Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Uber ఉపయోగంలో సౌలభ్యాలు

మా టెక్నాలజీ మరియు డ్రైవర్‌లు అందించే రవాణా, వైకల్యాలు ఉన్న చాలా మంది ప్రయాణాన్ని మార్చివేసింది మరియు ప్రతి ఒక్కరూ వారి సంఘంలో సులువుగా తిరిగే సామర్థ్యానికి సహాయపడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.

వైకల్యాలు ఉన్న రైడర్‌లు

ఇటువంటి సదుపాయాలు మరియు సామర్ధ్యాలతో, వైకల్యాలు ఉన్న రైడర్‌ల ప్రయాణానికి మరియు స్వాతంత్రతను పెంచడానికి Uber యొక్క టెక్నాలజీ సహాయపడుతుంది:

క్యాష్‌లెస్ చెల్లింపులు

Uber యొక్క నగదు రహిత చెల్లింపు ఎంపిక రైడర్‌లు నగదును లెక్కించడం లేదా డ్రైవర్‌తో బిల్లులను మార్చడం గురించి ఆందోళన చెందవలసినఅవసరాన్ని తగ్గిస్తూ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది.

ఆన్-డిమాండ్ రవాణా

Uber యాప్ వైకల్యాలు ఉన్న రైడర్‌లు ఒకే ఒక్క బటన్ నొక్కడం ద్వారా A నుండి Bకు వెళ్లేలా సులభతరం చేస్తుంది. వారు ఇక రైడ్‌లు ఏర్పాటు చేయడానికి డిస్పాచర్ లేదా రైడ్‌ను కనుగొనడంలో తక్కువ సౌకర్యవంతమైన ఇతర మార్గాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

ముందస్తు ధర

రైడర్‌లు రైడ్‌ను అభ్యర్థించే ముందు వారి ట్రిప్ ఖర్చును తెలియజేయడానికి Uber ముందస్తు ధరలను ఉపయోగిస్తుంది. ఇది వారికి మానసిక ప్రశాంతతను అందిస్తూ, మోసానికి సంబంధించిన ప్రమాదాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

వివక్ష వ్యతిరేక విధానాలు

నమ్మదగిన, సరసమైన రవాణాను పొందడంలో అడ్డుపడే చట్టవిరుద్ధమైన వివక్షకు ఆస్కారాన్ని తగ్గిస్తూ, రైడర్ చేసే ప్రతి ట్రిప్ అభ్యర్థన Uber యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా సమీపంలోని డ్రైవర్‌తో మ్యాచ్ చేయబడుతుంది.

సేవలు అందించే పెంపుడు జంతువుల గురించిన విధానాలు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్న మరియు సేవలు అందించే రైడర్‌లలు పెంపుడు జంతువులతో ప్రయాణించేటపుడు, Uber యొక్క కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు సేవలు అందించే పెంపుడు జంతువుల యొక్క విధానం స్పష్టంగా సేవా జంతువుల రవాణాకు వర్తించే అన్ని చట్టాలను డ్రైవర్‌లు పాటించాల్సిన అవసరం ఉంది.

మీ ETA మరియు లొకేషన్‌ను పంచుకోండి

మరింత మానసిక ప్రశాంతత కోసం రైడర్‌ల నిర్దిష్ట మార్గం మరియు చేరుకునే అంచనా సమయంతో సహా వారి రైడ్ వివరాలను ఇష్టమైనవారితో సులభంగా షేర్ చేసుకోగలరు. Uber యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే డ్రైవర్ పేరు, ఫోటో మరియు వాహన సమాచారాన్ని చూసి, రైడర్ తమ గమ్యస్థానానికి చేరుకునే వరకు రియల్ టైమ్‌లో మ్యాప్‌లో ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయగలిగే లింక్‌ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అందుకుంటారు.

చలన సంబంధ వైకల్యాలు ఉన్న రైడర్‌లు

చలన సంబంధ వైకల్యాలు ఉన్న రైడర్‌లకు రవాణాను మరింత అందుబాటులో మరియు నమ్మదగినదిగా ఉంచడానికి మేము WAV (వీల్‌చైర్-సదుపాయం ఉన్న వాహనాలు)తో సహా సంకేతికతను ఉపయోగిస్తున్నాము.

