలో Uber అందుబాటులో ఉంది.
మీ మొత్తం టీమ్ లేదా కంపెనీని సైన్ అప్ చేయాలని చూస్తున్నారా?
*వేగవంతమైన పికప్‌కు హామీ ఉండదు. లొకేషన్ మరియు పరికరాన్ని బట్టి లభ్యత మారవచ్చు. ఎయిర్పోర్ట్ లొకేషన్లలో ప్రాధాన్యత పికప్ అందుబాటులో లేదు.
అవలోకనం
మా గురించి
ప్రోడక్ట్‌లు
పరిష్కారాలు
Use case ద్వారా
పరిశ్రమల వారీగా
కస్టమర్ సపోర్ట్
సపోర్ట్
వనరులు
తెలుసుకోండి