Uber’s Climate Assessment and Performance Report
మా రెండవ వార్షిక నివేదిక వాతావరణ సంబంధిత ప్రభావాలు, విద్యుత్ వాహనాల దిశగా పనితీరు మరియు కెనడా, యూరప్ మరియు యుఎస్లలో Uber యాప్‌తో పూర్తి చేసిన బిలియన్ల కొద్దీ ప్యాసింజర్ ట్రిప్‌ల సమర్థతా కొలమానాలను వివరిస్తుంది.
Uber ప్లాట్ఫారం ద్వారా అందించే ట్రిప్‌ల పర్యావరణ ప్రభావం ముఖ్యమైనది. పనితీరుపై పారదర్శకంగా నివేదించడం, దానిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం మా బాధ్యత. మరింత పారదర్శకతను అందించడానికి, మా వాతావరణ పనితీరును మెరుగుపరచడానికి మా ఉత్పత్తుల వాస్తవ వినియోగం నుండి సేకరించిన డేటాను మూల్యాంకనం చేయడం ద్వారా మేం ప్రభావాన్ని లెక్కిస్తాం.
"శూన్య ఉద్గారాల మార్గంలో ఏటికేడాది పురోగతి కొరకు పారదర్శకత మరియు జవాబుదారీతనం అవసరం. మా ఉత్పత్తుల ఖాతాదారుల వాస్తవ వినియోగం నుంచి ఉద్గారాలను లెక్కించి, నివేదించిన మొదటి మొబిలిటీ ఫ్లాట్‌ఫారంగా Uber గర్వపడుతోంది."
-దారా ఖోస్రోషాహి, CEO, Uber
అవలోకనాలు మరియు లోతైన విశ్లేషణలు
యూరోపియన్ రాజధాని నగరాల్లో మా స్థిరత్వ నిబద్ధతపై పురోగతి
ప్రాథమికంగా రైడ్ షేరింగ్ అనేది ప్రైవేట్ కారు వినియోగం కంటే ఏవిధంగా భిన్నంగా ఉంటుంది
తరచుగా అడిగే ప్రశ్నలు
- Uber తాజా వాతావరణ అంచనా మరియు పనితీరు నివేదికలో ఏముంది?
మా వాతావరణ అంచనా మరియు పనితీరు నివేదిక నగర అధికారులు, పర్యావరణ న్యాయవాదులు, వినియోగదారులు మరియు ఇతర వాటాదారులకు వాతావరణ సంబంధిత ఉద్గారాలు, విద్యుత్ వాహనాల దిశగా పురోగతి మరియు Uber యాప్ ద్వారా ప్రారంభించిన ప్యాసింజర్ ట్రిప్స్ కోసం సమర్థత కొలమానాలపై పనితీరు-ఆధారిత కొలమానాలను అందిస్తుంది.
2017 నుండి 2021 ప్రథమార్థం వరకు US, కెనడా మరియు యూరప్‌లో అందించిన బిలియన్ల కొద్దీ రైడ్లను కవర్ చేస్తూ, Uber ప్లాట్‌ఫారాన్ని డ్రైవర్లు మరియు రైడర్ల వాస్తవ వినియోగం నుండి సేకరించిన విస్తారమైన మొత్తం అనామధేయ డేటాని ఈ నివేదిక సంక్షిప్తీకరించింది.
- Why are you publishing this report?
Uber యాప్‌తో పూర్తి చేసిన ట్రిప్‌ల పర్యావరణ ప్రభావం ముఖ్యమైనది. పనితీరుపై పారదర్శకంగా నివేదించడం, దానిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం మా బాధ్యత. మా ఉత్పత్తల వినియోగం ఫలితంగా వచ్చే ఉద్గారాలు Uber కార్బన్ ఫుట్ఫ్రింట్లో అత్యంత గణనీయమైన భాగం అని మా అంచనాలు చూపిస్తున్నాయి. మా ఉత్పత్తుల వాస్తవ వినియోగంపై ఆధారితమైన, ఈ నివేదిక, మా వాతావరణ ప్రభావంపై మరింత పారదర్శకతను అందిస్తుంది మరియు పనితీరును మెరుగుపరచడానికి మాకు సహాయపడుతుంది.