సన్నద్ధమైన వాహనాలు

మడవలేని మోటారు వీల్‌చైర్‌లను ఉపయోగించే రైడర్‌లను ర్యాంప్‌లు లేదా లిఫ్ట్‌లతో కూడిన వీల్‌చైర్ సదుపాయం ఉన్న వాహనాల్లో డ్రైవర్‌లతో కనెక్ట్ చేయడానికి Uber WAV అనుమతిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది

ఏ వీల్ చైర్-సదుపాయం ఉన్న వాహన ఎంపికలు రైడర్‌లు మరియు డ్రైవర్‌ల అవసరాలను తీర్చడానికి బాగా సరిపోతాయో తెలుసుకోడానికి ప్రపంచంలోని అనేక నగరాల్లో (బెంగళూరు, బోస్టన్, చికాగో, లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో మరియు వాషింగ్టన్, DCతో సహా) మేము అనేక WAV మోడళ్‌లను ఉపయోగిస్తున్నాము.

“[WAV]ను ప్రారంభించడం ద్వారా, వీల్ చైర్-సదుపాయం ఉన్న వాహనాలు అవసరమయ్యే వ్యక్తులు ఒక్క బటన్‌ను నొక్కడంతో ఆన్-డిమాండ్ రైడ్‌ను అభ్యర్థించే అవకాశాన్ని Uber అందిస్తోంది. వైకల్యాలు ఉన్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు పనిచేసే సంస్థగా, వీల్ చైర్-సదుపాయం ఉన్న వాహనాలను కోరుకునే మా వంటి వారికి ఎంపికలను విస్తరించినందుకు నేను Uber‌ను మెచ్చుకుంటున్నాను.”

—ఎరిక్ లిప్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓపెన్ డోర్స్ ఆర్గనైజేషన్

"ప్రపంచవ్యాప్తంగా తిరిగే లక్షలాది మంది ప్రజలకు UberX ఒక ముఖ్యమైన మలుపు, మరియు వినియోగదారులకు మరిన్ని ఎక్కువ ఎంపికలు, అవకాశాలను అందించడానికి అదే సృజనాత్మక చాతుర్యాన్ని Uber వర్తింపజేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను.... కేవలం ఒక బటన్‌ నొక్కడంతో వీల్‌చైర్-సదుపాయం ఉన్న వాహనాలు అవసరమయ్యే వ్యక్తులు కావలసినపుడు రైడ్‌ను పొందడానికి WAV వీలు కల్పిస్తుంది.”

-టోనీ కోయెల్హో, సహ రచయిత, వైకల్యాలు ఉన్న అమెరికా ప్రజల చట్టం

“ఈ శతాబ్దంలో ఇప్పటివరకు నా మరియు ఇతర అంధుల స్వాతంత్రతలో Uber అత్యంత ముఖ్యమైన పురోగతి అని నేను నమ్ముతున్నాను.”

—మైక్ మే, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, BVI వర్క్‌ఫోర్స్ ఇన్నోవేషన్ సెంటర్, Envision Inc.

వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న రైడర్‌లు

Uber యాప్ పూర్తిగా పనిచేయడానికి ఆడియో అవసరం లేదు. కనిపించే మరియు వైబ్రేటింగ్ హెచ్చరికల వంటి సహాయక టెక్నాలజీ, వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న రైడర్‌లకు Uber యాప్‌ను సులభంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది మరియు గమ్యస్థానం ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం వంటి యాప్‌లోని సదుపాయాలు రైడర్ మరియు డ్రైవర్ మధ్య మాటలు లేని సంభాషణను సులభతరం చేస్తాయి.

సహాయం అవసరమయ్యే రైడర్‌లు

Uber లో, ప్రతిఒక్కరికీ, ప్రతిచోటా రవాణా పరిష్కారాల అందుబాటును పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. అదనపు సహాయాన్ని కోరుకునే వ్యక్తులకు సాయం అందించడానికి Assist రూపొందించబడింది. ప్రయాణికులను తమ వాహనాలలోకి ఆహ్వానించడంలో సహాయపడటానికి అధిక రేటింగ్ ఉన్న డ్రైవర్‌లు Assistతో ఇతర సంస్థల నుండి స్వతంత్ర శిక్షణ పొందవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో Assist అందుబాటులో ఉంది.

