Please enable Javascript
ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మా గురించి

ప్రపంచానికి మెరుగైన రవాణాను అందించే మార్గాన్ని మేము తిరిగి ఊహిస్తున్నాం.

ఉద్యమమే మనకు శక్తి. అది మన జీవనాధారం. ఇది మన నరనరాల్లో ప్రవహిస్తుంది. ఇది ప్రతి ఉదయం మనల్ని నిద్ర లేపుతుంది. మనం ఎలా మెరుగ్గా ప్రయాణాలు చేయగలం అని నిరంతరం తిరిగి ఊహించుకోవడానికి ఇది మనల్ని పురికొల్పుతుంది. మీ కోసం. మీరు వెళ్లాలనుకునే అన్ని ప్రదేశాలకు. మీరు పొందాలనుకునే అన్నిటి కోసం. మీరు సంపాదించాలని అనుకునే అన్ని మార్గాల కోసం. ప్రపంచం అంతటా. వాస్తవ సమయంలో. ఇప్పటి నమ్మలేని వేగంతో.

  • మేము Uber. మాది ఒక ఉత్సాహభరితమైన సంస్థ. ప్రజలు ఎక్కడికైనా వెళ్లి ఏదైనా సంపాదించేందుకు, వారి మార్గంలో సంపాదించడానికి సహాయం చేయాలనే మా లక్ష్యం పట్ల అలుపెరగకుండా శ్రమించే వాళ్ళం. గమనమే మా శక్తి. అదే మా జీవనాధారం. ఇది మా నరనరాల్లో ప్రవహిస్తుంది. ఇది ప్రతి ఉదయం మనల్ని నిద్ర లేపుతుంది. మనం ఎలా మెరుగ్గా ప్రయాణాలు చేయగలం అని నిరంతరం తిరిగి ఊహించుకోవడానికి ఇది మమ్మల్ని పురికొల్పుతుంది. మీ కోసం. మీరు వెళ్లాలనుకునే అన్ని ప్రదేశాలకు. మీరు పొందాలనుకునే అన్నింటి కోసం. మీరు సంపాదించాలని అనుకునే అన్ని మార్గాల కోసం. ప్రపంచం అంతటా. వాస్తవ సమయంలో. ఇప్పటి నమ్మలేనంత వేగంతో.

    ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ప్రయాణం చేయడానికి సహాయపడటానికి మేము భౌతిక మరియు డిజిటల్ ప్రపంచాలను అనుసంధానించే సాంకేతిక సంస్థగా ఉన్నాము. ఎందుకంటే ప్రయాణం అందుబాటులో ఉండాల్సిన ప్రపంచాన్ని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మీరు సురక్షితంగా ప్రయాణించవచ్చు మరియు సంపాదించవచ్చు. మన భూమండలానికి భరించతగ్గ రీతిలో. మీ లింగం, జాతి, మతం, సామర్థ్యాలు లేదా లైంగిక ధోరణితో సంబంధం లేకుండా, స్వేచ్ఛగా మరియు భయం లేకుండా తిరిగే మరియు సంపాదించే మీ హక్కును మేము సమర్థిస్తాము. వాస్తవానికి, మనం దీన్ని ఎప్పుడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. కానీ మేము వైఫల్యానికి భయపడం ఎందుకంటే అది మమ్మల్ని మెరుగ్గా, తెలివైవారిగా మరియు బలవంతులుగా చేస్తుంది. మా కస్టమర్‌లు, స్థానిక కమ్యూనిటీలు మరియు నగరాలు, మా అసాధారణమైన వైవిధ్యత కలిగిన అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా మంచిగా పని చేయడానికి ఇది మాకు మరింత నిబద్ధత కలిగిస్తుంది.

    Uber అనే ఆలోచన 2008లో పారిస్‌లో మంచు కురిసే రాత్రిలో పుట్టింది మరియు అప్పటి నుండి, మా పున:కల్పన మరియు పునరావిష్కరణ యెుక్క DNA కొనసాగుతోంది. మేం అనువైన ఆదాయాలు, వ్యక్తులు మరియు వస్తువుల కదలికలను ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న మార్గాల్లో శక్తివంతం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫారంగా ఎదిగాము. మేము 4 చక్రాల రైడ్‌ల నుండి 2 చక్రాల రైడ్‌ల వరకు అక్కడి నుండి 18-చక్రాల ఫ్రైట్ డెలివరీలకు ఎదిగాము. టేక్అవుట్ మీల్స్ దగ్గర నుండి రోజువారీ నిత్యావసరాలు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వరకు మీకు ఏ సమయంలో ఏం కావాలన్నా మరియు మీ మార్గంలో సంపాదించుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు ఉన్న డ్రైవర్‌ల నుండి రియల్ టైమ్ ధృవీకరణ వరకు, ప్రతి రోజూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. Uber వద్ద, పునఃకల్పన అన్వేషణ ఎప్పటికీ పూర్తి కాలేదు, ఎప్పటికీ ఆగదు మరియు ఎల్లప్పుడూ అప్పుడే ప్రారంభమైనట్లుగా ఉంటుంది.

మా CEO లేఖ

మా అంతర్జాతీయ ప్లాట్‌ఫారంలోని ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి సహాయపడే టెక్నాలజీని అందించడంలో మా బృందం నిబద్ధత గురించి చదవండి.