మా మొదటి రిపోర్ట్, CAsPR 2020 కొరకు, ఇక్కడకు వెళ్లండి.
- What are the key measurements you use in the Climate Assessment and Performance Report?
- Uber లో డ్రైవర్ల EV వినియోగం: శూన్య ఉద్గారాల వాహనాల్లో (ZEVలు) పూర్తయిన ఆన్-ట్రిప్ మైళ్లు లేదా కిలోమీటర్ల వాటా, ఇది 2040 నాటికి Uber లో 100% శూన్య ఉద్గారాల మొబిలిటీ అనే మా లక్ష్యం దిశగా మా పురోగతిని లెక్కిస్తుంది.
- ప్రయాణ సామర్థ్యం, కారు వినియోగాన్ని తగ్గించేటప్పుడు వ్యక్తుల ప్రయాణాల్లో మేం ఎంత బాగా సాయపడతాం అని ఇది అంచనా వేస్తుంది
- కార్బన్ తీవ్రత, ఇది ప్రతి ప్యాసింజర్ మైలు నుంచి వెలువడే ఉద్గారాలను లెక్కిస్తుంది.
- How will this report improve carbon intensity for rides on Uber?
రాబోయే 2 దశాబ్దాల్లో Uber అందించే ప్రతి ట్రిప్ యొక్క కార్బన్ తీవ్రతను శూన్య ఉద్గారాలకు తగ్గించాలనే సాహసోపేతమైన ఆశయం మాకు ఉంది. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకోకుండా, మనం మన లక్ష్యాన్ని చేరుకోలేం.
Uber ద్వారా తీసుకున్న అన్ని ప్యాసింజర్ ట్రిప్‌ల్లో కార్బన్-తీవ్రతను తగ్గించడానికి పెట్టుబడి అందించాల్సిన 4 మూలస్తంభాలను మేం గుర్తించాం:
- ఎలాంటి ఉద్గారాలు లేని లేదా తక్కువ ఉద్గారాలతో రైడర్లకు మొబైలిటీని అందించే పర్యావరణ హితమైన ఉత్పత్తులను రూపొందించడం
- శూన్య-ఉద్గార వాహనాలకు సముచితంగా మారడానికి డ్రైవర్లకు అవగాహన, ప్రోత్సాహాలు, మరియు పొదుపు అవకాశాలతో మద్దతు ఇవ్వడం
- స్కూటర్లు, బైక్‌లు మరియు ప్రజా రవాణాతో సహా Uberలో మల్టీమోడల్ మొబిలిటీ ఎంపికలను విస్తరించడం
- ఈ ప్రక్రియ సమయంలో ప్రజలకు పారదర్శకంగా మరియు జవాబుదారీగా ఉండండి
అదనంగా, ఈ నివేదికలో పంచుకున్న డేటా స్థిరమైన రవాణా పరిష్కారాల ప్రస్తుత అభివృద్ధికి దోహదపడుతుందని మరియు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మేం ఆశిస్తున్నాం.
- Do riders take trips with Uber instead of using lower-carbon options?
రైడర్లకు అందుబాటులో ఉన్న అనేక రవాణా ఎంపికల్లో Uber యాప్‌తో రైడ్లు ఒకటి. ట్రిప్ ఎంపిక వివిధ స్థానిక మార్కెట్ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
Uber యాప్ డ్రైవర్లు మరియు రైడర్ల వాస్తవ ప్రపంచ వినియోగం నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి రైడ్ల ప్రభావాన్ని లెక్కించడంపై ఈ నివేదిక ప్రత్యేకంగా దృష్టి సారించింది, వ్యక్తులు మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించనప్పుడు ఏమి చేస్తారనే దాని గురించి అదనపు అంచనాలను రూపొందించాల్సిన అవసరం ఉన్న ప్రతికూల దృశ్య నమూనాలను ఉద్దేశపూర్వకంగా మానుకొంది.
