వైవిధ్యం, సమానత్వం మరియు కలుపుగోలు
వైవిధ్యమైన ప్లాట ్ఫారానికి సేవచేయడానికి విభిన్న బృందాలను రూపొందించడం
Uber ప్లాట్‌ఫారమ్‌లో, ప్రతి రోజు తీసుకునే మా 19 మిలియన్ల ట్రిప్‌లలో, అనేక మంది ఒకరితో ఒకరు పరస్పరం సంప్రదించుకుంటారు. మా ప్రొడక్ట్‌లను ఉపయోగించే వైవిధ్యభరితమైన కమ్యూనిటీలకు సమర్థవంతంగా సేవలు అందించే రీతిలో మా ప్రొడక్ట్‌లను రూపొందించాల్సిన, మా వ్యాపారాలను నిర్వహించాల్సిన అవసరం మాకు ఉంది. అంటే, మేం పనిచేసే మరియు నియమించుకునే కమ్యూనిటీల వైవిధ్యాన్ని అంతర్గతంగా మా సిబ్బందిలో ప్రతిబింబించేలా చేయడం, ఆ వైవిధ్యత వృద్ధి చెందే వాతావరణాన్ని పెంపొందించడం, మరియు సిబ్బంది దినిలో భాగమని విశ్వసించి, మా పరస్పర విజయానికి దోహదపడగలరని భావించేలా చేయడం చాలా అవసరం.
కాలక్రమేణా, క్రమంగా మరియు స్థిరమైన మార్పులు చేయడం ద్వారా, Uber పునాదిని దిగువ నుండి పైకి పునర్నిర్మించి, మన సంస్కృతిని పూర్తిగా పునఃరూపొందించింది. ఐదేళ్ల తర్వాత, వైవిధ్యత మమ్మల్ని ఎలా బలపరుస్తోందో మరియు ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు మరింత సమానమైన మరియు కలుపుకుపోయే వాతావరణాన్ని సృష్టించేందుకు మాకు వీలు కల్పిస్తుందనే విషయాన్ని, మేం ఇప్పటికే చూస్తున్నాం.
ఉద్యోగి వనరు గ్రూప్‌లు
సభ్యుల కోసం నాయకత్వ అభివృద్ధి అవకాశాలతో పాటు, Uber ఉద్యోగి వనరుల గ్రూప్స్ గుర్తింపు మరియు ఖండన గురించి అవగాహన కల్పిస్తాయి.
Uberలో సర్వమత విశ్వాసం
వివిధ ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు సంస్కృతుల ప్రజల కోసం Uber కమ్యూని టీ
వార్షిక వ్యక్తులు మరియు సంస్కృతి రిపోర్టింగ్
ప్రతి సంవత్సరం, మానవ వనరుల మూలధన నిర్వహణ; వైవిధ్యం, సమానత్వం, చేర్పు; మరియు సంస్కృతి పట్ల మా విధానాన్ని పంచుకోవడానికి, మేం మా పీపుల్ అండ్ కల్చర్ రిపోర్ట్‌ను ప్రచురిస్తాం. అప్‌డేట్ చేసిన ప్రాతినిధ్య డేటాను పంచుకుంటాం మరియు ఆకాంక్షించిన మా లక్ష్యాల దిశగా మేం ఎలా పురోగమిస్తున్నామో తెలియజేస్తాం. మా సిబ్బంది డేటా మరియు మానవ వనరుల మూలధన ఆచరణల పట్ల పారదర్శకతను పెంచే మా విధానంలో, ఈ రిపోర్ట్ ఒక కీలకమైన అంశం.
మాతో సంపర్కంలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ, నిష్పక్షపాతమైన అనుభవం అందించే దిశగా Uber అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని మెరుగ్గా చెప్పడానికి, మా పీపుల్ అండ్ కల్చర్ రిపోర్ట్‌ను, మా ESG (ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్) రిపోర్ట్‌తో సమన్వయ పరచి, మా కొత్త ఎన్వైరన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ రిపోర్ట్‌గా రూపొందేలా చేసి, Uber డ్రైవ్‌లు ఎలా ప్రభావం చూపుతాయో అర్ధమయ్యేలా ఒక సమగ్ర దృష్టిని మేం ఏర్పరిచాం.