స్థిరత్వం

2040 నాటికి 100% రైడ్‌లు ఉద్గార రహిత వాహనాల్లో జరిగే, ప్రజా రవాణాలో లేదా మైక్రోమొబిలిటీతో పూర్తిగా విద్యుత్, ఉద్గార రహిత ప్లాట్‌ఫారంగా మారడానికి Uber కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫారంగా వాతావరణ మార్పుల సవాలును మరింత ధీటుగా ఎదుర్కోవడం మా బాధ్యత. రైడర్‌లకు పర్యావరణ హితమైన రైడ్ చేయడానికి మరిన్ని మార్గాలను అందించడం, ఎలక్ట్రిక్‌కు మారడంలో డ్రైవర్‌లకు సహాయం చేయడం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే స్వచ్ఛమైన మరియు పూర్తిగా విద్యుత్‌కు మారటాన్ని వేగవంతం చేయడంలో సహాయపడటానికి స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రైవేట్ రంగాలతో భాగస్వామ్యం ద్వారా మేము దీన్ని చేస్తాం.

రైడ్‌లు మరియు అంతకు మించి

రైడర్‌లకు పాయింట్ A నుండి పాయింట్ B కి చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనడంలో సహాయపడటంతో పాటు, ప్రజలు వేగంగా మరియు సరసమైన రీతిలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి, ఆరోగ్య సంరక్షణకు అడ్డంకులను తొలగించడం, కొత్త ఫ్రైట్-బుకింగ్ సేవలను సృష్టించడం మరియు సంస్థలకు ఆటంకం లేని ఉద్యోగుల ప్రయాణ అనుభవాన్ని అందించడంలో సహాయం చేస్తున్నాం. మరియు ఎల్లప్పుడూ డ్రైవర్లు మరియు కొరియర్‌లు సంపాదించడంలో సహాయపడుతున్నాం.

మీ భద్రతే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది

మీరు వెనుక సీటులో ఉన్న రైడర్ అయినా లేదా వాహనాన్ని నడిపే డ్రైవర్ అయినా, మీ భద్రత మాకు ముఖ్యం. మేము మా వంతు కృషి చేయడానికి కట్టుబడి ఉన్నాం, మా విధానంలో సాంకేతికత అతి ముఖ్యమైనది. భద్రతను మెరుగుపరచి, ప్రతిఒక్కరికీ సులభంగా వెళ్లడంలో సహాయపడటానికి మేము భద్రతా నిపుణులతో భాగస్వామ్యం కలిగి ఉండటం ద్వారా కొత్త సాంకేతికత మరియు విధానాలను అభివృద్ధి చేస్తాం.

కంపెనీ సమాచారం

Uberను ఎవరు ముందుకు నడిపిస్తున్నారు

Uber లో మేం రైడర్‌లు, డ్రైవర్‌లు మరియు ఉద్యోగుల కోసం సరైన సమయంలో, సరైన పనిని చేయటానికి ప్రాధాన్యతనిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముందుకు నడిపిస్తున్న బృందం గురించి మరింత తెలుసుకోండి.

వైవిధ్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం

అందరినీ కలుపుకొని పనిచేసే, మరియు మేము సేవలు అందిస్తున్న నగరాల వైవిధ్యాన్ని ప్రతిబింబించే కార్యాలయాన్ని సృష్టించడం మా లక్ష్యం మరియు - ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలాగే ఉండగలరు మరియు ఆ యదార్ధతే ఒక బలంగా కొనియాడబడుతుంది. ప్రతి రంగం నుండి ప్రజలు అభివృద్ధి చెందగల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, మేము Uber ను మా ఉద్యోగులు మరియు మా కస్టమర్‌ల కోసం మెరుగైన సంస్థగా రూపొందిస్తాం.

చిత్తశుద్ధితో వ్యవహరించడం

Uber ఎథిక్స్ & కాంప్లయన్స్ ప్రోగ్రామ్ ఛార్టర్ సంస్థలోని అత్యున్నత స్థాయిలో సమగ్రతకు మా నిబద్ధతను తెలియజేస్తుంది. నైతిక సంస్కృతికి పారదర్శకత కీలకం; మేము మా సమగ్రత హెల్ప్‌లైన్, సాధించగల మరియు సమర్థవంతమైన సమ్మతి కార్యక్రమాల సూట్ ద్వారా దీనిని సాధిస్తాం.

తాజా విషయాలను తెలుసుకుంటూ ఉండండి

న్యూస్‌రూమ్

మీకు సమీపంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్యాలు, యాప్ అప్‌డేట్‌లు, ప్రయత్నాలు మరియు మరిన్నింటి గురించి ప్రకటనలను పొందండి.

బ్లాగ్

కొత్త ప్రదేశాలను కనుగొనండి, అలాగే Uber ఉత్పత్తులు, భాగస్వామ్యాలు మరియు మరిన్నింటి గురించి తెలుసుకోండి.

పెట్టుబడిదారు సంబంధాలు

ఆర్థిక నివేదికలను డౌన్‌లోడ్ చేయండి, తర్వాతి త్రైమాసిక ప్రణాళికలను చూడండి, మా కార్పొరేట్ బాధ్యతా ప్రోత్సాహ కార్యక్రమాల గురించి చదవండి.

మాతో మళ్లీ ఊహించుకోండి.

మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి
বাংলাEnglishहिन्दीಕನ್ನಡमराठीதமிழ்తెలుగుاردو