వైకల్యాలు ఉన్న Uber Eats కస్టమర్‌లు

అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్న వినియోగదారులు

iOS VoiceOver మరియు Android TalkBack‌తో, ఒక్క బటన్ నొక్కడంతో అంధులు లేదా తక్కువ దృష్టి ఉన్న వినియోగదారులు రెస్టారెంట్‌ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయడాన్ని Uber Eats యాప్ సులభతరం చేస్తుంది. ఈ సౌలభ్య సామర్థ్యాల సదుపాయాలతో Uber Eats యాప్‌ను ఎలా ఉపయోగించాలో చూడండి.

వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న వినియోగదారులు

Uber Eats యాప్ పూర్తిగా పనిచేయడానికి ఆడియో అవసరం లేదు. కనిపించే మరియు వైబ్రేటింగ్ హెచ్చరికల వంటి సహాయక సాంకేతిక, వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న వినియోగదారులకు Uber Eats యాప్‌ను సులభంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. డెలివరీ స్థానాన్ని ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం వంటి యాప్‌లోని సదుపాయాలు కస్టమర్ మరియు డెలివరీ వ్యక్తి మధ్య మాటలు లేని సంభాషణను సులభతరం చేస్తాయి.

వైకల్యాలు ఉన్న డ్రైవర్‌లు

చలన సంబంధ వైకల్యాలు ఉన్న డ్రైవర్‌లు

చలన సంబంధ వైకల్యాలు ఉన్న వ్యక్తుల కోసం

Uber ఆర్థిక అవకాశాలను అందిస్తుంది. మార్పు చేసిన వాహనాలను మరియు చేతి నియంత్రణలను ఉపయోగించే డ్రైవర్‌లను Uber ప్లాట్‌ఫారమ్‌లోకి Uber స్వాగతం తెలుపుతుంది. చట్టబద్ధంగా డ్రైవ్ చేయగలిగే ఎవరైనా Uber‌తో డ్రైవ్ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న డ్రైవర్‌లు

చెవుడు లేదా వినికిడి లోపాలు ఉన్న డ్రైవర్‌లకు Uber తగిన ఆర్థిక అవకాశాలను అందిస్తోంది. Uber ప్లాట్‌ఫామ్‌లో వేలాది మంది చెవిటి వారైన, వినికిడి లోపాలు ఉన్న డ్రైవర్‌లు వినికిడి బాగా ఉన్న డ్రైవర్‌ల కంటే నెలకు సగటున ఎక్కువ రైడ్‌లు వెళ్తున్నారు. వినికిడి సమస్యలు ఉన్న డ్రైవర్‌లు సమిష్టిగా లక్షలాది డాలర్‌లను సంపాదించారు—ఇదంతా ప్రజలు ప్రయాణించడానికి సహాయపడటం ద్వారా ఆర్జించారు.

సెప్టెంబర్ 2016లో, రుడెర్మాన్ ఫ్యామిలీ ఫౌండేషన్ Uberను వైకల్యాలు ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ముందున్న 18 కంపెనీలలో ఒకటిగా గుర్తించింది.

“Uberతో డ్రైవింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి వినికిడి లోపం ఉన్న సమూహానికి అపూర్వమైన సదుపాయాన్నిఅందిస్తూ, Uber వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్నవారు వాడగల సాంకేతికతను నేరుగా వారి యాప్‌కి జత చేసింది. CSDతో ఈ భాగస్వామ్యం వినికిడి లోపం ఉన్న డ్రైవర్‌లకు రైడ్‌లు ఇవ్వడానికి ఒక అసాధారణ అవకాశం అందిస్తుంది—ఇది ప్రజల మధ్య బేధాలను తగ్గించే అవకాశం, అలాగే వినికిడి లోపంకలవారి సామర్థ్యాలు మరియు మానవత్వం గురించి అవగాహనను ప్రభావితం చేస్తుంది.”