సమాన అవకాశాల యజమానిగా ఉండటం
ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌గా కూడా పిలవబడే EEO-1 రిపోర్ట్, US ఫెడరల్ ప్రభుత్వంచే తప్పనిసరి చేయబడింది, ఈ రిపోర్ట్ ద్వారా కంపెనీలు, జాతి/జాతి వర్గం, లింగం మరియు ఉద్యోగ కేటగిరీల వారీగా ఉపాధి డేటాను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
మా మొత్తం సిబ్బందిలో, వైవిధ్యత, చేర్పు మరియు సమానత్వాన్ని పర్యవేక్షించడానికి మరియు కొలవడానికి ఈ రిపోర్ట్‌ను ఉపయోగిస్తారు—ముఖ్యంగా, ఇది ఒక నిర్దిష్ట సమయంలో Uber US సిబ్బందికి సంబంధించిన స్నాప్‌షాట్. పని ప్రదేశాలలో వైవిధ్యతను ప్రోత్సహించడం అనేది, విస్తృత DEI (వివిధత్వం, సమానత్వం, చేర్పు) వ్యూహం పరంగా, దాని లక్ష్యాలను విమర్శనాత్మకంగా పరిశీలించుకునేందుకు మా వ్యాపారానికి సహాయపడుతుంది. మా ఎంప్లాయి డెమోగ్రాఫిక్ డేటాకు సంబంధించి పారదర్శకతను మరియు వివరాలలో సూక్ష్మతను పెంపొందించాలనే మా ప్రస్తుత నిబద్ధతలో భాగంగా, ఈ రిపోర్ట్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని మేం ఎంచుకున్నాం.
2021 EEO-1 రిపోర్ట్
2022 EEO-1 నివేదిక
2021 EEO-1 రిపోర్ట్
2020 EEO-1 నివేదిక
2019 EEO-1 నివేదిక
ఒక ఫెడరల్ కాంట్రాక్టర్‌గా, సమాన అవకాశం/నిశ్చయాత్మక ఎంప్లాయర్‌గా ఉన్నందుకు Uber గర్విస్తోంది. అర్హత కలిగిన దరఖాస్తుదారులు అందరూ, లింగం, లింగ గుర్తింపు, లైంగిక ధోరణి, జాతి, రంగు, మతం, జాతీయ మూలం, వైకల్యం, ప్రొటెక్టెడ్ వెటరన్ స్టేటస్, వయస్సు లేదా చట్టం ద్వారా రక్షించబడిన వేరే ఏదైనా ఇతర లక్షణాలతో సంబంధం లేకుండా ఉపాధి కోసం పరిగణించబడతారు. అదనంగా, చట్టపరమైన ఆవశ్యతలకు అనుగుణంగా ఉంటే, నేర చరిత్రలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన దరఖాస్తుదారులను పరిగణలోకి తీసుకుంటాం. "ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్ట్యూనిటీ అనేది చట్టం", "EEO అనేది చట్టం" అనుబంధం, మరియు "పే ట్రాన్స్పెరెన్సీ నాన్ డిస్క్రిమినేషన్ ప్రొవిషన్"కూడా చూడండి. వసతి ఏర్పాటు అవసరమయ్యే వైకల్యం లేదా ప్రత్యేక అవసరం ఉంటే, దయచేసిఈ ఫారంనుపూర్తి చేయడం ద్వారా మాకు తెలియజేయండి.
Uberలో DEI మరియు జీవితం
Uberలో పని చేయడం అంటే ఏమిటి అనే దాని గురించి మరింత సమాచారం కోసం మా కెరీర్‌ల పేజీని చూడండి.