Uber ప్లాట్ఫారంలోని రైడ్‌షేర్ ట్రిప్‌లు ప్రైవేట్ కార్లు లేదా మరోవిధంగా ఎవరైనా ట్రిప్‌లను 100% భర్తీ చేయడానికి రూపొందించలేదు. రైడ్‌షేరింగ్ అనేది చాలామంది వ్యక్తులకు ప్రాథమిక ప్రయాణ విధానం వలే కాకుండా, ఇతర విధానాలు లభ్యం కానప్పుడు లేదా ఇతర కారణం వల్ల సాధ్యం కానప్పుడు, అప్పుడప్పుడు మొబిలిటీ ఇన్స్యూరెన్స్ వలే పనిచేస్తుంది. వాస్తవానికి, చాలా సంవత్సరాలుగా తెలిసిన విషయం ఏమిటంటే, సాధారణ ప్రజానీకంతో పోలిస్తే Uber రైడర్లు తక్కువ కార్లను కలిగి ఉంటారు మరియు ఎక్కువగా ప్రజారవాణాని ఉపయోగిస్తారు. వారి కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని తగ్గించడానికి కారు-ఫ్రీ లేదా కార్-లైట్ జీవనశైలి కలిగి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి, దీనిని సాధించడంలో గృహస్థులకు సాయపడటానికి, ఆన్-డిమాండ్ రవాణాకు విశ్వసనీయమైన యాక్సెస్ అవసరం. రైడ్ షేర్ ఫ్లాట్‌ఫారాలు మరియు ట్యాక్సీ ఫ్లాట్ల ద్వారా అందించే — ఆన్‌డిమాండ్ ట్రిప్‌ల గురించి మా అక్టోబర్ 2021 మదింపులో మరింత చదవండి- పట్టణ వాహన మైళ్ళలో తక్కువ శాతం పాయింట్లను మాత్రమే కలిగి ఉంది, బైకింగ్, మైక్రోమొబిలిటీ మరియు నడవడం వంటి క్రియాశీల మోడ్లతో కూడిన ప్రజా రవాణా ద్వారా నడిపించబడే భారీ రవాణా ఎకోసిస్టమ్‌లో సహాయక సభ్యుడిగా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
- Will you measure the same data for other countries or regions around the world?
మేం 2021లో ప్రచురించిన మా రెండవ వార్షిక నివేదికకు ప్రధాన యూరోపియన్ మార్కెట్లను జోడించాం, ఇప్పుడు US, కెనడా మరియు మా యూరోపియన్ మార్కెట్లో ఎక్కువ భాగంలో పూర్తి చేసిన ప్యాసింజర్ రైడ్లను కవర్ చేశాం. Uber లో ట్రిప్పుల ఫలితంగా వాతావరణ ఉద్గారాలు మరియు ఇతర ప్రభావ ప్రాంతాలపై క్రమం తప్పకుండా నివేదించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. మేం నివేదికలో కవర్ చేసిన మార్కెట్ల భౌగోళిక పరిధిని క్రమేపీ విస్తరించేందుకు యోచిస్తున్నాం.
- Uber Eats, డెలివరీ మరియు Uber Freight వ్యాపారాల గురించి ఏమిటి? ఇప్పుడు Uber వ్యాపారంలో అధిక వాటాను కలిగి ఉన్న ఈ ప్రాంతాలపై మీరు ప్రభావాన్ని లెక్కిస్తారా?
మా 2021 నివేదిక US, కెనడా మరియు మా యూరోపియన్ మార్కెట్లోని అధిక భాగంలో పూర్తి చేసిన ప్యాసింజర్ రైడ్లను కవర్ చేస్తుంది. కాలక్రమేణా, మేం మా డెలివరీ మరియు సరుకు రవాణా వ్యాపారాలకు కూడా పారదర్శకత, అభ్యసనలు మరియు స్థిరత్వ వ్యూహాలపై మా విధానాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాుం.
This page and the related Climate Assessment and Performance Report (“the report”) contain forward-looking statements regarding our future business expectations and goals, which involve risks and uncertainties. Actual results may differ materially from the results anticipated. For more information, please see our report.
కంపెనీ