—క్రిస్ సూకప్, CEO, చెవిటి వారికోసం కమ్యూనికేషన్ సర్వీస్

వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న డ్రైవర్‌ల కోసం ఉత్పత్తి సదుపాయాలు

అదనంగా, వినలేని స్త్రీ, పురుషుల అవకాశాలను విస్తరించడానికి యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద వినలేనివారి నేతృత్వంలోని స్వచ్ఛంద సేవా సంస్థ అయిన కమ్యూనికేషన్ సర్వీస్‌ ఫర్ ద డెఫ్తో మేము భాగస్వామ్యం అయ్యాము. వీటితో పాటు, వినలేనివారి జాతీయ సంఘం మరియు వనలేని, వినికిడి కష్టంగా ఉన్న వారి టెలికమ్యూనికేషన్‌లు (TDI)తో సహా వినలేని వారి సంఘ సభ్యులతో కలిసి డ్రైవర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పూర్తి ఐచ్ఛిక సామర్థ్యాలు గల ఉత్పత్తిని రూపొందించడానికి మరియు అమలు చేయడానికి కూడా పనిచేశాము:

యాప్‌లో ఈ సదుపాయాలను ప్రారంభిస్తుంది

డ్రైవర్‌లు వినలేనివారు లేదా వినికిడి కష్టం కలవారిగా డ్రైవర్ యాప్‌లో స్వయంగా గుర్తించవచ్చు, ఇది డ్రైవర్‌లు మరియు వారి రైడర్‌ల కోసం ఈ క్రింది సదుపాయాలు అందేలా చేస్తుంది.

ట్రిప్ అభ్యర్థనను ఫ్లాష్ చేస్తుంది

Uber డ్రైవర్ యాప్‌ కొత్త ట్రిప్ అభ్యర్థనను లైట్‌ వెలుగుతూ మరియు ఆడియో సూచన ద్వారా చూపిస్తుంది. రైడ్‌ను అందించి కొంత డబ్బు సంపాదించే కొత్త అవకాశం ఉన్నప్పుడు డ్రైవర్‌లు దానిని గమనించడాన్నిఇది సులభం చేస్తుంది.

కాల్‌కి బదులు టెక్స్ట్-సందేశం మాత్రమే

వినలేని లేదా వినికిడి కష్టంగా ఉన్న డ్రైవర్‌ను కాల్ చేసే సామర్థ్యం రైడర్ లకు ఆఫ్ చేయబడింది. బదులుగా, రైడర్‌లు డ్రైవర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంటే వారికి సందేశం పంపమని సూచించబడతారు. ఈ సెట్టింగ్‌ను ఉపయోగించే డ్రైవర్‌లకు ఫోన్ కాల్ విఫలమైన తర్వాత రైడ్‌లు రద్దు అయ్యే అవకాశం తక్కువ.

రైడర్‌ని గమ్యస్థానాన్ని కోరడం

రైడర్‌లు తమ గమ్యస్థానాన్ని ప్రవేశ పెట్టవలసిందిగా యాప్‌‌ ఒక అదనపు ప్రాంప్ట్‌ని జోడించి, వారి డ్రైవర్ వినికిడి సమస్యను కలిగి ఉన్నారని వారకి తెలుసేలా చేస్తుంది. ఈ ఏర్పాటును ప్రారంభించిన డ్రైవర్ రైడ్‌ని అంగీకరించాక, రైడర్‌ తమ స్క్రీనుపై గమ్యస్థానాన్ని కోరడాన్ని చూస్తారు. రైడ్ ప్రారంభమైన తర్వాత Uber మలుపుల వారగా దిశలను  అందించగలదు.

ఈ సదుపాయాల గురించి మరింతగా తెలుసుకోవడానికి,ఈ వీడియో చూడండి.

సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము

సహాయం మరియు మద్దతు

మీ Uber ఖాతా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, తరచుగా అడిగే ప్రశ్నలను బ్రౌజ్ చేయడానికి లేదా ఇటీవలి ట్రిప్‌పై అభిప్రాయాన్ని అందించడానికి మా సహాయక కేంద్రాన్ని సందర్శించండి.

డ్రైవర్‌కి సంబంధించిన వనరులు

వైకల్యాలు ఉన్న రైడర్‌లను రవాణా చేయడం గురించి మరింత తెలుసుకోవడానికి మీకు ఆసక్తిగా ఉన్నట్లయితే మా డ్రైవర్‌ల వనరులను చూడండి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو